Tuesday, November 5, 2019

అల్లుకొన్న పందిరి


*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *05- 11-2019*
కవి పేరు : *వారణాసి భానుమూర్తి రావు*
సంఖ్య : *165*
అంశం * అనురాగ గోపురం*
శీర్షిక: *అల్లుకొన్న పందిరి*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


ఆలుమగలు కట్టుకొన్న అనురాగ గోపురం
నిలబడుతుంది కల కాలం ఆ కాపురం
చిలిపి ప్రేమలు చిగుర్లు తొడిగిన చిద్విలాసం
చిలకా గోరింకల ప్రణయ సౌందర్యం

తొలి రాత్రి శృంగార భావనలు
ప్రతి రాత్రి మధురానుభూతులు
జీవితమే ప్రణయ కావ్యమయితే
 ప్రతి రోజూ మధుర సుధా భరితము

దిన దిన ప్రవర్థ మానమైన ప్రేమని
అనురాగపు లోగిళ్ళలో  పెంచాలి
మల్లె పూవు తీగ లాగా శ్రీమతి
శ్రీవారి గుండెల్లో అల్లుకొని పోవాలి

అపార్థాల చీడ పురుగుల్ని తరిమి
దిగులు తెగుళ్ళని  దరి చేయ నీక
మధుర మైన తోటలో  ప్రేమ దేవతలై
జీవితాన్ని రసాస్వాదన చెయ్యాలి.


No comments:

Post a Comment