1
ఆడ పిల్లను కనగానే
దివాలా తీసినట్లు మొహం పెడతాడు తండ్రి
కట్నం, ఖర్చుల గురించి అలోచనే గానీ
ఇంట్లో శ్రీలక్ష్మి పుట్టిందని అలోచించడు !
2
వెర్రిమా లక్ష్మి పాపం పిచ్చితల్లి
అందరూ మంచి వాళ్లలాగానే కనబడ తారు
మనవాడే గద అని మనసు విప్పి మాట్లాడితే
పిచ్చి తల్లి ' రేప్' కి బలయ్యింది
3
పురుషాహాంకారం
ఎందరో స్త్రీ లను కాటేసింది
మగ వాడనే ఆహంభావం
మహిళల నొరు నొక్కేసింది
మళ్లి సమాన హక్కులు
ఊకదంపుడు ఉపన్యాసాలు
4
అక్క అన్న చెల్లి అమ్మ నాన్న
మానవ సంభందాలన్ని ఆర్థిక సంభందాలు అయ్యాయి
కరెన్సీ నోట్లతో అనుబంధాల్ని కట్టి పడేశారు
No comments:
Post a Comment