Monday, July 8, 2013

నేను రోజు ఏడుస్తున్నాను



నేను పుడుతూనే ఏడ్చాను
అమ్మ అక్కున చేర్చుకోంది
నేను స్కూల్ కి వెళ్లనని మారాం చేసాను
నాన్న ధైర్యం చెప్పాడు
నేను ఉద్యోగంలో చేరాను
అధికారి దిశా నిర్దేశం చేసాడు
నేను పెళ్లి చేసుకొన్నాను
శ్రీమతి నాలో సగమై నన్ను నడిపించింది
నేను పిల్లల్ని కన్నాను
వాళ్ళ ముద్దూ ముచ్చట తీర్చాను
నేను పిల్లలకు పెళ్లి చేశాను
అల్లుళ్ళు ,కోడళ్ళ కోర్కెలు తీర్చాను
నేను తాతయ్య నయ్యాను
మనవళ్ళు , మనమ రాళ్ళు కోసం ఆరాట పడ్డాను
నేను పదవి విరమణ చేసాను
వచ్చిన డబ్బంతా పిల్లలకు పంచాను
నేను జవసత్వాలు ఉడిగిన ముదుసలని అయ్యాను
ఇప్పుడు నేను రోజూ ఏడుస్తున్నాను ---
అందరు ఉన్నా ---
పలకరించే దిక్కులేక !!

కొందరి వృద్ధుల జీవితాల్ని చూసాక రాసిన కవిత
భాను    వారణాసి -08-06-2013



 

No comments:

Post a Comment