కరోనా భూతం ! ( దీర్ఘ కవిత)
------------------------------------------
కరోనా భయం కళ్ళల్లో కనబడినా
చావు భయం మాత్రం
ముఖంలో ప్రస్పుట మవుతోంది 3
మనుషుల్ని భౌతికంగా
విడదీసిన కరోనా
మనసుల్ని దగ్గర చేసింది 6
కరోనా యుద్ధానికి
ప్రపంచ మంతా బలి అయినా
ఖండాంతరాల్ని కలిపింది 9
అణ్యాయుధాలు వదలకున్నా
కరోనా మనిషి జాతి మీద
జీవాయుధాల్ని పంపించింది 12
మనిషి పుట్టుక
ఏ దేశం లో నయినా
చావు మాత్రం అందరిదీ అయ్యింది 15
మానవ జాతి మనుగడకు
ప్రమాద ఘంటికలు మ్రోగించిన కరోనా
జాతి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తోంది 18
చైనాలో పుట్టిన కరోనా
అగ్ర రాజ్యాల వెన్నులో
వణుకు పుట్టిస్తోంది 21
బాల్కనీల నుండి చావు కేకలు
వీధుల్లో పారాడుతున్నాయి
నిరంతరం ప్రవహించే జన ప్రవాహం
మంచు నయాగారా జలపాతంలా
స్థంభించి పోయింది 26
గాలికి పెట్టిన దీపాల్లా
మనుషుల ప్రాణాలు
గాల్లో కలిసి పోతున్నాయి 29
ఈ దేశంలో ప్రాణాంతక వైరస్ లు
లేని దెవ్వరికి? 31
లంచ గొండి తనం వైరస్సు
బీదా బిక్కీల ప్రాణాలు తీసింది 33
వర కట్నపు జబ్బు
అమ్మాయిల జీవితాల్ని బుగ్గి చేసింది 35
లైంగిక అత్యాచారుల కొచ్చిన వైరస్
నిర్భయల , దిశల లాంటి అబలల
ప్రాణాల్ని బలి తీసుకొంది 38
ఈ దేశంలో అవినీతి పరుల
కొచ్చిన వైరస్సు ఇంకా వ్యాపిస్తూనే ఉంది 40
మతం మహమ్మారి జబ్బుతో
ముదిరిపోయిన ఉగ్రవాదం
చేసిన ఉన్మాదం అంతా ఇంతా కాదు
దేశాలన్నీ ఈ పెనుభూతంతో
గజ గజ మని వణికాయి 45
కరోనా వైరస్సు కొందరికే రావచ్చు
కానీ కొన్ని కారణాలు వెతికితే
ఇది జన ప్రళయం అనిపిస్తుంది
ఒక యుగాంతం అనిపిస్తుంది 49
ఒక యుగం మారే ముందు
జన ప్రపంచానికి ఒక గుణ పాఠం
తెలుపుతుంది 52
ఒక ఆకాశం నల్లటి మేఘాలతో
ఆమ్ల ద్రవాలను కురిపిస్తుంది 54
ఒక సూర్యుడు
రక్త వర్ణంతో కనిపిస్తాడు 56
ఒక చంద్రుడు
వేడి వెన్నెలను కురిపిస్తాడు 58
కరోనా రాకముందు
ప్రజల ఆహారపు అలవాట్లు
రాక్షస జాతిని తల దన్నింది 61
బ్రతక డానికి హక్కు లేని
మూగ జీవాలు , పురుగులు, పక్షులు
పందులు, కుక్కలు, తాబేళ్ళు , పాములు
జల చరాలు, ఉభయ చరాలు, సరీసృపాలు
ఒక్కటేమిటి సమస్తం
మానవ జాతి కడుపుకు అంకితం
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అయినా మనకు జీర్ణం కాని దేముంది?
వాతాపి వచ్చినా ఏమి చెయ్య లేడు
అగస్త్యుడు వచ్చినా ఏమీ చెయ్య లేడు 71
మనిషి సంస్కార రహితుడై
జంతువు కన్నా హీన మయ్యాడు 73
జంతువు ఏ పూట కా పూట
ఆహారం వెతుక్కొంటుంది 75
మనిషి తన తరానికి
సరిపడా ఆహార ద్రవ్యాల్ని
లాక్కొంటాడు..భద్ర పరచు కొంటాడు 78
పేదవాడికి నోట్లో మట్టి
మిగులు తుంది 80
కొనుగోలు శక్తి లేని
నిరుపేదలు మట్టి ముద్దలు
తిని బ్రతుకుతారు 83
దొరకని మేలుఆహారం బదులు
వింత జంతువుల్ని తిన్నాడు
అడవి గడ్డి తిని కడుపు నింపుకొన్నాడు 86
గబ్బిలాల నుండి ప్రాకిన
ఈ కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని
అంతరింప చెయ్యడానికి
వచ్చిన జీవాయుధమా? 90
ఏ మూలనయినా వ్యాపించే
ఈ అతి సూక్ష్మ జీవులు
ఖండాంతరాల్ని దాటి
మనిషికి నిద్ర కరువు చేసింది 94
ఈ ఉపద్రవాన్ని ఆపే శక్తి
ఎవ్వరికుంది? 96
ఊహాన్ నగరంలో పుట్టి
ఊహ కందని ఈ వైరస్
ప్రజల జీవితాలతో చెలగాట మాడింది99
కోవిడ్ 19 ముద్దుపేరుతో
కోట్ల మందికి భయాన్ని కలిగిస్తోంది 101
ఈ ప్రపంచం ఏ మయినా
నాకు పరవాలేదు
నేను నా కుటుంబం పచ్చగా ఉండాలి
స్వార్థ కుబుసం వీడ లేని
మనిషి సంఘ జీవిగా
పొసగ లేక పోతున్నాడు 107
విశ్వాన్ని భరించ లేనంతగా
ప్రకృతిని నాశనం చేశాము 109
చల్లనిగాలుల్ని విష పూరితం చేశాం
కర్మా గారాల్ని కారాగారాల్ని చేశాం
కార్మీకుల జీవితాలతో ఆడుకొన్నాం
సరస్సులను , జీవ నదుల్ని ఎండ గట్టాం
త్రాగు నీటి గంగా జలాన్ని
రసాయనిక విష ద్రవాలతో నింపాం 115
ఇంకా ఏమి చేశాం? 116
పచ్చని అడవుల్ని బూడిద చేశాం
కోట్లాది జంతు జీవాల్ని పోగొట్టు కొన్నాం 118
కొండల్ని తవ్వాం ..పర్వతాల్ని పడగొట్టాం
మైనింగు పేరుతో మైదానాల్ని లోయల్ని చేశాం 120
సముద్రాల్ని ప్లాస్టిక్ భూతంతో నింపి వేశాం
లావాతో ఉబికే అగ్ని పర్వతాలకు ఆహుతి అయ్యాం 122
ఆకాశంలోకి విష వాయువుల్ని పంపి
ఓజోను పొరను పలుచన చేశాం
ఆర్కిటిక్ మంచు ఖండాల్ని కరిగించేశాం
ప్రకృతి సమతుల్యాన్ని , జీవ జంతు వృక్ష
సమతుల్యాన్ని నాశనం చేసుకొన్నాం 127
ఉపద్రవం ఎందుకు రాదు?
జల ప్రళయాలు ఎందుకు రావు?
భూకంపాలు ఎందుకు రావు? 130
విశ్వం పట్టనంతగా జనాభాను
పెంచుకొంటూ పోతే మనిషి
సమాధికి ఆరడుగుల
నేల కూడా దొరకడం లేదు 134
కరోనా నేర్పించింది ప్రపంచానికి
ఒక ఉన్నత సంప్రదాయం 136
కరచాలనం వద్దు
నమస్తే ముద్దు
ఆలింగనాలు వద్దు
ఆరడుగుల దూరం కద్దు 140
బయట తిరుగుళ్ళు మాను
ఇంటి వరకే వుంటే
నీ బ్రతుకు పదిల మౌను 143
స్విగ్గీ లు , జమోటాల తిండి మనకేల?
బార్లు , పబ్బులు తిరగనేల?
లేని రోగాలు తెచ్చుకొన నేల? 146
అప్పట్లో బామ్మ గారి వంటలు
ఇంటిల్ల పాదికీ ఆరోగ్య కారకాలు
వెల్లుల్లి ఇంగువ వేసిన చారు
రోగాల రాక్షసులకు బేజారు
కొత్తిమీర కరేపాకు అల్లం బెల్లం
వైరసులను ఉంచుతుంది ఆమడ దూరం 152
చేతులు కడుక్కొనే వైనం
చెబుతుంది నీ ఆరోగ్య నియమం
పాటిస్తే స్వచ్చ స్వయం ఆరోగ్య సూత్రాలు
చూస్తావు నిండు నూరేళ్ళు బ్రతుకు సిత్రాలు 156
నిను వినా కరోనాకు దిక్కెవ్వరు?
నీ గొంతులో దిగబడి
నీ ఊపిరి తిత్తులను
అష్ట దిగ్బంధం చేస్తుంది 160
నీ కోసం పరితపించే నీ
వాళ్ళను బలి చేస్తుంది 162
ప్రతి రక్తపు బొట్టులో
ఒక్క రాక్షసుడు పుట్టినట్లుగా
కరోనా లక్షల సంఖ్యలో
నీ శరీరం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది 166
అమెరికా ప్రెసిడెంటు అయినా
బ్రిటిష్ యువ రాణి అయినా
అడుక్కుతినే యాచకు డయినా
కరోనా ధాటికి కాటికి పోవాల్సిందే! 170
ఖండాలను దాటి దేశాలను దాటి
వచ్చింది మహమ్మారి కరోనా
మానవ జాతి చరిత్రలో
వింతయిన విష జీవి కరోనా! 174
నిశ్శబ్ధ రాక్షసులు భయంకరంగా
పగలు రాత్రి తిరుగుతున్నారు
జన సందోహాల మధ్య
కేరింతలు కొట్టే మాల్సు , సినిమా హాళ్ళు
మూగవై పోయినాయి
మనిషి మాస్కు వీరులై పొయ్యారు
నీడకు గూడా వైరస్ తగులుతుందేమోనని
భయపఫుతున్నాడు మనిషి 182
విచిత్ర మైన వైరస్సు
మధ్య యుగాల కాలం నుండీ
మానవ జాతిని ఇలా వేటాడ లేదు
జీవితాలను అతలా కుతలం
చెయ్యలేదు 187
చల్ల గాలిలో
కరోనా దాక్కొందేమో నని అనుమానం
త్రాగే నీళ్ళళ్ళో
కలిసి పోయిందేమోనన్న భయం
గొంతులో దాక్కొన్న వైరస్ కణాలు
ఊపిరి తిత్తుల్లోకి చేరి
మరణానికి చేరుస్తుందేమో నన్న భయం 194
మనిషిని గజ గజ లాడించిన కరోనా
ఎన్ని రోజులు పారాడుతుందో?
ఎంత మందిని
బలి తీసుకొంటుందో? 198
ప్రభుత్వాలు పని చేస్తున్నా
మితిమీరిన జనం కరోనా బారిన పడితే
మానవ గ్రహం మార్సు గ్రహం
అయిపోతుందా?
ఒక బిలియన్ కోట్ల మందిని
భరిస్తున్న ఈ విశ్వం ఖాళీ అవుతుందా? 204
వీరబ్రహ్మం గారి కాలజ్నానం
నిజమయ్యిందా?
ఈశాన్య దిక్కున కోరంటి
విష గాలి సోకి కోటి జనులు
సచ్చేరయా! 209
అవును మానవ జాతి
మనుగడ సాగించాలి
ప్రపంచమే ఒక కుగ్రామైనప్పుడు
జాతి మత వైషమ్యాలు వదలాలి
మానవత్వం పరిడవిల్లాలి 214
పేర్చుకొన్న అణ్యాయుధాల్ని
నిర్వీర్యం చెయ్యాలి
నిరాయుధీకరణ వుద్యమం చేబట్టాలి
దేశాల మధ్య నియంత్రణ రేఖ లున్నా
దాటుకొని వచ్చిన కరోనాకు వీసాలు ఎవరిచ్చారు?
నియంత్రణ రేఖలు చెరిపేసి
విశ్వమంతా మానవ జాతి దే నని ఎలుగెత్తాలి! 221
కరోనా పిశాచి పీడను
అంతమొందిద్దాం
ఆరోగ్య విశ్వాన్ని
భావి తరాలకు అందిద్దాం ! 225
రండి ... కలుద్దాం
రండి ...నడుద్దాం
మన కోసం..మన జాతి కోసం
మన సహ మూగ ప్రాణుల కోసం
మన అడవుల కోసం
మన నీళ్ళ కోసం
మన పచ్చని భూమికోసం
మన సముద్రాల కోసం
రండి ..కలసి నడుద్దాం!
రండి..కలిసి పని చేద్దాం! 235
జాతి మొత్తం ఏకమై
కరోనా భూతాన్ని తరిమేద్దాం !
స్వచ్చ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ
వైరస్ లేని సమాజాన్ని నిర్మిద్దాం !! 239
రచన: వారణాశి భానుమూర్తి రావు
16.03.2020
------------------------------------------
కరోనా భయం కళ్ళల్లో కనబడినా
చావు భయం మాత్రం
ముఖంలో ప్రస్పుట మవుతోంది 3
మనుషుల్ని భౌతికంగా
విడదీసిన కరోనా
మనసుల్ని దగ్గర చేసింది 6
కరోనా యుద్ధానికి
ప్రపంచ మంతా బలి అయినా
ఖండాంతరాల్ని కలిపింది 9
అణ్యాయుధాలు వదలకున్నా
కరోనా మనిషి జాతి మీద
జీవాయుధాల్ని పంపించింది 12
మనిషి పుట్టుక
ఏ దేశం లో నయినా
చావు మాత్రం అందరిదీ అయ్యింది 15
మానవ జాతి మనుగడకు
ప్రమాద ఘంటికలు మ్రోగించిన కరోనా
జాతి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తోంది 18
చైనాలో పుట్టిన కరోనా
అగ్ర రాజ్యాల వెన్నులో
వణుకు పుట్టిస్తోంది 21
బాల్కనీల నుండి చావు కేకలు
వీధుల్లో పారాడుతున్నాయి
నిరంతరం ప్రవహించే జన ప్రవాహం
మంచు నయాగారా జలపాతంలా
స్థంభించి పోయింది 26
గాలికి పెట్టిన దీపాల్లా
మనుషుల ప్రాణాలు
గాల్లో కలిసి పోతున్నాయి 29
ఈ దేశంలో ప్రాణాంతక వైరస్ లు
లేని దెవ్వరికి? 31
లంచ గొండి తనం వైరస్సు
బీదా బిక్కీల ప్రాణాలు తీసింది 33
వర కట్నపు జబ్బు
అమ్మాయిల జీవితాల్ని బుగ్గి చేసింది 35
లైంగిక అత్యాచారుల కొచ్చిన వైరస్
నిర్భయల , దిశల లాంటి అబలల
ప్రాణాల్ని బలి తీసుకొంది 38
ఈ దేశంలో అవినీతి పరుల
కొచ్చిన వైరస్సు ఇంకా వ్యాపిస్తూనే ఉంది 40
మతం మహమ్మారి జబ్బుతో
ముదిరిపోయిన ఉగ్రవాదం
చేసిన ఉన్మాదం అంతా ఇంతా కాదు
దేశాలన్నీ ఈ పెనుభూతంతో
గజ గజ మని వణికాయి 45
కరోనా వైరస్సు కొందరికే రావచ్చు
కానీ కొన్ని కారణాలు వెతికితే
ఇది జన ప్రళయం అనిపిస్తుంది
ఒక యుగాంతం అనిపిస్తుంది 49
ఒక యుగం మారే ముందు
జన ప్రపంచానికి ఒక గుణ పాఠం
తెలుపుతుంది 52
ఒక ఆకాశం నల్లటి మేఘాలతో
ఆమ్ల ద్రవాలను కురిపిస్తుంది 54
ఒక సూర్యుడు
రక్త వర్ణంతో కనిపిస్తాడు 56
ఒక చంద్రుడు
వేడి వెన్నెలను కురిపిస్తాడు 58
కరోనా రాకముందు
ప్రజల ఆహారపు అలవాట్లు
రాక్షస జాతిని తల దన్నింది 61
బ్రతక డానికి హక్కు లేని
మూగ జీవాలు , పురుగులు, పక్షులు
పందులు, కుక్కలు, తాబేళ్ళు , పాములు
జల చరాలు, ఉభయ చరాలు, సరీసృపాలు
ఒక్కటేమిటి సమస్తం
మానవ జాతి కడుపుకు అంకితం
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అయినా మనకు జీర్ణం కాని దేముంది?
వాతాపి వచ్చినా ఏమి చెయ్య లేడు
అగస్త్యుడు వచ్చినా ఏమీ చెయ్య లేడు 71
మనిషి సంస్కార రహితుడై
జంతువు కన్నా హీన మయ్యాడు 73
జంతువు ఏ పూట కా పూట
ఆహారం వెతుక్కొంటుంది 75
మనిషి తన తరానికి
సరిపడా ఆహార ద్రవ్యాల్ని
లాక్కొంటాడు..భద్ర పరచు కొంటాడు 78
పేదవాడికి నోట్లో మట్టి
మిగులు తుంది 80
కొనుగోలు శక్తి లేని
నిరుపేదలు మట్టి ముద్దలు
తిని బ్రతుకుతారు 83
దొరకని మేలుఆహారం బదులు
వింత జంతువుల్ని తిన్నాడు
అడవి గడ్డి తిని కడుపు నింపుకొన్నాడు 86
గబ్బిలాల నుండి ప్రాకిన
ఈ కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని
అంతరింప చెయ్యడానికి
వచ్చిన జీవాయుధమా? 90
ఏ మూలనయినా వ్యాపించే
ఈ అతి సూక్ష్మ జీవులు
ఖండాంతరాల్ని దాటి
మనిషికి నిద్ర కరువు చేసింది 94
ఈ ఉపద్రవాన్ని ఆపే శక్తి
ఎవ్వరికుంది? 96
ఊహాన్ నగరంలో పుట్టి
ఊహ కందని ఈ వైరస్
ప్రజల జీవితాలతో చెలగాట మాడింది99
కోవిడ్ 19 ముద్దుపేరుతో
కోట్ల మందికి భయాన్ని కలిగిస్తోంది 101
ఈ ప్రపంచం ఏ మయినా
నాకు పరవాలేదు
నేను నా కుటుంబం పచ్చగా ఉండాలి
స్వార్థ కుబుసం వీడ లేని
మనిషి సంఘ జీవిగా
పొసగ లేక పోతున్నాడు 107
విశ్వాన్ని భరించ లేనంతగా
ప్రకృతిని నాశనం చేశాము 109
చల్లనిగాలుల్ని విష పూరితం చేశాం
కర్మా గారాల్ని కారాగారాల్ని చేశాం
కార్మీకుల జీవితాలతో ఆడుకొన్నాం
సరస్సులను , జీవ నదుల్ని ఎండ గట్టాం
త్రాగు నీటి గంగా జలాన్ని
రసాయనిక విష ద్రవాలతో నింపాం 115
ఇంకా ఏమి చేశాం? 116
పచ్చని అడవుల్ని బూడిద చేశాం
కోట్లాది జంతు జీవాల్ని పోగొట్టు కొన్నాం 118
కొండల్ని తవ్వాం ..పర్వతాల్ని పడగొట్టాం
మైనింగు పేరుతో మైదానాల్ని లోయల్ని చేశాం 120
సముద్రాల్ని ప్లాస్టిక్ భూతంతో నింపి వేశాం
లావాతో ఉబికే అగ్ని పర్వతాలకు ఆహుతి అయ్యాం 122
ఆకాశంలోకి విష వాయువుల్ని పంపి
ఓజోను పొరను పలుచన చేశాం
ఆర్కిటిక్ మంచు ఖండాల్ని కరిగించేశాం
ప్రకృతి సమతుల్యాన్ని , జీవ జంతు వృక్ష
సమతుల్యాన్ని నాశనం చేసుకొన్నాం 127
ఉపద్రవం ఎందుకు రాదు?
జల ప్రళయాలు ఎందుకు రావు?
భూకంపాలు ఎందుకు రావు? 130
విశ్వం పట్టనంతగా జనాభాను
పెంచుకొంటూ పోతే మనిషి
సమాధికి ఆరడుగుల
నేల కూడా దొరకడం లేదు 134
కరోనా నేర్పించింది ప్రపంచానికి
ఒక ఉన్నత సంప్రదాయం 136
కరచాలనం వద్దు
నమస్తే ముద్దు
ఆలింగనాలు వద్దు
ఆరడుగుల దూరం కద్దు 140
బయట తిరుగుళ్ళు మాను
ఇంటి వరకే వుంటే
నీ బ్రతుకు పదిల మౌను 143
స్విగ్గీ లు , జమోటాల తిండి మనకేల?
బార్లు , పబ్బులు తిరగనేల?
లేని రోగాలు తెచ్చుకొన నేల? 146
అప్పట్లో బామ్మ గారి వంటలు
ఇంటిల్ల పాదికీ ఆరోగ్య కారకాలు
వెల్లుల్లి ఇంగువ వేసిన చారు
రోగాల రాక్షసులకు బేజారు
కొత్తిమీర కరేపాకు అల్లం బెల్లం
వైరసులను ఉంచుతుంది ఆమడ దూరం 152
చేతులు కడుక్కొనే వైనం
చెబుతుంది నీ ఆరోగ్య నియమం
పాటిస్తే స్వచ్చ స్వయం ఆరోగ్య సూత్రాలు
చూస్తావు నిండు నూరేళ్ళు బ్రతుకు సిత్రాలు 156
నిను వినా కరోనాకు దిక్కెవ్వరు?
నీ గొంతులో దిగబడి
నీ ఊపిరి తిత్తులను
అష్ట దిగ్బంధం చేస్తుంది 160
నీ కోసం పరితపించే నీ
వాళ్ళను బలి చేస్తుంది 162
ప్రతి రక్తపు బొట్టులో
ఒక్క రాక్షసుడు పుట్టినట్లుగా
కరోనా లక్షల సంఖ్యలో
నీ శరీరం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది 166
అమెరికా ప్రెసిడెంటు అయినా
బ్రిటిష్ యువ రాణి అయినా
అడుక్కుతినే యాచకు డయినా
కరోనా ధాటికి కాటికి పోవాల్సిందే! 170
ఖండాలను దాటి దేశాలను దాటి
వచ్చింది మహమ్మారి కరోనా
మానవ జాతి చరిత్రలో
వింతయిన విష జీవి కరోనా! 174
నిశ్శబ్ధ రాక్షసులు భయంకరంగా
పగలు రాత్రి తిరుగుతున్నారు
జన సందోహాల మధ్య
కేరింతలు కొట్టే మాల్సు , సినిమా హాళ్ళు
మూగవై పోయినాయి
మనిషి మాస్కు వీరులై పొయ్యారు
నీడకు గూడా వైరస్ తగులుతుందేమోనని
భయపఫుతున్నాడు మనిషి 182
విచిత్ర మైన వైరస్సు
మధ్య యుగాల కాలం నుండీ
మానవ జాతిని ఇలా వేటాడ లేదు
జీవితాలను అతలా కుతలం
చెయ్యలేదు 187
చల్ల గాలిలో
కరోనా దాక్కొందేమో నని అనుమానం
త్రాగే నీళ్ళళ్ళో
కలిసి పోయిందేమోనన్న భయం
గొంతులో దాక్కొన్న వైరస్ కణాలు
ఊపిరి తిత్తుల్లోకి చేరి
మరణానికి చేరుస్తుందేమో నన్న భయం 194
మనిషిని గజ గజ లాడించిన కరోనా
ఎన్ని రోజులు పారాడుతుందో?
ఎంత మందిని
బలి తీసుకొంటుందో? 198
ప్రభుత్వాలు పని చేస్తున్నా
మితిమీరిన జనం కరోనా బారిన పడితే
మానవ గ్రహం మార్సు గ్రహం
అయిపోతుందా?
ఒక బిలియన్ కోట్ల మందిని
భరిస్తున్న ఈ విశ్వం ఖాళీ అవుతుందా? 204
వీరబ్రహ్మం గారి కాలజ్నానం
నిజమయ్యిందా?
ఈశాన్య దిక్కున కోరంటి
విష గాలి సోకి కోటి జనులు
సచ్చేరయా! 209
అవును మానవ జాతి
మనుగడ సాగించాలి
ప్రపంచమే ఒక కుగ్రామైనప్పుడు
జాతి మత వైషమ్యాలు వదలాలి
మానవత్వం పరిడవిల్లాలి 214
పేర్చుకొన్న అణ్యాయుధాల్ని
నిర్వీర్యం చెయ్యాలి
నిరాయుధీకరణ వుద్యమం చేబట్టాలి
దేశాల మధ్య నియంత్రణ రేఖ లున్నా
దాటుకొని వచ్చిన కరోనాకు వీసాలు ఎవరిచ్చారు?
నియంత్రణ రేఖలు చెరిపేసి
విశ్వమంతా మానవ జాతి దే నని ఎలుగెత్తాలి! 221
కరోనా పిశాచి పీడను
అంతమొందిద్దాం
ఆరోగ్య విశ్వాన్ని
భావి తరాలకు అందిద్దాం ! 225
రండి ... కలుద్దాం
రండి ...నడుద్దాం
మన కోసం..మన జాతి కోసం
మన సహ మూగ ప్రాణుల కోసం
మన అడవుల కోసం
మన నీళ్ళ కోసం
మన పచ్చని భూమికోసం
మన సముద్రాల కోసం
రండి ..కలసి నడుద్దాం!
రండి..కలిసి పని చేద్దాం! 235
జాతి మొత్తం ఏకమై
కరోనా భూతాన్ని తరిమేద్దాం !
స్వచ్చ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ
వైరస్ లేని సమాజాన్ని నిర్మిద్దాం !! 239
రచన: వారణాశి భానుమూర్తి రావు
16.03.2020
No comments:
Post a Comment