Sunday, August 4, 2024

రచయిత గురించి

 రచయిత గురించి

---------------------
వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో   జన్మించాడు. అతను 
కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.
 వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో  '*జీవితారణ్యం‌* ' అనే కథ అచ్చయ్యింది. 

తరువాత '*ఈ దేశం ఏమై పోతోంది*? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి.  *నల్లటి నిజం* , *జన్మ భూమి* , *అంతర్యుద్ధం* , *వాన దేముడా!*  లాంటి కథలు అచ్చు అయ్యాయి. 

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు. వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి..

*వీరి ముద్రిత రచనలు*
------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సర లో డాక్టర్ గోపీ గారి ముందు మాటతో 

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు *ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021*  అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు*: 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి  రావు గారు వ్రాసిన  కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా నవంబరు 2022 న   విడుదల చేశారు.కళా రత్న  శ్రీ బిక్కి  కృష్ణ గారు ముందు‌ మాట  వ్రాశారు.

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి*  త్వరలో వస్తుంది.

4 .  *నాయనకు జాబు*  అనే ధారావాహిక  ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను  వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు: 

1. ప్రతిలిపి కవితా  ప్రపూర్ణ 
2. సహస్ర కవి రత్న
3. సాహితీ భూషణ
4. గిడుగు రామమూర్తి  వారి సాహిత్య పురస్కారం 2022 లో.
5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021
6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 

*ఇతర వివరాలు*
 
1. కెనడా తెలుగు తల్లి వారి కవితల పోటీల్లో ' పుడమి తల్లి ' కవిత ఎంపిక ( జూన్ 2023).

2. జాగృతి, కథామంజరి , సహరి వార  పత్రిక  ,మన తెలుగు కథలు, గో తెలుగు.కామ్  ,  ప్రతిలిపి , సాహిత్య ప్రస్థానం ,  విమల సాహితీ  లాంటి అంతర్జాల  పత్రికలలో  కథలు..కవితలు ప్రచురిత మయ్యాయి.

3. *వారణాసి కథలు కవితలు* అనే యూ టూబ్ చానల్ ద్వారా  తన కథల్ని , కవితల్ని విశేషంగా వినిపిస్తున్నారు.

4. ఉషా పక్ష పత్రిక  వారు  నిర్వహించిన వెలగ పూడి  సీతారామయ్య స్మారక  వుగాది 31.03.2024 న కథల పోటీల్లో బహుమతి పొందిన కథ '  నువ్వే నా  పెద్ద కొడుకువి సామీ! ' 

5. తెలుగు  సాహితీ  వనం వారు  ప్రచురించిన ' అంతర్వాహిని '  లో నా కథ ' అమ్మ వీలునామా'  ప్రచురించారు.

6. మన తెలుగు కథలు .కామ్ వారి విజయ దశమి కథల పోటీల్లో 2023 , నా కథ ' అమ్మ అలిగింది ' కి ప్రధమ బహుమతి .





వారణాసి భానుమూర్తి రావు
27.07.2024

No comments:

Post a Comment