Sunday, July 28, 2013

చెట్లు శపిస్తాయి

చెట్లు
తపిస్తాయి
చెట్లు
శపిస్తాయి
నీటి కోసం
తపిస్తాయి
ఎండి పొతే
శపిస్తాయి
చెట్లు మాట్లాడుతాయి
చెట్లు ఏడుస్తాయి
అషాడంలో ఆడుకొంటాయి
వైశాఖంలొ ఏడ్చుకొంటాయి
దయలేని మానవుల్లారా !
మా గుండెల్ని చీల్చకండి
మా తలల్ని నరకకండి
కొమ్మల చిట్టి తల్లులు
ముద్దులొలుకుతున్న
మా చిన్నారి పూమొగ్గల్ని
చిదమకండి
మా గొంతు తడపడానికి
చుక్క నీరందకుండా
సిమెంటు రోడ్లు తో  నింపేశారే!
పచ్చని  చెట్లున్నఅడవుల్ని
అభివృద్ధి పేరుతొ
దహించి వేసారే!
దయ లేని మనుష్యు లారా !
మీ కిది న్యాయమా?
కాకులు దూరని కారడువులు లేవు
చీమలు దూరని చిట్టడవుల్లేవు
పచ్చని చెట్ల మీద  వాలే పక్షులు లేవు
తళ తళ లాడే తటాకులు లేవు
మమ్మల్ని కాపాడే  ఆదివాసీలు  లేరు
మనిషి  మళ్లి మనిషయితే  తప్ప
మా  బ్రతుకులు  మళ్లి  చిగురింపవు!






 

Wednesday, July 24, 2013

సమస్యా పూరణం


సమస్యల
రహస్యాలెమిటో
ఇంతవరకూ నాకర్థం గావడం లేదు
జీవిత మంతా
సమస్యల వలయమే!
ఒక్కొక్క సమస్యా
జారుడు మెట్లులా
వదల గొడుతూంటే
పిల్లాడొదుల్తున్న
సబ్బు బుడగల్లా
మళ్ళీ పుట్టుకొస్తున్నాయి
దూది పింజల్లా
గాలి లోకి సర్రున ఎగురుతున్నాయి
ఆశల మిణుగురు పురుగులు
ఈత చెట్లల్లో తిరుగుతున్నప్పుడు
ఆ కటిక చీకట్లలో
అక్కడక్కడా వెలుతురు చుక్కలు
కనపడుతున్నాయి
ప్రతి సమస్యా
ఒక సిస పద్యమై 
ఛందస్సు రాక
సమస్యా పూరణం చేత గాక 
అసంతృప్తి పురాణాన్ని
వ్రాస్తూనే  వున్నాను .

24.07.2013
( నా 'సాగర మథనం' సంకలనం నుండి -1990 లొ రాసినది )    


 

Tuesday, July 23, 2013

జెనెరేషన్ గ్యాప్

జెనెరేషన్ గ్యాప్


మా భవనాలు మొలుస్తున్నాయి
మా పునాదులు పూస్తున్నాయి
మా కాంక్రీట్ తో కట్టిన గోడలు
పగల బడి నవ్వుతున్నాయి
మా రంగుల కొంపలు
సీతాకోక చిలుకల్లా ఎగురుతున్నాయి
మేము కట్టుకొన్న అశా సౌధాలు
మా శవ పేటికలో భద్రంగా దాచ బడ్డాయి
మేము నిలబెట్టిన సిమెంట్ దిమ్మెలు
మా శరీరాలకు వెన్నెముక గా నిలబడ్దాయి
మా చెమట బిందువులతో తడిసిన
ఈ తోట బంగారు కాయలు కాచింది
మా అడుగుల ముద్రలతొ
ఈ నేల పచ్చని చిత్తరువుగా మారింది
మేము కట్టుకొన్న ఆశాసౌధాల్లో
కొన్నేళ్ళ్ తర్వాత మా ఆత్మలు తిరుగుతాయి
మెము మరణించిన తర్వాత
మా ముని మనమలు మా చిరునామా కోసం వెదుకుతారు
మేము వదలి పోయిన వెండి కంచాల్లొ
వాళ్ళు పంచ భక్ష్య పరమాన్నాలు తింటారు
మేము రహస్య పేటికలలో దాచుకొన్న
స్వర్ణ స్మృతులను వాళ్ళు బయటికి విసిరి వెస్తారు
మెము కాపాడిన సభ్యతను
వాళ్లు ఫినాయిల్ తో కడిగి వేస్తారు
మేము పెంచిన సంస్కారాన్ని
వాళ్ళు భూస్థాపితం చేస్తారు
మేము కట్టిన భవంతుల్లో
వాళ్ళు డాలర్ల ముళ్ళను పరచి వేస్తారు
విదేశీ వ్యామోహములో
తరాలు మారాయి
అంతరాలు మారాయి
ఇప్పుడు ఆ ఇల్లు
జీవం లేని శిల్పంగా పడి ఉంది
ఆ ఇల్లు నిశ్శబ్ధ గీతమయ్యింది .


Sunday, July 21, 2013

నిశ్శబ్ద గీతం

నువ్వెప్పుడైనా నిశ్శబ్ద గీతం విన్నావా?
ఒక్క సారి ఏకాంతంలో నీ  చెవులలో మ్రోగే  ఓంకారనాదాన్ని విన్నావా?
చూరు నుండి బొట్టు బొట్టు కారే నీటి శబ్దం లో ఒక రాగం విన్నావా ?
నీ  స్నానాల గదిలో నీటి భాష ను విన్నావా ?
సన్నని తుంపర చేసే   సరికొత్త  రాగం విన్నావా?
ఆషాడ మాసంలో తల లూపే  చెట్లలో వినపడే ఆనంద  రాగం  విన్నావా?
రైలు వెంబడి పరుగెత్తే మేఘాలు పాడే  మోహన  రాగం విన్నావా?
సంధ్యా సమయంలో పక్షలు జేసే జుగల్ బంది విన్నావా?
సాయంకాలపు నీరెండలొ సముద్రం జేసే సవ్వడి రాగం విన్నావా?
టిక్ టిక్ మంటూ గడియారపు ముళ్ళు జేసే లయ విన్యాసం విన్నావా?
శ్రీమతి జేసే గాజుల సవ్వడి విన్నావా ?
అందాల పాప కు తొడిగిన గజ్జెల సవ్వడి  విన్నావా?
గంగిరెద్దుల వాడి విన సొంపయిన సన్నాయి రాగం విన్నావా?
రాగ రంజిత మైన జీవన రాగం విన్నావా?



 

Friday, July 19, 2013

ఎంతయినా నేను చె త్తబుట్ట నే గదా !


ఎంతయినా నేను చె త్తబుట్ట నే గదా !

అవును
నేను చెత్త బుట్ట నే !
కాళ్ళతో తన్నినా ఓ మూల పడి ఉంటాను 
మీ పాద ధూళీతో పునీతమవుతాను
నేను చెత్తబుట్ట ను
మీరు నా వైపు కన్నెత్తయినా చూడరు
కాని నా అవసరం మీకెపుడూ  వుంటుంది
ఇళ్ళల్లో , అఫిసుల్లొ
మీరు తినేసిన ఎంగిళ్ళను, చీకేసిన తోక్కళ్ళను
మీరు విసిరేసిన చిత్తు కాగితాలను
నన్ను నింపడానికి మాత్రమె
నేను గుర్తుకు వస్తాను
నన్ను తాకాలంటే మీకు భయం
నా బాక్టీరియా తో మీరు హైరానా పడతారు
నన్ను కాళ్ళతో నొక్కి నా నోరు తెరుస్తారు
'అమ్మా    చెత్త '   అనే మున్సిపాలిటీ అబ్బాయి మాత్రమె
నన్ను ప్రేమగా చూసుకొం టా డు
నాలో చెత్తను తీసేసి మీ కిస్తాడు  
మళ్లి మీరు నన్ను ఒక మూలకి నెట్టేస్తారు
అందరికి ఊడిగాలు     చేస్తున్నా-
 కానీ  మీ ఇంట్లో  పోపుల డబ్బా  కున్న విలువ నాకు లేదు
ఇంట్లోనే అంటరాని దాన్ని అయిపొయ్యాను   
ఎంతయినా నేను చె త్తబుట్ట నే  గదా !                                   

 (ఎందుకో ఆఫీసులో  ప్రొద్దున్నేచె త్తబుట్ట కాళ్ళకి తగిలింది .చి రాకుగా కాళ్ళతోనే మూలకి తోసేసిన వెంటనే దాని ఆత్మ నాతొ మూగగా మాట్లాడింది , ఆ స్పందనే ఈ కవిత )       

Thursday, July 18, 2013

చెట్లు

చెట్లు 


చెట్లిప్పుడు చెరచ
బడ్ద అడవి తల్లులు 



చెట్లిప్పుడు చిగురు
కొమ్మలని కనలేని
గొడ్రాళ్ళు



చెట్లిప్పుడు పక్షుల
గూళ్ళకు పనికి రాని
ప్రాంగణాలు


 
చెట్లిప్పుడు శిలువకు
బలి అయిన
ఏసుక్రీస్తులు


 
చెట్లిప్పుడు తలలు
నరికిన మొండెములు

చెట్లిప్పుడు తోడు
లేని అనాధ ప్రేతాలు

చెట్లిప్పుడు కాళ్ళు
లేని సైనికులు 

 
చెట్లిప్పుడు నీడ
నివ్వలేని నిశాచరులు

చెట్లిప్పుడు గుడ్ల
గూబలకు అవారాలు

చెట్లిప్పుడు
మరణానికి రాసుకొన్న
ఉత్తరాలు



చెట్లిప్పుడు
కాష్టానికి పనికొచ్చే
పాడె కట్టెలు    



చెట్లిప్పుడు మనిషి
ప్రేమకు దూరమైన
అభాగ్యులు




 This is about trees which are inhumanly cut by people either
for road widening , or making business like sandal wood
trees or deforestation for construction of projects
etc.This is the anguish of a poet how trees are
suffering in the hands of selfish man kind under the
present circumstances.



Wednesday, July 17, 2013

బడి బువ్వ



బడి బువ్వ
మింగెసింది
బడి భోజనం
విషమయ్యింది
అన్నెం పున్నెం ఎరుగని
చిన్నారుల పాలిట పాషాణ మయ్యింది
చదువు చెప్పే బడులా
లేక పిల్లల పాలిట నరక కూపాలా ?
ఉపాధ్యాయులే యమ కింకరులా ?
అన్నం కోసం
ఆకలి కోసం
బీదా బిక్కీ
చదువు కోసం
మంచి భవిత కోసం
పిల్లల్ని పంపిస్తే
భావి భారత పౌరుల్ని చెయ్యాల్సిన బడులు
శవాల్ని చేసి పంపిస్తారా ?
అవినీతి రాక్షసుల
ఆగడాలకు పరాకాష్టా ఇది ?

(బీహార్ లో నిన్న(  16-07-2013 )చాప్రా  అనే ఊరి స్కూల్లో 20 మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తిని
ప్రాణాలు పోగొట్టుకొన్న సంద ర్భంగా స్పందించి రాసిన కవిత )
 

Thursday, July 11, 2013

పరాన్న జీవులు


కొందరు చిలవలు పలవలు గా
అబధ్దాల కత్తులకు పదునులు పెడుతూ
కాలం గడుఫుతూ ఉంటారు
వాళ్ల రక్తంలో చక్కెర అధిక శాతం ఉంటుంది
కాని వాళ్ళు మధు మేహ వ్యాధి గ్రస్థులు గాదు
వాళ్ళు తియ్యగా మాట్లాడ గలరు
అడవిలో పూచే రాక్షస పూలు వంటి వారు
వాలిన ప్రతి జీవాన్ని కూడ బలుక్కుని
అమాంతంగా నోట్లోకి జార విడుచు కొంటారు
నింపాదిగా కూర్చొని రక్తాని జుర్రు కొంటారు
అవసరానికి ఆసరా ఇవ్వరు వాళ్ళు
అప్పనంగా వచ్చి పచ్చని చెట్టు మీద వాలే పక్షుల్లా వాలుతారు
అందని ద్రాక్ష పళ్ళ కోసం అర్రులు చాచే రకం వాళ్ళు
వాళ్ల పిడి వాదానికి మీరు మీ పిడికిళ్ళు తెరుస్తారు
మీ గుండె కేరింతలు కొడుతుంది చిన్నపిల్లలా
మీరు హిప్నటైజ్ చేసిన వ్యక్తిలా వాళ్ళు చెప్పింది చేస్తారు
ఆకాశంలొ హరివిల్లుని అనుకొన్నప్పుడు చూపించ గలరు
అవధూత లక్షణాలు వాళ్ళళ్ళో ఎక్కువుంటాయి
కానీ వాళ్ళు మాయలేడి రూపంలో ఉన్న మారీచులు
అద్దంలో వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోలేరు
నీ ముఖాన్నే అద్దంగా మార్చి వాళ్ళు చూసుకొంటారు
నీ కనుపాపల్లొంచి వెలుతుర్ని వాళ్ళు వెతుక్కొంటారు
నీ ముక్కు లోంచి వాళ్ళు శ్వాసని పీల్చ గలరు
వాళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళు
వాళ్ళే పరాన్న జీవులు

Wednesday, July 10, 2013

సమస్యా పూరణం

సమస్యల
రహస్యాలేంటో
ఇంతవరకూ
నా కర్థం కావడం లేదు
జీవిత మంతా
సమస్యల వలయమే
ఒక్కొక్క సమస్యా
జారుడు మెట్లలా
... వదల గొడుతుంటే
పిల్లాడొదుల్తున్న గాలి బుడగల్లా
మళ్ళీ పుట్టుకొస్తున్నాయి
దూది పింజల్లా
గాలిలోకి సర్రున ఎగురుతున్నాయి
ఆశల మిణుగుఱు పురుగులు
ఈత చెట్లల్లో తిరుగుతున్నప్పుడు
ఆ కటిక చీకట్లలో
అక్కడక్కడా వెలుతురు చుక్కలు
కనపడుతున్నాయి
ప్రతి సమస్యా
ఒక సీస పద్యమై
ఛందస్సు రాక
సమస్యా పూరణం చేత గాక
అసంతృప్తి పురాణాన్ని
వ్రాస్తూనే ఉన్నాను.

( నా సంకలనం 'సాగర మథనం' (2000 మార్చ్)' నుండి

గర్భం దాల్చిన బస్సు

గర్భం దాల్చిన స్త్రీ లా ఉంది బస్సు
వూపిరి స్పౄహ తప్పి పడిపొతుందేమోనన్న భయం
ఆవిరి శబ్ధాల ప్రభుద్దులు కొందరు
చెవులు బద్ధలు కొట్టి
మౄత్యు కుహరాల్లొకి నెట్టించేస్తున్నారు
వాక్ తుంపర ప్రళయంలొ తడిసి మోపెడవుతున్నారు కొందరు
ఆ మౄత్యుంజయుల హక్కుల ప్రతిధ్వనులు
ఎద లయలలో సిలువలు మోస్తున్నాయి
... నింపాదిగా అనాదిగా
ఆ రోడ్డు హౄదయానికి హత్తుకొని పారాడుతుంది బస్సు
బస్సు చక్రాల ముద్దులతో విలిప్తమై
గ్రామం మసక బారిన మొద్దులా ఎదురేగింది
దుమ్ము లేపిన బస్సు
నమ్మకంగా వూరు చేరింది
నమ్మక్ హరాం గాదని ప్రూవ్ చేసింది
దప్పికైన బస్సు గొంతులో
నీటి చుక్కలు ఒలక బొసిన దేవుడన్న డ్రైవర్
విష్ణు చక్రం లాంటి స్టీరింగ్ తొ
'ధర్మ సంస్థాపనర్థాయాం' ఉద్భవించినట్లున్నాడు
టిక్కెట్ల గుండెల
ఇక్కట్లను మరచి పరపరమని చింపాడు
ఆ విశిష్ట గుణ సంపన్నుడు - కండక్టరు
గర్భం దాల్చిన బస్సు ప్రసవించింది-
కులం మతం ధనిక బీద తేడా తెలియని పయనాన్ని!

(నా కవితా సంకలనం ' సాగర మథనం (మార్చ్ 2000)నుండి)

మొక్కలా....సాగిపో...!!

బద్ధ లైన కోట బురుజుల్లోన
పాడు బడిన ఇంటి గోడల నెర్రుల్లొన
శిధిల గాలి గోపురాల పైన
ఒక మర్రి మొక్క మొలకెత్తుతోంది
ఆశ్చర్యం వేస్తుంది నాకు !
నీరు లేక పోయినా, ఎరువు లేక పోయినా
మట్టి లేక పోయినా, పాదు లేకపొయినా
... ఒక మొక్క అలా ఎలా పెరుగుతోందని?
నిరాశా నిస్పృహల మధ్య
ప్రతికూలమైన పరిస్థితుల మధ్య
ఒక చిన్నారి మొక్క మాను గావడానికి
బ్రతకడానికే అవకాశం లేని అవస్థల మధ్య
అరాట పడుతోంది తనూ ఒక వృక్షం గావాలని
అందుకే - ఓ తమ్ముడా
అవకాశాలు లేవనుకోకు
అకాశమే హద్దు నీకు
ఆర్థికంగా చితికి ఫొయినా
నా అనే వారు లేక పోయినా
మొక్కవోని ధైర్యంతో మర్రి మొక్కలా
బ్రతకడం నేర్చుకో
ఎవ్వరో ఒకరు దయ తలచి
తన తోటలో తావిచ్చి రోజూ కడివెడు నీళ్ళు కుమ్మరిస్తాడు
మర్రి మొక్కను మహా వృక్షంగా చేస్తాడు
ఏ మంచి మనిషో నీకు అసరాగా నిలుస్తాడు
నీ కలల ప్రపంచాన్ని నిజం చేస్తాడు
అప్పుడు నీవు గూడా -
మర్రి చెట్టులా పది మందికీ నీడ నిస్తావు !


09.07.2013

Monday, July 8, 2013

నేను రోజు ఏడుస్తున్నాను



నేను పుడుతూనే ఏడ్చాను
అమ్మ అక్కున చేర్చుకోంది
నేను స్కూల్ కి వెళ్లనని మారాం చేసాను
నాన్న ధైర్యం చెప్పాడు
నేను ఉద్యోగంలో చేరాను
అధికారి దిశా నిర్దేశం చేసాడు
నేను పెళ్లి చేసుకొన్నాను
శ్రీమతి నాలో సగమై నన్ను నడిపించింది
నేను పిల్లల్ని కన్నాను
వాళ్ళ ముద్దూ ముచ్చట తీర్చాను
నేను పిల్లలకు పెళ్లి చేశాను
అల్లుళ్ళు ,కోడళ్ళ కోర్కెలు తీర్చాను
నేను తాతయ్య నయ్యాను
మనవళ్ళు , మనమ రాళ్ళు కోసం ఆరాట పడ్డాను
నేను పదవి విరమణ చేసాను
వచ్చిన డబ్బంతా పిల్లలకు పంచాను
నేను జవసత్వాలు ఉడిగిన ముదుసలని అయ్యాను
ఇప్పుడు నేను రోజూ ఏడుస్తున్నాను ---
అందరు ఉన్నా ---
పలకరించే దిక్కులేక !!

కొందరి వృద్ధుల జీవితాల్ని చూసాక రాసిన కవిత
భాను    వారణాసి -08-06-2013



 

బాను బాణీలు



1

ఆడ పిల్లను కనగానే
దివాలా తీసినట్లు మొహం పెడతాడు తండ్రి
కట్నం, ఖర్చుల గురించి అలోచనే గానీ
ఇంట్లో శ్రీలక్ష్మి పుట్టిందని అలోచించడు !

2

వెర్రిమా లక్ష్మి పాపం పిచ్చితల్లి
అందరూ మంచి వాళ్లలాగానే కనబడ తారు
మనవాడే గద అని మనసు విప్పి మాట్లాడితే
పిచ్చి తల్లి ' రేప్' కి బలయ్యింది

3

పురుషాహాంకారం
ఎందరో స్త్రీ లను కాటేసింది
మగ వాడనే ఆహంభావం
మహిళల నొరు నొక్కేసింది
మళ్లి సమాన హక్కులు
ఊకదంపుడు ఉపన్యాసాలు

4

అక్క అన్న చెల్లి అమ్మ నాన్న
మానవ  సంభందాలన్ని   ఆర్థిక సంభందాలు అయ్యాయి
కరెన్సీ నోట్లతో  అనుబంధాల్ని  కట్టి పడేశారు