నువ్వెప్పుడైనా నిశ్శబ్ద గీతం విన్నావా?
ఒక్క సారి ఏకాంతంలో నీ చెవులలో మ్రోగే ఓంకారనాదాన్ని విన్నావా?
చూరు నుండి బొట్టు బొట్టు కారే నీటి శబ్దం లో ఒక రాగం విన్నావా ?
నీ స్నానాల గదిలో నీటి భాష ను విన్నావా ?
సన్నని తుంపర చేసే సరికొత్త రాగం విన్నావా?
ఆషాడ మాసంలో తల లూపే చెట్లలో వినపడే ఆనంద రాగం విన్నావా?
రైలు వెంబడి పరుగెత్తే మేఘాలు పాడే మోహన రాగం విన్నావా?
సంధ్యా సమయంలో పక్షలు జేసే జుగల్ బంది విన్నావా?
సాయంకాలపు నీరెండలొ సముద్రం జేసే సవ్వడి రాగం విన్నావా?
టిక్ టిక్ మంటూ గడియారపు ముళ్ళు జేసే లయ విన్యాసం విన్నావా?
శ్రీమతి జేసే గాజుల సవ్వడి విన్నావా ?
అందాల పాప కు తొడిగిన గజ్జెల సవ్వడి విన్నావా?
గంగిరెద్దుల వాడి విన సొంపయిన సన్నాయి రాగం విన్నావా?
రాగ రంజిత మైన జీవన రాగం విన్నావా?

No comments:
Post a Comment