ఎంతయినా నేను చె త్తబుట్ట నే గదా !
అవును
నేను చెత్త బుట్ట నే !
కాళ్ళతో తన్నినా ఓ మూల పడి ఉంటాను
మీ పాద ధూళీతో పునీతమవుతాను
నేను చెత్తబుట్ట ను
మీరు నా వైపు కన్నెత్తయినా చూడరు
కాని నా అవసరం మీకెపుడూ వుంటుంది
ఇళ్ళల్లో , అఫిసుల్లొ
మీరు తినేసిన ఎంగిళ్ళను, చీకేసిన తోక్కళ్ళను
మీరు విసిరేసిన చిత్తు కాగితాలను
నన్ను నింపడానికి మాత్రమె
నేను గుర్తుకు వస్తాను
నన్ను తాకాలంటే మీకు భయం
నా బాక్టీరియా తో మీరు హైరానా పడతారు
నన్ను కాళ్ళతో నొక్కి నా నోరు తెరుస్తారు
'అమ్మా చెత్త ' అనే మున్సిపాలిటీ అబ్బాయి మాత్రమె
నన్ను ప్రేమగా చూసుకొం టా డు
నాలో చెత్తను తీసేసి మీ కిస్తాడు
మళ్లి మీరు నన్ను ఒక మూలకి నెట్టేస్తారు
అందరికి ఊడిగాలు చేస్తున్నా-
కానీ మీ ఇంట్లో పోపుల డబ్బా కున్న విలువ నాకు లేదు
ఇంట్లోనే అంటరాని దాన్ని అయిపొయ్యాను
ఎంతయినా నేను చె త్తబుట్ట నే గదా !
(ఎందుకో ఆఫీసులో ప్రొద్దున్నేచె త్తబుట్ట కాళ్ళకి తగిలింది .చి రాకుగా కాళ్ళతోనే మూలకి తోసేసిన వెంటనే దాని ఆత్మ నాతొ మూగగా మాట్లాడింది , ఆ స్పందనే ఈ కవిత )
No comments:
Post a Comment