ప్రజాస్వామ్యం ఎందుకు?
--------------++++++++----
ప్రశ్నిస్తే పొయ్యేదేముంది?
పోరాడితే పొయ్యేదేముంది?
కవుల కలాలు ముందు కెళ్ళవు!
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వు విప్లవ కవి అని ముద్ర వేస్తారనే భయం!
దుర్మార్గుల్ని ప్రశ్నిస్తే నీ అంతు చూస్తారనే భయం!
మరి ప్రపంచంలో ఉద్యమాలు ఎలా వచ్చాయి?
అణగారిన బ్రతుకుల్లోంచి నిప్పు కణికల
ఆగ్రహ జ్వాలా అగ్ని పర్వతాలు
బద్దలై ఉద్యమాలు ఎగిసిపడ్డాయి
మరెందుకు ఇప్పుడు ఆ అగ్నిపర్వతాలు చల్ల బడి పొయ్యాయి?
అన్నెం పున్నెం ఎరుగని చిన్నారుల లైంగిక హత్యలు జరుగుతున్నా నోరెత్తడం లేదు
మతం పేరుతో అభాగ్యులను మారణ హోమం చేస్తున్నా మాట పెగలడం లేదు
దుర్మార్గుల ఆగడాలు ఆగడం లేదు
ప్రపంచ దేశాలు యుద్ధాల బడబాగ్నిలో సామాన్యులు బలై పోతున్నా అడిగే వారు
లేరు
బడా నాయకులు పకడ్బందీగా తమ చీకటి వ్యాపారాలను నడిపిస్తున్నా
అడిగే ధైర్యం ఎవరికుంది?
ఇసుక ...ఖనిజ సంపదను కొల్లగొట్టే రాక్షసులు కొందరయితే
చెరువుల్ని , అడవుల్ని , కొండల్ని మాయం చేసే దుర్మార్గులు కొందరు
ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు
ప్రజలకు పనికి రానప్పుడు
ప్రజా స్వామ్యం ఎందుకు?
రాజ్యాంగం ఎందుకు?
************
వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
20.06.2026