Wednesday, April 22, 2020

మహాభారత యుద్ధం ఎలా జరిగింది?

మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే

18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు. వాహినికి మూడు రెట్లు ‘పౄతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పౄతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు.

మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయో గించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ప్రత్యేక కథనమిది...

హరివంశం చారిత్రాత్మక గ్రంథం. చారిత్రాత్మకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో ఇదమిద్ధంగా తెలియచెప్పేదే చరిత్ర. చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. కుణాలుడు రాసిన మాగధ (మగధరాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి లాంటి చారిత్రాత్మక గ్రంథమే. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర చంద్రవంశపు రాజుల చరిత్రలో వున్నాయి.
క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతకన్నా దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాస పీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీనదిని గురించిన ప్రస్తావన వుంది. ఎటొచ్చీ హరివంశం ఒక చారిత్రాత్మక గ్రంథం. క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు వ్యాసుడు రాశాడు. హరివంశం శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చారు.

మహాభారత యుద్ధ కాలం

దీని ప్రకారం భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తుంది. భీష్ముడు సైన్యాధిపతిగా పదిరోజులు యుద్ధం చేశాడు. పదోరోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో అస్త్ర సన్యాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట. 22 డిసెంబర్‌ 5561లో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు గనక మహాభారత యుద్ధం సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైంది. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షలమంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే (89 వేలు) నమోదు చేశారు.
దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చాలామంది చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావిస్తారు. కోల వేంకట చలపతి రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?
దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు?

భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో వుంది. ఈ నారదుడు 372 కాంతి సంవత్సరాల దూరంలో ఎబ్సులా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్‌ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం వుండేదనీ సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది.
అస్త్ర శస్త్ర తయారీలో వీరు నిపుణులు. వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా తెలుస్తోంది. ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి అర్జునునికి ఇచ్చిన సుదర్శనచక్రం గాండీవం (లాంచర్‌) అక్షయ బాణ తూణీరాలు (మిస్సైల్స్‌) రసాయనికి ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌గానే భావించవచ్చు. దాదాపు 3వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల కాలి బూడిదైపోయింది.
ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్‌వర్డ్‌లాంటి టెలిపతిక్‌ అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛ రించేవారని కొందరు పరిశోధకులు విశ్లేషి స్తున్నా రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్‌లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
మహాభారత యుద్ధంలో రిమోట్‌ కంట్రోల్‌తో పాస్‌వర్డ్‌ను గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.

రిమోట్‌ ద్వారా అస్త్రాల ప్రయోగం

మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహా భీకర యుద్ధానికి దారి తీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారధులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. .
జిపిఎస్‌ పరిజ్ఞానం మహాభారత యుద్ధంలో వారికి వుంది అనడంలొఆశ్చర్యంలేదు. 7వేల సంవత్సరాల క్రితమే రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి జిపిఎస్‌ అడ్వాన్స్‌డ్‌ జ్ఞాన సంపత్తి తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు. .
ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్నా ఆ అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌(మంత్రం) ఉచ్ఛరించి నంత మాత్రాన టెలీపతీ ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!

అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటు న్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి.

మహాభారత యుద్ధంలో ఉపయోగిం చిన శస్త్రాల్లోనుంచి భయానక గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయ రక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.
ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు.
ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.
క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన 'అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి' అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.

అస్త్రాల వివరాలు

మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రు కలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.
మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.

శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు. అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా పాండకులకు విజయం సాధించి పెట్టి కౌరవులను భూమిపై లేకుండా చేయగలిగాడు.

            ( ఫేస్ బుక్ నుండి కాపీ చెయ్య బడినది)

Wednesday, March 25, 2020

కరోనా జీవిత సత్యాలు

కరోనా జీవిత సత్యాలు
------------------------------------

కరోనా వల్ల వాతావరణ కాలుష్యం తగ్గవచ్చు
కరోనా వల్ల ఆహారపు అలవాట్లు మారవచ్చు
కరోనా వల్ల వ్యక్తిగత శుభ్రత పెరగ వచ్చు
కరోనా వల్ల  సత్సంప్రదాయాలు నేర్చు కోవచ్చు
కరోనా వల్ల బాంధవ్యాలు మెరుగ పడవచ్చు
కరోన వల్ల జీవితం అంటే ఏమిటో అర్థం కావచ్చు
కరోనా వల్ల మనుషులంతా ఒక్కటే అని తెలుసు కోవచ్చు
కరోనా వల్ల జీవితం క్షణ భంగురం అని బోధపడవచ్చు
కరోనా వల్ల జంతువులు హాయిగా బ్రతక వచ్చు
కరోనా వల్ల పక్షుల కిల కిల రావాలు హాయిగా వినవచ్చు
కరోనా వల్ల ఒక్క నూతన జీవన విధానం  చూడవచ్చు
కరోనా వల్ల మనుషుల ప్రవర్తనలో మార్పు రావచ్చు
కరోనా వల్ల ఒక  నూతన ఆరోగ్య సమాజం అవిర్బవించ వచ్చు
కరోనా వల్ల జీవ నదుల జల కాలుష్యం తగ్గ వచ్చు
కరోనా వల్ల భూమాత కొన్ని రోజులు సేద దీర వచ్చు
కరోనా వల్ల క్రొత్త శకం ఆరంభం కావచ్చు.

లోకాసమస్తా సుఖినో భవంతు!
వారణాసి భానుమూర్తి
26.03.2020

కరోనా తత్వ గీతం

కరోనా తత్వ గీతం




ఏమీ సేతురా రామా?
ఏమీ సేతురా?

వద్దనక పోతీనీ
కద్దనక తింటినీ
పాడూ రోగ మొచ్చే
పాడే మోసూ కొచ్చే

తెలవక తిరిగితీ
*కరోనా* పాల్బడితీ
మందూ లేని రోగమొచ్చే
చావూ దగ్గర కొచ్చే

ఏమీ సేతురా రామా?
ఏమీ సేతురా?

ఆస్థులు కూడాబెడితీ
మోసాలు చెయ్యాబడితీ
పాడూ రోగామొచ్చే
పొయ్యే కాలమూ వచ్చే

ఏమీ సేతురా రామా?
ఏమీ సేతురా?

ఏమీ సేతురా రామా
ఏమీ సేతురా!

మూడ్నాళ్ళ ముచ్చట
ఈ బతుకూ ఇచ్చట
తెలవక  నిను మరచితీ
మంద భాగ్యుడ నైతీ

ఏమీ సేతురా రామా?
ఏమీ సేతురా?

చైనాలో పుట్టీనా
రాక్షసీ కరోనా
ప్రాణాలు గాల్లోనా
జీవాలు కలిసేనా

ఏమీ సేతురా రామా?
ఏమీ సేతురా?

పిల్లా జెల్లా కాదు
పేదా గొప్పా కాదు
చేరాల్సిందే కాటికి
కరోనా ధాటికి

ఏమీ సేతురా రామా?
ఏమీ సేతురా?

రచన: వారణాసి భానుమూర్తి రావు
కవి, రచయిత
05.03.2020

కరోనా భూతం ! ( దీర్ఘ కవిత)

కరోనా భూతం ! ( దీర్ఘ కవిత)
------------------------------------------
కరోనా భయం కళ్ళల్లో కనబడినా
చావు భయం మాత్రం
ముఖంలో ప్రస్పుట మవుతోంది    3

మనుషుల్ని  భౌతికంగా
విడదీసిన కరోనా
మనసుల్ని దగ్గర చేసింది             6


కరోనా యుద్ధానికి
 ప్రపంచ మంతా  బలి అయినా
ఖండాంతరాల్ని కలిపింది              9

అణ్యాయుధాలు వదలకున్నా
కరోనా మనిషి జాతి మీద
 జీవాయుధాల్ని పంపించింది   12

మనిషి పుట్టుక
 ఏ దేశం లో నయినా
చావు మాత్రం అందరిదీ అయ్యింది   15

మానవ జాతి‌ మనుగడకు
ప్రమాద ఘంటికలు  మ్రోగించిన కరోనా
జాతి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తోంది     18

చైనాలో పుట్టిన కరోనా
అగ్ర రాజ్యాల వెన్నులో
వణుకు పుట్టిస్తోంది                        21

బాల్కనీల నుండి చావు కేకలు
వీధుల్లో పారాడుతున్నాయి
నిరంతరం ప్రవహించే జన ప్రవాహం
మంచు నయాగారా జలపాతంలా
 స్థంభించి పోయింది                           26

గాలికి పెట్టిన దీపాల్లా
మనుషుల  ప్రాణాలు
గాల్లో కలిసి పోతున్నాయి                29

ఈ దేశంలో ప్రాణాంతక వైరస్ లు
లేని దెవ్వరికి?                                31

లంచ గొండి తనం వైరస్సు
బీదా బిక్కీ‌ల ప్రాణాలు తీసింది         33

వర కట్నపు జబ్బు
అమ్మాయిల జీవితాల్ని బుగ్గి చేసింది  35

లైంగిక అత్యాచారుల కొచ్చిన వైరస్
నిర్భయల , దిశల లాంటి అబలల
ప్రాణాల్ని  బలి తీసుకొంది               38

ఈ దేశంలో అవినీతి పరుల
కొచ్చిన వైరస్సు ఇంకా వ్యాపిస్తూనే ఉంది  40

మతం మహమ్మారి  జబ్బుతో
ముదిరి‌పోయిన ఉగ్రవాదం
చేసిన ఉన్మాదం అంతా ఇంతా కాదు
దేశాలన్నీ ఈ పెను‌భూతంతో
గజ గజ మని వణికాయి                     45

కరోనా వైరస్సు కొందరికే రావచ్చు
కానీ కొన్ని కారణాలు వెతికితే
ఇది జన ప్రళయం అనిపిస్తుంది
ఒక యుగాంతం అనిపిస్తుంది            49

ఒక యుగం మారే ముందు
జన ప్రపంచానికి ఒక గుణ పాఠం‌
తెలుపుతుంది                                52

ఒక  ఆకాశం నల్లటి మేఘాలతో
ఆమ్ల ద్రవాలను‌ కురిపిస్తుంది          54

ఒక సూర్యుడు
రక్త వర్ణంతో కనిపిస్తాడు                56

ఒక చంద్రుడు
వేడి వెన్నెలను‌ కురిపిస్తాడు          58

కరోనా రాకముందు
ప్రజల ఆహారపు అలవాట్లు
రాక్షస జాతిని‌ తల దన్నింది          61

బ్రతక డానికి హక్కు లేని
మూగ జీవాలు , పురుగులు, పక్షులు
పందులు, కుక్కలు, తాబేళ్ళు , పాములు
జల చరాలు, ఉభయ చరాలు, సరీసృపాలు
ఒక్కటేమిటి  సమస్తం
మానవ జాతి  కడుపుకు అంకితం
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అయినా మనకు జీర్ణం కాని దేముంది?
వాతాపి వచ్చినా ఏమి‌ చెయ్య లేడు
అగస్త్యుడు వచ్చినా ఏమీ చెయ్య లేడు     71


మనిషి సంస్కార రహితుడై
జంతువు కన్నా  హీన మయ్యాడు          73

జంతువు ఏ పూట కా పూట
ఆహారం వెతుక్కొంటుంది                 75

మనిషి తన తరానికి
సరిపడా ఆహార ద్రవ్యాల్ని
లాక్కొంటాడు..భద్ర పరచు కొంటాడు    78

పేదవాడికి‌ నోట్లో మట్టి
మిగులు తుంది                  80

కొనుగోలు శక్తి‌ లేని
నిరు‌పేదలు మట్టి‌ ముద్దలు
 తిని‌ బ్రతుకు‌తారు        83

దొరకని‌ మేలుఆహారం బదులు
వింత జంతువుల్ని‌ తిన్నాడు
అడవి గడ్డి  తిని‌ కడుపు నింపుకొన్నాడు 86

గబ్బిలాల నుండి‌ ప్రాకిన
ఈ కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని
అంతరింప చెయ్యడానికి‌
వచ్చిన జీవాయుధమా?      90

ఏ మూలనయినా వ్యాపించే
ఈ అతి‌ సూక్ష్మ జీవులు
ఖండాంతరాల్ని‌ దాటి
మనిషికి నిద్ర కరువు చేసింది  94

ఈ‌ ఉపద్రవాన్ని ఆపే శక్తి
ఎవ్వరి‌కుంది? 96

ఊహాన్ నగరం‌లో పుట్టి
ఊహ కందని‌ ఈ వైరస్
ప్రజల జీవితాలతో చెలగాట మాడింది99

కోవిడ్ 19 ముద్దు‌పేరుతో
కోట్ల మందికి  భయాన్ని కలిగిస్తోంది 101

ఈ‌ ప్రపంచం ఏ మయినా
 నాకు  పరవా‌లేదు
నేను నా‌ కుటుంబం పచ్చగా ఉండాలి
స్వార్థ కుబుసం వీడ లేని‌
మనిషి సంఘ జీవిగా
పొసగ లేక పోతున్నాడు   107

విశ్వాన్ని‌ భరించ లేనంతగా
ప్రకృతిని  నాశనం చేశాము  109

చల్లని‌గాలుల్ని  విష పూరితం చేశాం
కర్మా గారాల్ని‌  కారాగారాల్ని చేశాం
కార్మీకుల  జీవితాలతో ఆడుకొన్నాం
సరస్సులను , జీవ నదుల్ని ఎండ గట్టాం
త్రాగు నీటి గంగా జలాన్ని
రసాయనిక విష ద్రవాలతో నింపాం  115

ఇంకా ఏమి చేశాం?   116

పచ్చని  అడవుల్ని‌ బూడిద చేశాం
కోట్లాది జంతు జీవాల్ని పోగొట్టు కొన్నాం 118

కొండల్ని తవ్వాం ..పర్వతాల్ని పడగొట్టాం
మైనింగు పేరుతో మైదానాల్ని లోయల్ని చేశాం 120

సముద్రాల్ని ప్లాస్టిక్ భూతంతో నింపి వేశాం
లావాతో ఉబికే అగ్ని పర్వతాలకు ఆహుతి అయ్యాం 122

ఆకాశంలోకి విష వాయువుల్ని పంపి
ఓజోను పొరను పలుచన చేశాం
ఆర్కిటిక్ మంచు ఖండాల్ని కరిగించేశాం
ప్రకృతి సమతుల్యాన్ని , జీవ జంతు వృక్ష
సమతుల్యాన్ని నాశనం చేసుకొన్నాం  127

ఉపద్రవం ఎందుకు రాదు?
జల ప్రళయాలు ఎందుకు రావు?
భూకంపాలు ఎందుకు రావు? 130

విశ్వం పట్టనంతగా జనాభాను
పెంచుకొంటూ పోతే మనిషి
సమాధికి ఆరడుగుల
 నేల కూడా దొరకడం లేదు 134

 కరోనా నేర్పించింది ప్రపంచానికి
ఒక ఉన్నత సంప్రదాయం 136

కరచాలనం వద్దు
నమస్తే ముద్దు
ఆలింగనాలు‌ వద్దు
ఆరడుగుల దూరం కద్దు 140

బయట తిరుగుళ్ళు మాను
ఇంటి వరకే  వుంటే
 నీ బ్రతుకు పదిల మౌను 143

స్విగ్గీ లు , జమోటాల తిండి మనకేల?
బార్లు , పబ్బులు తిరగనేల?
లేని రోగాలు తెచ్చుకొన నేల? 146

అప్పట్లో బామ్మ గారి వంటలు
ఇంటిల్ల పాదికీ ఆరోగ్య కారకాలు
వెల్లుల్లి ఇంగువ వేసిన చారు
రోగాల రాక్షసులకు బేజారు
కొత్తిమీర కరేపాకు అల్లం బెల్లం
వైరసులను ఉంచుతుంది ఆమడ దూరం 152

చేతులు కడుక్కొనే వైనం
చెబుతుంది నీ ఆరోగ్య నియమం
పాటిస్తే స్వచ్చ స్వయం ఆరోగ్య సూత్రాలు
 చూస్తావు నిండు నూరేళ్ళు బ్రతుకు సిత్రాలు 156

నిను వినా కరోనాకు దిక్కెవ్వరు?
నీ గొంతులో దిగబడి
నీ ఊపిరి తిత్తులను
అష్ట దిగ్బంధం చేస్తుంది 160

నీ కోసం పరితపించే నీ
వాళ్ళను బలి చేస్తుంది 162

ప్రతి రక్తపు బొట్టులో
ఒక్క రాక్షసుడు పుట్టినట్లుగా
కరోనా లక్షల సంఖ్యలో
నీ శరీరం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది 166

అమెరికా ప్రెసిడెంటు అయినా
బ్రిటిష్ యువ రాణి అయినా
అడుక్కుతినే యాచకు డయినా
కరోనా ధాటికి కాటికి పోవాల్సిందే! 170

ఖండాలను దాటి దేశాలను దాటి
వచ్చింది  మహమ్మారి కరోనా
మానవ జాతి చరిత్రలో
వింతయిన విష జీవి  కరోనా! 174

నిశ్శబ్ధ రాక్షసులు  భయంకరంగా
పగలు రాత్రి తిరుగుతున్నారు
జన సందోహాల మధ్య
కేరింతలు కొట్టే  మాల్సు , సినిమా హాళ్ళు
మూగవై‌ పోయినాయి
మనిషి మాస్కు వీరులై పొయ్యారు
నీడకు గూడా వైరస్ తగులుతుందేమోనని
భయపఫుతున్నాడు మనిషి 182

విచిత్ర మైన వైరస్సు
మధ్య యుగాల కాలం నుండీ
మానవ జాతిని‌ ఇలా వేటాడ లేదు
జీవితాలను అతలా కుతలం‌
చెయ్యలేదు   187

చల్ల గాలిలో
కరోనా దాక్కొందేమో నని అనుమానం
త్రాగే నీళ్ళళ్ళో
కలిసి పోయిందేమోనన్న  భయం
గొంతులో దాక్కొన్న వైరస్ కణాలు
ఊపిరి తిత్తుల్లోకి చేరి
మరణానికి చేరుస్తుందేమో నన్న భయం 194

మనిషిని గజ గజ లాడించిన కరోనా
ఎన్ని రోజులు  పారాడుతుందో?
ఎంత  మందిని
బలి తీసుకొంటుందో? 198

ప్రభుత్వాలు పని చేస్తున్నా
మితిమీరిన జనం కరోనా బారిన పడితే
మానవ గ్రహం  మార్సు గ్రహం
అయిపోతుందా?
ఒక బిలియన్ కోట్ల మందిని‌
భరిస్తున్న ఈ విశ్వం ఖాళీ అవుతుందా? 204


వీరబ్రహ్మం గారి కాలజ్నానం
నిజమయ్యిందా?
ఈశాన్య  దిక్కున కోరంటి
విష గాలి సోకి  కోటి జనులు
సచ్చేరయా! 209

అవును మానవ జాతి
మనుగడ సాగించాలి
ప్రపంచమే ఒక‌ కుగ్రామైనప్పుడు
జాతి మత వైషమ్యాలు వదలాలి
మానవత్వం పరిడవిల్లాలి 214

పేర్చుకొన్న అణ్యాయుధాల్ని
నిర్వీర్యం చెయ్యాలి
నిరాయుధీకరణ  వుద్యమం చేబట్టాలి
దేశాల మధ్య నియంత్రణ రేఖ లున్నా
దాటుకొని  వచ్చిన కరోనాకు వీసాలు ఎవరిచ్చారు?
నియంత్రణ రేఖలు చెరిపేసి
విశ్వమంతా మానవ జాతి దే నని ఎలుగెత్తాలి! 221

కరోనా పిశాచి పీడను
అంతమొందిద్దాం
ఆరోగ్య విశ్వాన్ని
భావి తరాలకు అందిద్దాం ! 225

రండి ... కలుద్దాం
రండి ...నడుద్దాం
మన కోసం..మన జాతి కోసం
మన సహ మూగ ప్రాణుల  కోసం
మన అడవుల‌ కోసం
మన నీళ్ళ కోసం
మన  పచ్చని భూమి‌కోసం
మన సముద్రాల‌ కోసం
రండి ..కలసి‌ నడుద్దాం!
రండి..కలిసి పని చేద్దాం! 235

జాతి మొత్తం ఏకమై
కరోనా భూతాన్ని  తరిమేద్దాం !
స్వచ్చ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ
వైరస్ లేని సమాజాన్ని నిర్మిద్దాం !! 239

రచన:  వారణాశి భానుమూర్తి రావు
16.03.2020









కర్రోనా!

కర్రోనా!
-----------------------
టాయెలెట్లో కరోనా
బాత్ రూమ్ లో కరోనా
వంటింట్లో కర్రోనా
పెరట్లో కర్రోనా
బెడ్ రూం లో కరోనా
ముహం మీద కరోనా
కళ్ళల్లో కరోనా
చేతుల్లో కరోనా
కాళ్ళల్లో కరోనా
ముక్కులో కరోనా
గొంతులో కరోనా
ఊపిరి తిత్తుల్లో కరోనా
పేగుల్లో కరోనా
గబ్బిలాల సంత చప్పిడి ముక్కోళ్ళల్లారా!
ఎవడ్రా మిమ్మల్ని గబ్బిలాల్ని తినమన్నది?
మీ ముహాలు మండ!
మీ తినుడు మండ!
మీరు గబ్బిలాల  బర్ఫీలు తింటే
మేమిక్కడ చేతులు కడుక్కోవడమేట్రా?
మమ్మల్ని బతక నీరా?
ఒరేయ్ ఇందులో ఏదో
మతలబు ఉంది రోయ్!
నీ ల్యాబుల్లో  కర్రోనా పిశాచిని 
 పుట్టించి వదిలేశావా చైనా  వోడా?
ప్రపంచాన్ని పీక్కు తింటోంది
కరోనా గదరా సిన్నోడా?
వదలదా మమ్మల్ని ఈ కరోనా పీడా?
వూహాన్ పెంట మాకు తగిలించి
నువ్వు కాలరు ఎగరేస్తున్నావు?
చీనీయుల్లారా ఇక నైనా మారండ్రా!
మా మానాన మమ్మల్ని బతక నియ్యండ్రా!
ఇప్పుడే చచ్చి పొమ్మంటే ఎలాగండ్రా!
ఇంకా కొన్ని రోజులు బతకాల్నా లేదా?
బతకండ్రా! బతక నియ్యండ్రా!!

15.03.2020


శార్వరీ ఉగాదీ!

శార్వరీ ఉగాదీ!
----------------------------
శార్వరీ ఉగాదీ!
ఏముందని వచ్చావమ్మా?
మా ఇళ్ళు బోసి పోయినాయి
మా వాకిళ్ళు  మాసి పోయినాయి
మామిడాకుల తోరణాలు లేవు
వేపాకు పూతల సందడి లేదు
 షడృచుల ఉగాది పచ్చడికి నోచు కోలేదు

శార్వరీ ఉగాది తల్లీ?
ఎక్కడివమ్మా  నాటి గత చరిత్రలు?
ఎక్కడివమ్మా పిల్లల పెద్దల ఆటపాటలు?
ఏమై పొయ్యాయమ్మా ఆ కవి సమ్మేళనాలు?

ఏ కొయిలమ్మా పాట పాడడం‌ లేదు
ఏ మామిడి కొమ్మా పూత పూయనే లేదు
చైత్ర మాసపు తళుకు బెళుకులు కనబడం లేదు
పంచాంగపు శ్రవణాలు  వినబడడం లేదు

నేటి దుస్థితికి ఏ గ్రహాలు కారణం?
ఈ పరిస్థితికి  ఏ రాక్షస శక్తులు కారణం?

శార్వరీ ఉగాది మాతా?
*కరోనా* మహమ్మారి జన జీవితాల్ని
అతలా కుతలం చేసింది
స్వీయ నిర్బంధం లో ఇల్లే 
కారాగారం అయ్యింది
పిల్లల ఆట పాటలు  కరోనా సంకెళ్ళకు
కట్టడి అయి పొయ్యాయి
ఆదాయం కన్నా...వ్యయం మిన్నా
కరోనా గ్రహ కూటమితో
 జన జీవన స్రవంతికి   వెంటిలేటర్లు
బ్రతుకులు జనతా కర్ఫ్యూ లో
పగిలి పోతున్న  చిమ్నీ లాంతర్లు

ఉగాది పచ్చడికి
విందు భోజనాలకు
పూర్ణం బూరెలకు
బొబ్బట్లు అరిసెలకు
పులిహోరకు పాయసాలకు
కొబ్బరి నీళ్ళకు చెరకు గడలకు
వడియాలకు , వూర బెట్టిన మిరపలకు
దూరం చేసిందమ్మా ఈ కరోనా పిశాచి

వచ్చినట్లే వచ్చి
ఆగమాగం చేస్తున్న కరోనాను
ఈ ఉగాది రోజు నుండే తరిమి వేస్తాం!
కరోనాను ఖతం చేసి
నూతన ఉగాదిని జరుపు కొంటాం
ఒక నూతన యుగానికి
ఆరంభం పలుకు తాం!

వారణాసి భానుమూర్తి రావు
25.03.2020
శార్వరి నామ సంవత్సర ఉగాది
బుధ వారం , చైత్ర మాసం

Tuesday, November 5, 2019

అల్లుకొన్న పందిరి


*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *05- 11-2019*
కవి పేరు : *వారణాసి భానుమూర్తి రావు*
సంఖ్య : *165*
అంశం * అనురాగ గోపురం*
శీర్షిక: *అల్లుకొన్న పందిరి*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


ఆలుమగలు కట్టుకొన్న అనురాగ గోపురం
నిలబడుతుంది కల కాలం ఆ కాపురం
చిలిపి ప్రేమలు చిగుర్లు తొడిగిన చిద్విలాసం
చిలకా గోరింకల ప్రణయ సౌందర్యం

తొలి రాత్రి శృంగార భావనలు
ప్రతి రాత్రి మధురానుభూతులు
జీవితమే ప్రణయ కావ్యమయితే
 ప్రతి రోజూ మధుర సుధా భరితము

దిన దిన ప్రవర్థ మానమైన ప్రేమని
అనురాగపు లోగిళ్ళలో  పెంచాలి
మల్లె పూవు తీగ లాగా శ్రీమతి
శ్రీవారి గుండెల్లో అల్లుకొని పోవాలి

అపార్థాల చీడ పురుగుల్ని తరిమి
దిగులు తెగుళ్ళని  దరి చేయ నీక
మధుర మైన తోటలో  ప్రేమ దేవతలై
జీవితాన్ని రసాస్వాదన చెయ్యాలి.