Verse 1
కాంతి శక్తి ! శాంతి శక్తి !సృష్టి సమస్తం శక్తి అధీనం!
పరాశక్తి స్వరూపం!
సకల దేవతల ఆరాధ్య దైవం !
Verse 2
సృష్టి , స్థితి , లయలకు దివ్యశక్తి
సమస్త చైతన్యానికి మూలపు శక్తి
చరాచర సృష్టికి మాతృ రూపిణి
సకలశక్తి సమన్విత , చిదగ్ని కుండ సంభూత!
Verse 3
ఇచ్ఛాశక్తి , జ్ఞానశక్తి , క్రియాశక్తి
అలరించే అమ్మ - పరబ్రహ్మ స్వరూపిణి
శరత్కాలం స్వచ్ఛతకు ప్రతిరూపం
నవ రాత్రుల అలరారే నీ దివ్యత్వం
Verse 4
ధర్మార్థ కామమోక్ష ప్రదాయినీ...
శైలపుత్రి ! సర్వ దేవత స్వరూపిణి!
నిత్య తపో ముద్రాంకిత బ్రహ్మచారిణి!
కరుణామృత మాతా! చంద్రఘంట!
Verse 5
బ్రహ్మాండమై సకల లోకాల్ని పాలించే
తల్లి కుష్మాండ...
అనురాగవర్షిణి...
అమృత హృదయిని ! స్కందమాత! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ..
Verse 6
భవ జలధిని , చింతాజలధిని ,
సంసార జలధిని దాటించే కాత్యాయని
కాలమేఘంలా గర్జించే కాళరాత్రి మాత
అభీష్టఫలదాయని సిద్ధి ధాత్రి
[Chorus][final]
జ్ఞానదాయిని ! మోక్ష దాయని !
మంగళ ప్రదాయని ! మహాగౌరి!
నమస్తే ! నమస్తే ! నమో నమః !
నమస్తే ! నమస్తే ! నమో నమః !
Varanasi Bhanumurthy Rao
20.09.2026
Hyderabad
Pl see my you tube channel for song..
VARANASI Kathalu Kavitalu
VARANASI SAHTYAM