Sunday, December 2, 2018


వారణాసి  వంశ చరిత్ర
రాసిన  వారు :  వారణాసి  కృష్ణ మూర్తి  రావు
-------------------------------------------------------------------------------------------------------

మా తాతగారు వారణాసి  వెంకట్రామయ్య గారు   చిత్తూరు  జిల్లా  లోని కల్లూరు, నడిగడ్డ   ప్రాంతాల్లో  నివసించి, తరువాత  తిమ్మాపురం  గ్రామకరణం ( మునీపు  దారు ) గా ఉన్నారు.

ఆర్ధిక పరిస్థితుల వలన తిమ్మాపురం గాండ్ల పల్లిలో  నివాసం చేసి ఆ తరువాత ఉన్న తావు మార్పు చేసుకొన్నారు.
నడి  గడ్డ లో  పెద్ది రెడ్డి ,  రఘు నాథ రెడ్డి గారు గుమాస్తాగా  పని చేసి ఉన్నారు. వారి కుటుంబ , వ్యాపార ఆర్థిక లావా దేవీలు లెక్కలు రాయడం మా తాతగారి ఉద్యోగం.

వారు ఆర్థికంగా  బాగా ఉండిన వారని మా పెద్దలు చెప్పగా విన్నాను. వారు గూడా కుటుంబ పరిస్థితులతో కొంచెం బాధ పడినట్లుగా విన్నాను.

 వారికి ఇద్దరు భార్యలు . (1) లక్షమ్మ  (2)శేషమ్మ . వారి సంతానమే ఇప్పుడున్న తరం జరుగుతున్నది.

మా తాత  గారు  మంచి గణిత శాస్త్ర వేత్త , మంచి మర్యాదస్తుడు, గౌరవ స్థుడు అనియు మన బంధువులు అంటూ ఉండినారు. 1930 లో ఆయన మరణించి నట్లు తెలుస్తున్నది .

మా తండ్రి గారయినా శ్రీ వారణాసి నరసింగ రావు  గారు , తిమ్మాపురం కరణంగా , 19 వ ఏట  వచ్చి నట్లు   ఉన్నది. వారి కుటుంబ వివరములు పక్క పేజీ  లో  ఉన్నది. 1945 లో మా తండ్రి గారు మరణించి నారు.

మా అన్న గారు వారణాసి లక్ష్మి  కాంత రావు పై అన్ని భాధ్యతలు  పడినవి.  వారి కుటుంబము, నా విద్యాభ్యాసము, మా చెల్లెలి వివాహము వారి మీద పడినవి. వారు బహు సంతాన పరులు. ఉద్యోగం ఉపాధ్యా య వృత్తి , బ్రాంచి పోస్టు మాస్టర్  గా  తిమ్మాపురం లో చేసినారు. జీతాలు బహు స్వల్పం అయినా భుక్తికి  లోటు లేకుండా  ఉండినది. వారు ఎక్కువ కాలం అనారోగ్యముతో  జీవించి నారు. కానీ  బహు తెలివైన వారు . లోకికము బాగా తెలిసిన వాడు. మంచి రూప వంతులు గానే కనపడు  చుండిరి. వారు డిశంబర్  1969 లో స్వర్గస్తులైనారు. వారి ఆత్మకు శాంతి భగవంతుడు  ప్రసాదించు గాక !
 వారి సంతానము ఇప్పుడు ఉద్యోగ రీత్యా  అక్కడక్కడా నివసించు చున్నారు . అందరూ ఆర్థిక లోటుపాట్లు  లేకుండా  శ్రీ  రాఘవేంద్రుని ఆశీస్సులతో జీవం యాత్ర సలుపు  కొను చున్నారు .
రాచ పల్లె లో మా మామ గారు శ్రీ  గోవర్ధనం  శేషగిరి రావు కారణం పని చేయుచు (1894-1972 )1972 లో పరమ పదిం చి నారు.
వారు కూడా  గౌరవ నీయులు , పూజ్య భావము గల వారు , బంధు ప్రీతి గల వారు. వారితో  ఇద్దరు అక్క చెల్లెండ్రు  ఉండి  నారు.  1) శేషమ్మ   2) సుందరమ్మ  అను అక్క చె ల్లెండ్రు  ఉంది నారు.. వారితో  పాటు బావమరిది , మేనల్లుడు ( శేషమ్మ కుమారుడు ) తనతోటే  పాటే  ఉంచు కొన్నారు. వారి ఆత్మకు భగవంతుడు  శాంతిని  ప్రసాదించు గాత !
 వారణాసి కృష్ణమూర్తి రావు అను నేను 10-10-1928 నాడు శ్రీ నరసింగ రావు కనిష్ట కుమారుడు గా విభవ నామ సంవత్సరంలో పుట్టినట్లు తెలియు చున్నది .

చిన్న నాడే అనగా 2 సంవత్సరముల వయసులోనే  మా చేల్లెల్ని ప్రసవించిన నాడే మా మాతృ మూర్తి దివంగతు రాలయినట్లు తెలియు చున్నది .

మా తల్లి  గారు చాలా నిబ్బర మైనది  అనియు  , భర్త కు  విధేయు రాలిగా  వారి ఆజ్ఞను పాటించు నటువంటి ఉత్తమ ఇల్లాలు అని మా పెద్దలు చెప్పుచుండగా విన్నాను.
మాతృ  హీను లైన మమ్మల్ను మా మేన మామ గారు కందూరిలో మా తల్లి తల్లి గారి , మా మేన గారి పోషణలో పెరిగి నట్లు తెలియు చున్నది.
మా సెల్లెలు సుమారు 10 సంవత్సరముల వయసు వచ్చు వరకు   కందూరి   లోనే పెరిగినది. . ఆమెకు మా అన్న గారు 1945 లో వివాహా ప్రయత్నం చేసి గొల్ల పల్లి లో  ఉన్న శ్రీ  రెడ్డి  నారాయణ రావు గారికి ఇచ్చి  వివాహం జరిపించి నారు.

వారు గూడా ఆర్థికంగా బాగా ఉన్న వారే . భూస్వాములు. కాలం బాగుగానే జరిగినది.

నా ప్రాధమిక  విద్యా భ్యాసము నంజంపేటలో 1, 2, 3 తరగతులు మా అవ్వగారు కృష్ణమ్మ  గారి కుమారుల ఇంటిలో చదివి నాను . నా   తదుపరి విద్యాభ్యాసము రాచ పల్లి, కలికిరి, పి  టి ఎం ,  చిత్తూరు లో  జరిగినది. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. తర్వాత నేను 1946 లో ఉపాధ్యాయ వృత్తి శిక్షణ  ను పూర్తీ  చేసు కొని ఉద్యోగములో 1946 లో చే రినాను.  జీతం  సుమారు 40 /50 రూపాయల మధ్య వచ్చు  చుండెడిది .

నా వివాహము 1951 లో జూన్  నెలలో  శ్రీ  గోవర్ధనం  శేషగిరి రావు గారి ఏకైక  కుమార్తె   స్వర్ణాంబతో రాచ పల్లెలో కడు  వైభవముగా   అందరి  బంధువులతో  వేడుకగా జరిగినది.

1946 లో  తలుపుల లో మొట్ట  మొదటిగా ఉద్యోగం  చేసినాను . పల్లవోలు , నెరబైలు , మహల్, మేడికుర్తి, కలకడ  , గుండ్లూరు , వాయల్పాడు  సుమారు 41 సంవత్సరములు  ఉద్యోగము  చేసినాను . జీతము  తక్కువే అయిననూ , జీవితము హాయిగానే  గడచినది.

28. 11. 1952 నాడు  మాకు ప్రధమ పుత్రికా జననము అయినది. ఆమె మంచి రూప వంతు రాలు. బహు ముఖ ప్రజ్ఞా శాలి. 5 సంవత్సరములు  జీవించిన తరువాత  ఆమె అకాల మరణము పొందినది. ఆమె  అమర లోకమునకు వెళ్ళినది. ఆమె ఆత్మ కు శాంతి ఆ భగవంతుడు చేకూర్చు  గాత !

రెండవ సంతానము ఆడ శిశువే , పుట్టిన వెంటనే  మరణించినది.
తరువాత  నలుగురు  కుమారులు,  ఒక పుత్రిక  జన్మిచారు. నలుగురి కుమారులకు వివాహము జరిగినది. చాలా  చిన్న వయస్సులోనే వారికి వివాహములు జరిగినవి.
1978 లో భానుమూర్తి , నాగభూషణ  రావు ఉద్యోగ అన్వేషణకు హైదరాబాదుకు  వచ్చినారు.
1980 లో జనార్ధన , మధుసూదన చదువుల నిమిత్తము హైదరాబాదుకు వచ్చి
నారు. భగవంతుని దయ వలన అందరు చిన్నతనములో  కష్టములు పడిన వారయినప్పటికీ , విద్యాభ్యాసములు పూర్తీ చేసి , ఉద్యోగములలో చేరి, వివాహములు చేసుకొని , సంతాన  వంతులై
వారి వారి  కుటుంబములతో  హాయిగా జీవన యాత్ర సాగించు చున్నారు. వారి తల్లితండ్రులు వారి ఉన్నత స్థితికై , ఆహర్నిశలూ  భగవంతుని ప్రార్థనలు చేయు చున్నారు .
వారికి వివాహములు జరుపు కొన్నటు  వంటి వారి తల్లి తండ్రులు , మా కోడండ్లు అందరు మంచి కుటుంబము , గౌరవములు కల వారు. వారి వలన మాకు గాని, మా వలన వారికి గాని  , ఎటువంటి పోర పొచ్చాలు లేవు. చాలా అన్యోన్యముగా ఇచ్చి తీసు కొన్న వారు మేము మెలుగు చున్నాము.
భగవంతుని దయ వలన మంచి కుటంబముల నుండి  మా కుమారులకు వివాహములు జరిగినవి. అందరు  హైదరాబాదులో  ఉన్నారు.

మా కుమార్తెకు గూడా మా బాంధవ్యములో , మాకు కలిసిన రక్త సంబంధీకుల లోనే  శ్రీ  రాఘవేంద్రుని  దయ వలన వివాహము జరిగినది.

నేను 1988 లో పదవీ   విరమణ గావించి నాను . అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య భాధలు లేకుండా , ఈతి  భాధలు  లేకుండాశ్రీ  రాఘవేంద్రుని దయ వలన ఆయురారోగ్య వంతులుగా ఉన్నాము.
మా చిన్న కుటుంబము ఆర్థిక వసతి, భూవసతి లేని కుటుంబమును శ్రీ  వెంకటేశ్వర స్వామి , శ్రీ  రాఘ వేంద్ర స్వామీ వారి దయ వలన ఒక సామాన్య జీవన యాత్ర సాగించు చున్నందు వలన భగవంతునికి  సాష్టాంగ  ప్రమాణములు  ఆచరించి చిర కాలము మా సంసారములు, మా వంశీ కులు ఆయురారోగ్యములతో, భోగ భాగ్యములతో వర్ధిల్ల వలెనని భగవంతుని శ్రీ రాఘవేంద్ర స్వాముల వారిని ప్రార్తించుచూ  ఈ చిన్న జీవిత చరిత్రను  ముగించు చున్నాను.

ఓం శాంతి , ఓం శాంతి , ఓం శాంతి
ఓం శ్రీ  రాఘవేంద్రాయ నమః

వి . కృష్ణమూర్తి రావు
రిటైర్డు  టీచర్
మహల్ రాజు పల్లి
చిత్తూరు జిల్లా
01.06. 1993


ప్రవర

''అంగీరస , ఆయాశ్చ , గార్గేయస  త్రయ్యాఋషేయ ప్రవరాన్విత గార్గేయస గోత్రోదభవస్య , ఋక్ శాఖాధ్యాయై , అశ్వరాయన సూత్రహ , కృష్ణ మూర్తి రావు శర్మన్ అహంభో  అభివాదయేత్ ''

సంధ్యా వందన కాలములో  చెప్పవలెను.  నోటికి  నేర్చు కొంటే  ప్రవర అడిగిన వారికి చెప్పవచ్చును .


వంశవృక్షము
గార్గేయస  గోత్రము , ఋగ్వేదము
ఆరువేల నియోగులు
( రాసిన వారు .. వారణాసి కృష్ణ మూర్తి రావు .. రాసిన తేదీ : 31.05 . 1993)

 వారణాసి నరసయ్య  గారు(1770- 1830)
                  |
వారణాసి వెంకట్రామయ్య గారు(1800-1860)
                  |
వారణాసి రామయ్య గారు(1830-1900)
     --        వారణాసి కృష్ణయ్య గారు (తమ్ముడు)  ( కురబల కోట)

                 |
వెం కట్రామయ్య   గారు    (1846-1930)
                |
లక్షమ్మ    (మొదటి భార్య)
శేషమ్మ (రెండవ భార్య)( 1890-1962)
/
నరసింగ రావు ( 1876-1945) ( లక్షమ్మ కొడుకు )
రామచంద్ర రావు ( 1918-1994) , రామ లక్షమ్మ , పద్మావతమ్మ ,    రాజమ్మ ( శేషమ్మ కు పుట్టిన సంతానం )
/                                              /                  /                        /
పెళ్లి కాలేదు          తెలియదు           8 మంది           స్వర్ణాంబ ( తండ్రి గోవర్దనం  శేషగిరి రావు )

నరసింగ రావు +జక్కరాజు లక్షమ్మ
/
లక్ష్మి కాంత రావు( 1919-1969)+కావేరమ్మ  ,రాధాపతి రావు( 1944) కృష్ణమూర్తి రావు( 1928)+స్వర్ణాంబ ( 1935)   లక్షమ్మ(1931-2014)
+రెడ్డి                                                                      ( expired)                                                                    నారాయణ రావు
/                                          /                                             /                                                              /
శ్రీధర్ రావు                                           భానుమూర్తి రావు                                     పెద్ద మల్లీశ్వరి
పంకజమ్మ                                            నాగభూషణ రావు                                    చిన్న మల్లిశ్వరి
నరసింగ రావు                                       జనార్ధన రావు                                         మల్లికార్జున రావు
రాజారావు                                              మధుసూదన రావు                                 శివ శంకర్ రావు
మురళి నాథ రావు                                 పద్మజా రాణి                                           శ్రీని వాస రావు
సుదర్శన రావు
ఉమా మహేశ్వర రావు
భుజింగ రావు
అరవింద రావు

వారణాసి కృష్ణమూర్తి రావు + స్వర్ణాంబ  వారి కుటంబము
----------------------------------------------------------------------
1. భానుమూర్తి రావు + కనక లత రావు = కార్తీక్ , నందిని
2. నాగభూషణ రావు + రాజ్య లక్ష్మి = శ్వేత , స్వాతి
3. వెంకట జనార్ధన రావు + విజయ లక్ష్మి = అనీష్ . అఖిల్
4. మధు సూదన  రావు+ నిర్మల = శ్రీకర్
5. పద్మజ రాణి+ జక్కరాజు నాగేంద్ర =  ప్రణీత్ , మృదుల

1. కార్తీక్ + శైలజ = అనన్య ( 2013 ) , అన్విత ( 2015 )
2. నందిని + వినయ్ = ఆద్య ( 2015),


1. శ్వేత+ రామచంద్ర రావు = సమన్వి ( 2013) ,  ప్రశస్తి  (2016)
2. స్వాతి + సందీప్ = సాయి మనస్వి  (2018)








అపరాధివి !

అపరాధివి ! 
---------------------------------------
ఒక్క నవ్వుకు నువ్వు 
బలయి పోతావని నీకు తెలియదు
ఆమె లిప్ స్టిక్ మాటున దాగిన
కృ త్తిమ అందాల అధరాలు అందించే 
మధువును జుర్రుకోవాలనే నీ ఆరాటం
ఒక్క పున్నమి రాత్రి నీ బ్రతుకును 
అమావాస్య చేస్తుందని నీకు తెలీదు
కట్టుబాట్లు మరచి
అప్రకృత లైంగిక వాంఛతో 
నీ  శరీరం  కామ ప్రకోపాల్ని కంపించింది
ఈ జన్మకి దొరికిన ఈ సుఖం 
నిన్ను  కట్టు బానిసను చేసింది
కండోము లేని  నీ శృంగారం
తన కున్న జబ్బును కూడగట్టుకొనింది
ఎయిడ్స్ మహమ్మారి 
నీ తనువులోని అణువణువును 
విచ్చన్నం చేసిందని నీకు తెలియదు
జబ్బుల మయ మైన నీ 
అందమైన శరీరం నిన్ను కురూపిని చేసింది
క్షణికావేశం నిన్ను 
చావు అంచులకు నెట్టి వేసింది
ఈ జన్మ కు నువ్వు  చేసుకొన్న పాపం
నీ వారిని నట్టేట ముంచింది
శారీరక సుఖం  కోసం 
అనైతక  సంబంధాలు వెతికావు
ఫలితం అనుభవిస్తున్నావు
కామానికి ..కాలానికి
ఖాళీ అయి పోయిన నువ్వు 
చావు మేళాన్ని విన వలసి వస్తోంది
నేను నిన్ను ' శత మానం భవతి '  అని
ఆశీర్వ దించినా  అది నిరర్థకం
ఎందుకంటే నువ్వు
స్వయంకృతాపరాధివి! 
నీ విచ్చల విడి కామ కేళీ 
నిన్ను క్షమించదు!
___________________________
వారణాసి భానుమూర్తి రావు
01. 12. 2018
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్బంగా రాసిన కవిత

Wednesday, November 14, 2018

రాసపల్లి కథలు ( 5) - నాగిరెడ్డన్న!

రాసపల్లి కథలు ( 5)  -  నాగిరెడ్డన్న !
------------------------------------------------







 మా రాసపల్లి లో మా రైతులకు  ఆరుగాలం శ్రమించినా  ఫలితం అంతంత  మాటే ! వర్షాలు బాగా పడితే  సేనిక్కాయల పంట  సేతి కొస్తే  ఏదో కొన్ని దుడ్లు  సేతి కొస్తాయి. లేదంటే ఆ సంవత్సరము దరిద్రమే ! 

జూన్ , జులై  నెలల్లో తొలకరి జల్లులు కురిస్తే దుక్కి దున్ని  మెల్లగా గింజల్ని నాటితే , నవంబర్ డిశంబర్ నెలలో పంట సేతి కొస్తుంది అని మా నాయన అనే వాడు.  ఆ ఇంగ్లీసు నెలలు నా కర్దమయ్యేది  గాదు . తెలుగు నెలలు  అయ్యవార్లు నేర్పించినా ఒక రాగాన అర్థం  అయ్యేది గాదు .

అర్థం కాలేదంటే ' మొద్దు ముండా  కొడకా ' అని మా  సారు తిట్టేవాడు .

సైత్రము , వైశాకము ,  జేట్టము , ఆసాఢము , శ్రావణము, బాత్రపదము , ఆస్వయుజము   , కాత్తికము , మార్గశిరము, పుస్యము  , మాగము, పాల్గున ము అని తప్పులు సెప్పేవాణ్ణి.

 ' క్రమం తప్పకుండా సెప్పినావు గాని సామీ , తప్పులు  సెబుతున్నావు' అనే వాడు మా సార్.
ఎన్ని సార్లు  మా సార్  నేర్పించినా  నా నోరు తిరిగితే గదా ? . 'పెద్ద క్లాసులకు పొతే సరిగా సెబుతావులే ' అనే వాడు మా సారు.

మా నాయన్ని నేర్పించమని అడిగినా ఒక్క రోజు. ఆయన కొస్తే గదా నాకు నేర్పించే దానికి. అయన నోరు ఇప్పితే  అన్ని బూతులే ! . ఆయప్ప సదివింది  ఐదవ  తరగతే ! .

 'పెద్ద బాల సిక్ష అంతా గట్టం కొట్టినా , పదహార్లు సార్లు తిరగేసి చదివినా !' అని బొంకాలు పోతాడు మా నాయన. 

మా పల్లిలో జనవరి సంకురాత్రి పండగ రోజు నుండి మళ్ళీ వానలు పడే దాకా ఏమి పనులుండవు జనాలకి. ఊరకే రచ్చ బండ కాడ కూర్చొని , బీడీలు తాగుతూ  లోకాభి రామాయాణం మాట్లాడు కొంటా  ఉంటారు. పొద్దు పోక కొందరు పేకాట ఆడతా ఉంటారు . అదేందో ఇడిసిపెట్టే ఆకుల ఆట అనే వాళ్ళు.  పొద్దు పోలేదని ఆ ఆట వ్యసనం కింద అయిపోయి , స్యానా  మంది దుడ్లు పోగొట్టుకున్నారు. ఆస్తులు గూడా అమ్మేసుకోని పిలేటికి, తిరపతికి పోయి , పేకాట ఆడే వాళ్ళు. ఇంట్లో  ఆడోల్లు ఒక్కటే ఏడుపు.

మా అమ్మ మా  నాయనకు ముందు గానే స్ట్రాంగ్  వార్ణింగు   ఇచ్చింది. పిల్లోడు బతుకు నాశనం సెయ్యొద్దు అని. పేకాట , తాగుడు సెయ్యనని నా మీద పెమానం సేయించుకోనింది మా యమ్మ. మా నాయన్నీ ఎట్లనో ఒకట్ల      పేకాట ఆడించాలని  స్యానా మంది  పిలిసే  వారు. కానీ మా యమ్మ కిచ్చిన పెమానానికి భయపడే వాడు మా నాయన. 

నేను ఆ అట ఎట్లా ఆడతారో  అని అక్కడకు బోయి తొంగి తొంగి  చూసే వాడ్ని. ' రేయ్ సామి , రారా ఆడదాము .. మీ నాయన్ని  పి లుసు కొని రా !' అనే వాళ్ళు .

నాకు బయ మెత్తుకొని ఒక్కటే పరుగు .

 నేను  కొంచెం  పెద్దయినాక  తిరుపతి ఎంకన్న మీద పేమణికమో ఏమో , నాకు ఆ ఆట ఆడేదానికి రానే లేదు . మా ఆస్తులన్నీ తగల బెట్టనే లేదు. 

ఒక్క రోజు నేను , మా నాయన ఇంట్లో కూసోని ఉంటే  నాగిరెడ్డన్న రొప్పుకొంటూ  వచ్చినాడు.  ఆయప్ప ఒక్కటే గస పోతా ఉన్నాడు. 

''ఏమయ్యిది నాగిరెడ్డి ? ఎందుకలా గస పోసు కొంటా  ఉండావు ? ఇందా .. నీళ్లు తాగు?'' అని కుండలో నీళ్లు తెచ్చి ఇచ్చి నాడు మా నాయన.

 '' ఏమి లేదన్న .. మా అమ్మికి బొత్తిగా  ఒళ్ళు బాగా లేదు . ఒక్కటే జ్వరము. బేదులు , వాంతులు .మహల్లో సర్దార్ ఖాన్ ఆసుపత్రి కి  తీసుకోని పోవల్ల. లేకుంటే అమ్మి నాకు దక్కదన్నా '' అని మా నాయన చేతులు పట్టుకొని ఏడ్సినాడు  నాగిరెడ్డి . 

'' నేనేమి సేయాల నాగిరెడ్డి . బండి ఎద్దులు రడీ  గా ఉండాయి. నేను తోడు వస్తాను .పదా మాలుకి ' అన్న్యాడు  మా నాయన. 

''నా ఎద్దల బండి ఉందన్నా ! నాకు అర్జెంటు గా ముప్పై రూపాయలు గావాల ! అమ్మిని ఆసుపత్రికి తీసుకోని బోవల్ల. ఇంట్లో దుడ్లు లేవు. దుడ్లు నీకు రేపు బుధవారం సంతలో కూరగాయలు అమ్మి నీకు ఇచ్చేస్తా ! ఈ  సహాయం సెయ్యన్నా !. నీ  కాళ్ళు పట్టుకొంటాను . అమ్మి పరిస్థితి స్యానా  గోరంగా ఉంది. ''  అన్న్యాడు  నాగిరెడ్డన్న  ఏడుస్తూ . 

మా నాయనకి  దుక్కం ఆగింది గాదు . ఎంటనే  ఇంట్లోకి పోయి ట్రంకు పెట్టలో ఉన్న ముప్పై రూపాయలు తెచ్చి ఇచ్చినాడు . 

నాగిరెడ్డన్న దుడ్లు తీసుకొని ఒక్కటే పరుగు . 

'' పాపం .. ఆ అమ్మికి ఎట్లా ఉండాదో ఏమో ! '' అని మా నాయన గుడ్ల నీరు తుడుసు కొన్నాడు. 

ఈ  కథంతా జరిగినప్పుడు  మా యమ్మ ఇంట్లో  లేదు. అప్పుడే  సేన్లోకి బోయి పశువుల మేత కోసం పచ్చిగడ్డి మోపు నెత్తిన బెట్టుకొని వచ్చింది . 

నేను జరిగిన కథంతా మా యమ్మకు పూస గ్రుచ్చినట్లు సెప్పినా . 

మా యమ్మ గంగమ్మ తల్లి పూనకం వచ్చినట్లు ఒక్క ఎగురు ఎగిరింది. 

' ఏమయ్యా .. నువ్వు తెలిసి తెలిసి నాగిరెడ్డికి  అప్పు ఇచ్చినావు. అతను ఎలాంటి వాడో నీకు తెలీదా ?'' అని ముక్కు సీ మిడి  కొంగుతో తీసుకోని ఏడ్చేదానికి  రెడీ అయింది. 

' పాపం నాగిరెడ్డన్న వాళ్ల అమ్మికి బాగాలేదు. సహాయం సేస్తే తప్పేమి? రేపు మహాల సంతలో అప్పు తిరిగి ఇచ్చేస్తా  నన్యాడు '  అన్న్యాడు  మా నాయన. 

''నాగిరెడ్డన్న కథ నీకు తెలియంది  గాదు . తిరుగు బోతు . తాగు బోతు . పేకాటలో  ఆస్తులన్నీ తగల బెడుతున్నాడంట '' అన్నింది మాయమ్మ . 

'' అదంతా యేమి  లేదు గాని.. బుధ వారం సంతలో ఇస్తా డ్లే ! అన్యాడు మా నాయన. 

ఆ రాత్రంతా మా నాయనకు, మా అమ్మకు నిద్ర పట్టనే  లేదు. 
-------------------------------------------------------------------------------------------------------------------


బుధ వారం మహల్ సంతలో నాగిరెడ్డన్న కోసం ఎంత వెతికినా కనబడనే  లేదు . 
ఒక నెల , రెండు నెలలు  అన్న జాడే లేదు.  మా నాయనకు కనబడకుండా  తప్పించు కొని తిరుగతా ఉండాడు. 

మా నాయన కాళ్లకు బలపం కట్టుకొని తిరగతా ఉండాడు.

 ''మహాల్ క్రాస్ రోడ్ లు ఇసిపెట్టే ఆకులు ఆడతా ఉండాడన్న . అక్కడకి బోతే  మీకు దొరుకు తాడు '' అన్న్యాడు మా సాకలి  ఎంకట్రాముడు .

పరుగెత్తుకొని మా  నాయనా , నేను ఎల్లినాము. 

అక్కడ నాగిరెడ్డన్న  పేకాట ఆడతా ఉండాడు . 

''ఏమయ్యా ..పెద్ద మనిషి .. అప్పు తీసుకోని ఎగ్గొడతావా ? అమ్మి పేరు సెప్పి పేకాట ఆడతా ఉండావా? నా దుడ్డు  నాకిస్తావా ? లేకుంటే  ఊర్లో పంచాయితీ పెట్టించ మంటావా ? '' మా నాయన కోపంగా అరచినాడు   నాగిరెడ్డన్నను. 

'' అన్న .. కోపం చేసుకోకు ... రేపు సాయంకాలం నీ  అప్పు తీర్చేస్తా .. ఇక్కడ  గలాటా సెయ్యకు .నా మానం  బోతుంది.  నీ  అప్పు ఎగ్గొట్టను లే  అన్నా  ''  

అని మా నాయన రెండు సేతులు పట్టుకొన్యాడు నాగిరెడ్డన్న . 

---------------------------------------------------------------------------------------------------------------
పది రోజులయినా  నాగిరెడ్డి  పత్తా  లేడు 

ఒక  రోజు  సాయంకాలం వాళ్ళ    మడిలోని  బావి కాడ కపిలతో నీళ్లు చేదు తున్న నాగిరెడ్డన్న ను కలిసినాడు  మా నాయన.

ఏమి గలాటా  అయ్యిందో ఇద్దరు రక్తం వచ్చేటట్లు  కొట్టుకున్నారు అంట  మా నాయన , నాగిరెడ్డన్న .

ఇంటికి వచ్చిన మా నాయన్ను చూసే సరికి  మా  యమ్మ , నేను ఒక్కటే ఏడుపు. రక్తం కారే సేతులు , ఎర్రగా వాసిన సెంపలు. ఇద్దరూ  బాగా కొట్టుకొన్నట్లు ఉండారు. . 

అమ్మ ఎదో ఆకు పసర్లు , పసుపు తెచ్చి  రుద్దుతోంది. 

అమ్మ ఒక్కటే శాపనార్థాలు.

''వద్దంటే ఇస్తివే. మనకే ఎందుకీ అవస్థ  బగమంతుడా '' అని పాట  పాడుతున్నట్లుగా ఏడుస్తోంది . 

----------------------------------------------------------------------------------------------------------------------

తెలవారుతూనే  ఒక భయంకర వార్త ఇనాల్సి వచ్చింది మాకు. 

'' ఏందంటే నాగిరెడ్డన్న వాళ్ళ బాయిలో దూకి సచ్చి పోయినాడంట . ఎవరో  రాళ్లతో కొట్టి  సంపేసినారంట ''

పల్లిలో ఎక్కడ సూసినా  జనాలు ఇదే మాట్లడుకొంటా ఉండారు. 

'' నీ మొగుడే  సంపేసి నాడంటనే ఎంకట లక్ష్మి .. పల్లిలో అందరు అనుకొంటా ఉండారు '' అంది పక్కింటి  అత్తమ్మ . 

అమ్మకు, నాయనకు ఒళ్ళంతా కంపరం మెత్తింది . గడ గడ మని వణికి పోతున్నారు. వాళ్లను చూసి నాకు ఒక్కటే గుక్కిళ్లు తిప్పుకోకుండా ఏడుపు. 

'' మా ఆయనకు ఏమీ తెలీదత్తా .. నిన్న కొట్టు కొన్నారు అంట ఆ బావి కాడా '' అంది మా యమ్మ ఏడుస్తా. 

'' ఏమో నమ్మ .. ముప్పయి రూపాయలు బాకీ ఉండా డని నీ మొగుడు  నాగిరెడ్డిని సంపేశాడని అందరు అనుకొంటా ఉండారు . కలకడ నుండి పోలీసోళ్ళు  వచ్చేదాకా  ఏమి తెలీదంటా ' అంది అత్తమ్మ .

పోలీసోళ్ళు అనగానే మా నాయన తెలివి తప్పి కింద పడి  పాయ. మా యమ్మ ఏడ్సుకొంటా  ముగాన నీళ్లు సల్లే. 

నేను ఏడ్సుకొంటా '' నాయనా లెయ్యి.. మనకేమి కాదులే '' అన్యాను. 

మా నాయన నన్ను హత్తుకొంటూ సిన్న పిల్లోడిలా  ఏడ్సినాడు . 

---------------------------------------------------------------------------------------------------------------------

నాలుగైదు రోజులయినా మేము ఇల్లే ఇడిసి బయటకు రాలా.

పోలీసోళ్ళు వచ్చి మమ్మల్ని కలకడ పోలీసు టేషన్  కి  తీసుకెళ్తారేమో  అని బయ్యం. 

సాకలి  ఎంకట్రాముడు   ఏట్లోగుడ్డలు   ఉతకడానికి  ఇంటికి వచ్చాడు .

 '' గుడ్డలున్నాయా అమ్మా ? '' అని  కింద కూసోని  అన్న్యాడు . అమ్మ పెద్ద మాసి పోయిన గుడ్డల మూట ముందర తెచ్చి  పెట్టింది. 

'' ఒక్కటి .. రెండు .. మూడు .. '' సాకలి  ఎంకట్రాముడు  లెక్క  ఏసుకొంటున్నాడు  గుడ్డల్ని . 

అమ్మ ఉండ  బట్ట లేక  నాగిరెడ్డన్న  ఇసయం అడిగింది. 

ఎంకట్రాముడు నవ్వేసి '' నాగిరెడ్డన్న సావా లేదు ..గీవా లేదమ్మా ! అప్పులు ఎక్కువ చేసి అట్లా పుకారు పుట్టిచ్చాడంటా .. ఎక్కడో మదన పల్లి తాగి తందానా లాడతా ఉండాడంట ''

అమ్మయ్య.. అని ఊపిరి పిల్సుకోని సచ్చినాము మేము . 

అంతే .. నాగిరెడ్డన్న ఊర్లోకి వచ్చినా మేము అప్పు  అడగానే లేదు.

నాగిరెడ్డన్న అప్పు బాకీ  ఇస్తానని సెప్పలేదు. దర్జాగా  సిల్కు జుబ్బా ఏసుకొని  తిరుగుతున్నాడు  నాగిరెడ్డన్న . 

మా ముప్పై రూపాయలు మావి కావు అని అనుకొన్న్యాము .. అంతే !
-------------------------------------------------------------------------------------------------------------

(ఈ కథ కేవలం  యాదృచ్చికమైనా , ఇందులోని  సంఘటనలు, పేర్లు , పాత్రలు   ఎవ్వరిని ఉద్దేశించి  రాసినది గాదు . ఎవ్వరినీ  నొప్పించ  డానికి రాసినది  గాదు . నా జీవితంలో  జరిగిన ఒక్క చిన్న సంఘటన  ఆధారంగా  రాసిన కథ  మాత్రమే !)


Saturday, November 10, 2018

రాస పల్లి కథలు ( 4) - మా ఇంట్లో దీపావళి

రాస పల్లి  కథలు ( 4)   - మా ఇంట్లో దీపావళి 
--------------------------------------------------------------------------------------------------


మా ఇంట్లో దీపావళి 

------------------------------

నేను ఐదవ తరగతి మహాల్లో ప్రాధమిక పాఠశాల లో సదువుకొనే రోజుల్లో నాకు సుదర్శనం అనే స్నే హితుడుండే వాడు.అప్పుడు నాకు తొమ్మిదేళ్లు . మేమిద్దరం అన్ని ఇసయాల్లో ఒకటే మాట , ఒకటే పాట . మా అయ్యగార్లు గూడా మమ్మల్ని చూసి అన్నదమ్ములు రామలక్సమణుల్లా ఉండార్రా అనేవాళ్ళు . మా జట్టును జూసి అందరికి ఒకటే కుల్లు . మమ్మల్ని వాళ్ళతో ఒకసారి గూడా ఆడించుకొనే వాళ్ళు కాదు. ఏడ్పించే వాళ్ళు. కొట్టే వాళ్ళు . అయినా మేము అన్నీ సయించి మా స్నేహానికి దూరం కాలేదు . 

ఒక్క సారి మా సుదర్శనం స్కూలుకి రాలేదు . మా పిళ్ళె సారు వాల్లింటికి పోయి బడికి ఈడ్సుకోని వచ్చినాడు . మా రోజుల్లో బడికి రాలేదంటే సిచ్చలు బాగా ఉండేవి . సింత బర్రెలు తీసుకోని కొట్టే వాళ్ళు . లేదంటే ఒక వేప సెట్టు దూలం ఉండేది . ఆ దూలానికి కట్టేసే వాళ్ళు . సింత మాను దుంగకు ఇనుప చైన్ తో మా కాళ్ళు కట్టేసి ఏడ్పించే వాళ్ళు. లేదంటే గోడ కుర్సీ , తొడ మీద గిచ్చే వాళ్ళు. ఇన్ని శిక్షలుకు మా పసి మనసులు ఏమి సేయాలో తెలియక ఏడ్సుకొ నే వాళ్ళం . సుదర్శనం ఆ రోజు బడికి రాలేదని గోడ కుర్సీ ఏపించి నాడు మా పిళ్ళై సారు . నాకు స్యానా కోపం వచ్చి అయన చేతిని రక్తం కారేటట్లు కొరికి నాను . దానికి పిళ్ళై సారుకు స్యానా కోపం వచ్చి మా హెడ్డు మాస్టర్ సారుకు బోయి సెప్పినాడు . ఆయప్ప గూడా నన్ను బాగా తిట్టినాడు . ఆ రోజంతా మాకు తిట్లు , సింత బర్ర దెబ్బలు. అలా సాగింది మా ఇసుకూలు జీవితం. 

దీపావళి పండగ అంటే నాకు , మా స్నేహితుడు సుదర్శనం కి చాలా ఇష్టం . పండగ కంటే రంగు రంగుల టపాకాయలు కాల్చాలంటే చాలా సంతోషంగా ఉండేది. మా పిల్లోళ్లకి అందరికి ఈ పండగంటే స్యానా ఇష్టం. మా నాయన పండగ రెండు రోజులకు ముందు మహల్లో కొమిటోళ్ల అంగడికి ఎల్లి పటాకులు తెస్తాడు . ఐదు రూపాయలకు ఒక తిత్తి నిండుకు వచ్చేవి . అప్పుడు గూడా మాకు శివకాశి టపాకాయలు ఏ మదన పల్లి నుండో , తిరుపతి నుండో కొమిటోళ్లు తెచ్చి చుట్టుపక్కాల రైతులకు అప్పుకు అమ్మేవారు. సంక్రాంతి పండక్కి వచ్చే సెనిక్కాయలు అమ్మేస్తే వచ్చే దుడ్డుకు లెక్క కట్టి జమ యేసే వాళ్ళు . ఆ లెక్క లన్ని మాకు సిన్న పిల్లోళ్లకు తెలిసేది కాదు. ఎప్పుడు మా నాయన ముఖం టెన్షన్ గా ఉండి , నవ్వే వాడు గూడా గాదు . ఎమన్నా అంటే బర్రెను కొట్టినట్టు కొట్టేస్తాడు . మా సిన్నప్పుడు మాకు ఎప్పుడు దెబ్బలు , తిట్లు , శాపనార్థాలు తప్ప ఇంకోటి ఉండేది గాదు. ఏమి సెయ్యాల .. దుడ్లు ఉండేవి  గాదు. పంటలు సరిగా పండేవి గాదు . రాయల సీమ అంటే ఒకప్పుడు రతనాల సీమ అనే వాళ్ళంట . కానీ నేను మా ఊర్లో ఎవరి ముకాల్లో సూడనే లేదు నవ్వు . ఎప్పుడు బాధ పడతానే ఉంటారు . వాన బాగా కురిస్తే సేనిక్కాయల పంట బాగా వస్తుంది . నిమ్మన పల్లి డాంలోకి నీళ్లు వస్తేనే ఏదో మడ్లో పంటలు, తిండి గింజలు సంమత్సరానికి బాగా పండుతాయి .

ఇదంతా సెప్పి మిమ్మల్ను బాధ పెట్టాలని గాదు గానీ , మా సిమోళ్ళ కతలు , కట్టాలు ఎలా ఉంటాయనే సెపుతున్నా .

అది సరే గాని మా సుదర్శనం వాళ్ళు కోమిటోళ్లు. వాళ్లకు దుడ్లు , యాపారాలు స్యానా ఉండేవి. వాళ్ళ తాత వడ్లు బియ్య ఆడించే మెషిన్ ఫ్యాక్టరీ కట్టించాడని సెప్పే వాడు నాకు. అబ్బా ఎంత సావుకార్లో అని అనుకొనే వాడ్ని . వాళ్లకు పెద్ద కిరాణా షాపు ఉండేది. మా సుదర్సనం రోజు నాకు పప్పిరమెంట్లు , పప్పులు , బఠాణీలు తెచ్చి ఇచ్చే వాడు. లేదంటే వాళ్ళింట్లో చేసిన అప్పచ్చులు , మురుకులు ,పాగం పప్పు తెచ్చి ఇచ్చే వాడు.

నేను మా ఇంట్లో ఏమైన సేస్తే కజ్జి కాయలు , ఉడక బెట్టిన సేనిక్కాయలు , అలసందలు, కారం బెట్టిన అనప కాయ గింజలు, సేనిక్కాయ ఉండలు, జొన్న బొరుగులు తెచ్చి ఇచ్చే వాడ్ని. బాగా నవ్వు కొంటూ తినే వాళ్ళము . 

ఒక దీపావళి పండక్కి మా నాయన ' టపాకాయలు కొన లేనర్రా!'   అన్నాడు. మా అన్న దమ్ములకు బాగా ఏడుపు వచ్చింది .

' యాల  కొనలేవు నాయనా ? ' అని అడిగినాము.

' దుడ్లు లేవు. మాల్లో ఆ కొమిటోళ్లు అప్పు ఇవ్వం అన్నారు. ఇప్పుడే చేసిన బాకీ ఎక్కువుంది . అది తీరిస్తే గాని కొత్త అప్పు ఇచ్చేది లేదని సెప్పినాడు రెడ్డప్ప గుప్త ' అన్యాడు మా నాయన.

మమ్మల్ని నలుగురు అన్నదమ్ములని దగ్గరకు తీసుకోని ఆయన గుండెకు గట్టిగా హత్తుకొని ఏడ్చేసినాడు మా నాయన. 

మా యమ్మ , మా అన్నలు అందరు గూడాఏడ్సినాము . నేనే మా ఇంట్లో సిన్నోన్ని . 

'ఏడవద్దు సిన్నోడా .. నీకు నేను తెచ్చి ఇస్తా .. చెప్పు నీకేమి టపాకాయలు కావాల్నో ! ' అన్న్యాడు మా నాయన నా కళ్ళు తుడుస్తూ .

అంత ఏడుపు లోనూ నేను ' నాయనా ..నాకు ఈ సారి లక్ష్మి బాంబులు గావాలా .. తుపాకీ కావాలా .. అందులో రిబ్బను పటాసాలు పెట్టి కాలుస్తాను ' అన్నాను. 

అంతే మా ఇంట్లో అందరూ నవ్వుకున్నాము ఆ రోజు.

--------------------------------------------------------------------------------------------------

మరుసటి రోజు స్కూలు కెళ్ళి నాక నిన్న మా ఇంట్లో జరిగిన కథంతా మా స్నేహితుడు సుదర్శనానికి సెప్పినాను . సెప్పుతూ ఉంటే నాకు తెలీకుండానే కళ్ళలో నీళ్లు , ఏడుపు ఆగలేదు . 

సుదర్శనం నా చేతులు గట్టిగా పట్టుకొని ' మా ఇంట్లో అంగడి ఉంది గదా! మా అయ్యను అడిగి నీకు దండిగా తీసుకొస్తాను . నువ్వు ఏడవద్దు సామి ' అన్నాడు .

నాకు స్యానా సంతోషం ఏసింది .

'దీపావళి పండుగ రెండు రోజుల ముందే టపా కాయలు ఇస్తాను . మా అంగడికి రా రా! ' అన్న్యాడు సుదర్శనం .

అనుకొన్న రోజు వాళ్ళ అంగడి దగ్గరికి ఎల్లి ఓ మూల దాక్కొన్నాను .

ఒక తిత్తిలో బురుజులు , భూ చక్రాలు , కాకర ఒత్తులు, చిచ్చు బుడ్లు ,లక్ష్మి బాంబులు ఏసుకొని సుదర్శనం నేనున్న చోటికి వచ్చి తెచ్చి ఇచ్చినాడు . సంతోషంగా తీసుకోని ఇంటికి పోయినాను. అప్పటికే మా నాయన గూడా దండిగా టపాకాయలు తీసుకోని వచ్చినాడు . మా ఇంటిలో అందరూ హాయిగా నవ్వుకొని అన్ని పంచుకొని ఎవరి టపాకాయలు వారివి ఎండలో పెట్టడానికి తయారు అయినాము. నా స్నేహితుడు ఇచ్చిన టపా కాయలు ఎవ్వరికి కనబడకుండా దాచేసి నాను. అవి చూపిస్తే అవి గూడా భాగం పెట్టమని అడుగుతారు మా యన్నలు.

--------------------------------------------------------------------------------------------------

మరుసటి రోజు సుదర్శనం మా ఇంటికి ఏడుస్తూ వచ్చినాడు. వాడ్ని చూసి నాకు ఏడుపు వచ్చింది . జుట్టంతా చింపిరి చింపిరి. మాసి పోయిన గుడ్డలు . కళ్ళు ఉబ్బి పోయినాయి. చేతులు ఎర్రగా కంది పోయినాయి .

'ఏమైంది రా ' అన్నాను వాడి బుగ్గలు నిమురుతూ .

' మా నాయన నన్ను దున్నపోతును కొట్టినట్లు కొట్టినాడ్రా ...బెల్టు తో ' అంటూ వాడు ఏడ్చి నాడు .

' ఎందుకు? '

'మా నాయన్ని అడగకుండా నీకు నిన్న టపాకాయల్ని తెచ్చి ఇచ్చినాను గదా ? ఇంటిలో దొంగ తనం చేస్తావా ?? ' అని కొట్టినాడు .

నాకు భయం ఏసి వెంటనే ఇంటిలోకి పరుగెత్తి వాడిచ్చిన టపాకాయల సంచి తెచ్చి ఇచ్చేసి నాను. 

వాడు పరుగెత్తు కొంటూ సంచితో ఎల్లి పొయ్యాడు . నేనూ వాడి ఎనకాల వాళ్ళ అంగడికి పరిగెత్తి నాను .

సుదర్శనం వాళ్ళ నాన్నకు నేనిచ్చిన సంచి తిరిగి ఇచ్చేసాడు. వాళ్ల నాన్న టపా కాయల్ని చూసుకొన్నాడు.

' ఒరేయ్ సామీ ..నీకోసం మా వోడు దెబ్బలు తిన్యాడ్రా ' అని నాకేసి ఉరిమి చేసినాడు రెడ్డప్ప గుప్త. 

నాకు భయం ఏసింది. నన్ను గూడా గొడ్డును బాది నట్లు బాదు తాడేమో అని అనుకొన్నాను . 

'ఒరేయ్ వాడ్ని కొట్టింది నీకు పటాకులు ఇచ్చినాడని గాదు . నాకు తెలీకుండా అంగట్లో దొంగలించినాడని' అన్న్యాడు వాళ్ళ నాయన. 

ఆ సంచిని నా చేతి కిచ్చి , ' ఒరేయ్ సామి.. ఇవన్నీ తీసుకోని రేపు పండక్కి కాల్చు కోపోరా ' అన్నాడు ఆయప్ప.

నాకు చాలా సంతోషం ఏసింది . 

' నాయనా .. సుదర్శనం .. నీకు కావాల్సిన టపాకాయల్ని ఇంటిలో పెట్టినాను . కొత్త బట్టలు ఏసుకొని పండగ చెస్కో ' అని సుదర్శనాన్ని దగ్గరకు తీసుకోని ముద్దులు పెట్టినాడు వాళ్ళ నాయన.

సంచి తీసుకోని సర్రున ఇంటికి సేరినాను .

మా నాయన తెచ్చిన టపాకాయలు, నా స్నేహితుడు ఇచ్చిన టపా కాయల తో పాటు ఒక్క వారం రోజులు కాలుస్తానే ఉండాము . కానీ ఎక్కడో ఇప్పటికి నా స్నేహితుడు నాకోసం దెబ్బలు తిన్యాడని అనుకొంటే మనస్సు కాలిలో గాజు గ్రుచ్చుకొన్నట్లుగా బాధ పడుతుంది .

'మా సుదర్శనం యాడున్నా సల్లగా ఉండాలి స్వామీ ' అని ఎప్పుడూ మొక్కు కొంటానే ఉంటాను నేను.


-----------------------------------------------------అయి పోయింది ---------------------



(ఈ కథ కేవలం  యాదృచ్చికమైనా , ఇందులోని  సంఘటనలు, పేర్లు , పాత్రలు   ఎవ్వరిని ఉద్దేశించి  రాసినది గాదు . ఎవ్వరినీ  నొప్పించ  డానికి రాసినది  గాదు . నా జీవితంలో  జరిగిన ఒక్క చిన్న సంఘటన  ఆధారంగా  రాసిన కథ  మాత్రమే !)



Monday, October 29, 2018

పాపం ఏమిటి?

పాపం  ఏమిటి?

పార్ట్ IV 






పాపం  ఏమిటి ?  పుణ్యం  ఏమిటి? ఏది పాపం  కాదు?  ఏది పుణ్యం  కాదు?సత్ప్రవర్తన ఏమిటి?  నాకు పాపం అనుకొన్నది  ఇతరులకు తప్పనిసరిగా  పాపం కాకపోవచ్చు. ఒక నిర్దిష్ట చర్య చేసేందుకు అనుభూతి నాకు ఒక పాపం    అనిపిస్తుంది   కానీ ఇతరులకు      ఆ పాపం   చెయ్యడం      తన విధి  అనుకున్నప్పుడు  మరియు అతనికి  అందుకే అది ఒక పాపం కాదని అనిపిస్తుంది. 

మనం పైన సందర్భం నుండి తెలుసుకోవడానికి దానిని ఆలోచన లేదా నేను ఇతరులు అదే కాకపోవచ్చు ఆలోచిస్తున్నాను .  ఒక వ్యక్తి ఉంది పాపాత్మకమైన చట్టం యొక్క ప్రవర్తన మరియు వైఖరి changeth ఆ ఆలోచనా మార్గం శక్తి ఉంది.

ఉదాహరణకు, ఒక వివాహిత జీవితం భాగస్వామి కంటే ఇతర స్త్రీతో లైంగిక వాంఛ కొందరికి ఒక పాపం, కానీ వారు కాలం మీరు బలవంతంగా ఆ లేదు లేదా ఆ చర్య చేయడానికి ఒక మహిళ coercing ఆలోచించినట్లు ఇది కొన్ని ప్రజలు ఒక పాపాత్మకమైన చట్టం కాకపోవచ్చు .  ఇతర మతాలలో, హిందూ మతం గ్రంధములను మరియు వాస్తవానికి వంటి ప్రకారం ఇతర మహిళలతో సెక్స్ కలిగి మాత్రమే ఒక పాపం మరియు మరణం తర్వాత నరకమునకు లో దండన ఉంటుంది.


కొంతమంది దేవుని ఉనికి నమ్మకం వారు దేవుని నమ్మకం ఉంటే వారు మరణించిన తరువాత హెల్ మరియు స్వర్గం నమ్మకం ఉండాలి. వారు ఈ నమ్మకం ఉంటే, వారు కూడా వారి మరణం తర్వాత వివిధ నేరాలు మరియు పాపములకు శిక్ష నమ్మకం ఉండాలి. Eeshopanishath ప్రకారం, వివిధ పాపాలు కోసం శిక్షలు ఇస్తారు. మనిషి ఉడికించిన నూనెలో సజీవంగా మునిగిపోయాడు ఉంటుంది లేదా తన కళ్ళు ఎరుపు వేడి ఇనుము రాడ్లతో కుట్టిన ఉంటాయి లేదా అతను Vytharini అనే నది మాంసం మరియు రక్తాన్ని లో ఈత అడగబడతారు. కానీ ఎలా మనలో చాలా మంది మరణం తర్వాత వేచి శిక్షలు ఇటువంటి రకం నమ్మకం లేదు? 

కొంతమంది ప్రకృతి చట్టాలు ప్రకారం, మీరు కొన్ని తప్పు లేదా నేరం చేస్తే, అది ఐచ్ఛిక ప్రతిస్పందన కలిగి ఉంటుంది మరియు దేవుని గమనించి చేయబడుతుంది మరియు నేరాన్ని శిక్షించేందుకు వాదిస్తారు. ప్రతి చర్య కోసం, ఒక స్పందన ఉంది అంటే.

ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి, అన్ని దేశం మరియు కాని - ప్రాణుల భూమి అంటుకునే మరియు పడిపోవడం లేదా గాలిలో తేలే కాదు. ఆ ఇష్టం, దేవుడు మాకు పర్యవేక్షక ఉంది, మరియు కొంతమంది మంచి మరియు చెడు పనులు సాగించడం నుండి, మానవ జాతి ఇప్పటికీ ఉన్న మరియు ఉనికిలో ఉన్న. నేను అన్ని ఈ ప్రపంచంలో .అక్కడ, మంచి పనులు ఇతరులు నివసిస్తున్నారు మరియు ఎవరు దేవుని నమ్ముతూ ఈ ప్రపంచంలో చాలా మంచి వ్యక్తులు చెడు వ్యక్తులు చెప్పలేను. ఎందుకంటే దేవుని పర్యవేక్షణలో ఇది ఈ సాగించడం అంకం యొక్క, మనిషి ఇప్పటికీ ఉన్న మరియు ఉనికిలో ఉన్న.

మరొక ఉదాహరణ, మేము ఇతరులు వ్యతిరేకంగా పగ జనసంఖ్య కొన్ని చూడగలరు. పోలీస్ ఎన్కౌంటర్లలో నక్సలైట్లు చంపడం మరియు నక్సలైట్లు మందుపాతరలు పోలీసు వారే. తీవ్రవాదులు వారు అక్రమంగా మా సరిహద్దుల లోకి దొంగతనంగా విధంగా మా సైన్యం హత్య చేస్తున్నారు మరియు టర్న్ లో తీవ్రవాదులు సైన్యం, పోలీసులు, para- సైనిక సిబ్బంది మరియు అమాయక ప్రజలు మరణించారు. 

రాయల సీమ లో, ఎందుకంటే ఫ్యాక్షన్ అంతఃకలహాలు యొక్క, అనేక మంది చనిపోతున్నారు. మీరు నా తండ్రి మరియు గ్రాండ్ తండ్రి మృతి నాటినుండి, నేను మీ తల్లి మరియు గ్రాండ్ తల్లి హత్య చేశారు. హత్య స్కోర్లు పెరుగుతున్నాయి మరియు ప్రజలు వాచ్యంగా చిరు కారణాల చంపబడతారు. ఒక వ్యక్తి తన భార్యను మానభంగం కనుక, అతను భర్త హత్య చేశారు. ఆ ప్రతి చెడు చర్య కోసం, చెడు స్పందన ఉంది అంటే. ఫలితంగా, సమాజంలో చెడు విషయాల యొక్క ఒక కాస్కేడింగ్ ప్రభావం ఉంది.

ఆ ఏమి మేము ఒక పాపం యొక్క ఇతర దృష్టిలో అన్ని పాపం కాదు ఉంది అనుకుంటున్నాను అర్థం. ఆ .నేర నేర ఎలా, ఈ సమాజంలో, నేర ప్రభావం ఉధృతం begets మరియు పాపం పాపం begets ఉంది. బందిపోటుగా యొక్క ఇతర వస్తువులు లూటీ ఒక పాపం కాదు భావించేది. ఎందుకంటే తన దృష్టిలో, అతను అది అతని జీవన ఆలోచిస్తుంటాడు. వ్యభిచారి, తద్వారా అనేక మంది సెక్స్ కలిగి ఆమె తన వృత్తిలో అని ఆలోచించడం కారణంగా, ఒక పాపం కాదు భావించేది. ఒక రాజకీయ లేదా ఒక బ్యూరోక్రాట్ లేదా ఒక కార్యాలయంలో ఒక క్లర్క్గా నగదు లంచాలు తీసుకొని లేదా రకమైన, ఒక పాపం లేదా నేరం అని అతను దానిని తీసుకోవటానికి అతని కుడి అని ఆలోచించడం కారణంగా కాదు భావించేది. వారు వ్యక్తి కొన్ని అదనపు సాధారణ సేవ చేయాలని అవినీతి సాధారణ విషయం పరిగణిస్తారు. వారి దృష్టిలో, అది ఒక పాపం. ప్రభుత్వం మంచి జీతాలు, అలవెన్సులు చెల్లించే మరియు గృహ వసతిని, ఇప్పటికీ అతను లంచం తీసుకొని తన ప్రాథమిక హక్కు అని అనిపిస్తుంది. రాజకీయ నాయకుడు లంచాలు తీసుకుని అది పార్టీ నిధుల కోసం ఉపయోగిస్తారు అని చెప్పటానికి. తన దృష్టిలో అది, అతను ప్రజలు మరియు సమాజం యొక్క కారణం కోసం తన మొత్తం జీవితంలో త్యాగం అని ఆలోచించడం కారణంగా ఒక పాపం లేదా నేరం.

మేము ఈ ఏమి నేర్చుకోవచ్చు? చర్యగా చేయండి లేదా, తేడా ఆలోచనలలో చేస్తుంది. మీరు మంచి భావిస్తే. మంచి విషయాలు జరుగుతుంది మరియు మీరు చెడు భావిస్తున్నాను ఉంటే, చెడు విషయాల జరగవచ్చు.

వారు నిర్దిష్ట వయస్సు వచ్చే వరకు పిల్లలు చాలా అమాయక ఉన్నాయి. వారి ఆలోచనా సామర్థ్యం చాలా ఆహార తీసుకొని మరియు గేమ్స్ ఆడటం వరకు పరిమితం ఎందుకంటే. అతను తన తల్లి చూడండి లేదు ఉంటే, అతనికేం మొదలవుతుంది. ఒకసారి అతను తన తల్లి చూస్తాడు, తన ఆనందం హద్దులు లేవు. పిల్లల ఎల్లప్పుడూ కూడా చెడు విషయాలు మంచితనం చూడండి. అతను రేజర్ బ్లేడ్ ఒక ప్రదర్శనా సాధనం మరియు ఆడటానికి ప్రయత్నించండి భావిస్తోంది. అతను కాల్పులు వెళ్తాడు మరియు టచ్ అది తన పిల్లల ఆడని మరియు టచ్ జాగ్రత్త తీసుకుంటుంది ఒక తల్లి, మస్కట్, దేవుడు ఎల్లప్పుడూ ఒక తల్లి వంటి మాకు చెడు విషయాలు వెళ్ళాలన్న చెబుతున్నాయి మరియు చెడు పనులు. ఒక బిడ్డను, మనిషి గ్రహించడం మరియు ప్రవర్తించే మరియు కూడా చెడు విషయాలు అన్ని మంచితనం తప్పక చూడండి. ఒక పిల్లవాడు తన తల్లి .ఆయన దేవుని ఉనికి కలగాలి చూస్తాడు వంటి అతను అన్ని దేవుని ఉనికి చూసేందుకు ఉండాలి. అప్పుడు మనిషి కచ్చితంగా మంచి మరియు చెడు, ఏమి పాపాత్మకమైన మరియు ఏ కాదు తెలుసుకోవటం. అతను మంచి మరియు చెడు సమతుల్యం మరియు సమతుల్య యంత్రం వంటి కుడి విషయం గూర్చి తీర్పు చేయగలదు. పాలు మరియు నీటి మిశ్రమం బయటకు మాత్రమే పాలు పడుతుంది ఇది ఒక నెమలి, వంటి, మనిషి అన్ని మంచి విషయాలు గ్రహించడం ఉండాలి. నేను దైవత్వం మీకు కూడా me.I రాళ్ళు, పర్వతాలు, సరస్సులు, నదులు, ఆకాశం, భూమి, చెట్లు మరియు జంతువులు ప్రకృతి యొక్క ఆనందం చూడగలరు దైవత్వం చూడగలరు అదే విధంగా కాబట్టి, మీరు చూడవచ్చు. నేను అన్ని ప్రకృతి యొక్క ఆనందం చూడగలరు ఉంటే, నేను అన్ని విషయాలు లో దేవుని ఉనికి చూడగలరు. చెట్లు మరియు జంతువులు. నేను అన్ని ప్రకృతి యొక్క ఆనందం చూడగలరు ఉంటే, నేను అన్ని విషయాలు లో దేవుని ఉనికి చూడగలరు. చెట్లు మరియు జంతువులు. నేను అన్ని ప్రకృతి యొక్క ఆనందం చూడగలరు ఉంటే, నేను అన్ని విషయాలు లో దేవుని ఉనికి చూడగలరు.

దేవుడ్ని      కొడవలి లో చూడండి . రైఫిల్ లో  దేవుడ్ని     చూడండి.   బాంబులో  దేవుడ్ని     చూడండి.  గొడ్డలిలో  దేవుడ్ని  చూడండి . రాతిలో  దేవుడ్ని     చూడండి . మహిళలో ఒక దేవుడ్ని  చూడండి.  చెట్లల్లో  దేవుడ్ని  చూడండి.  చీకటి లో  దేవుడ్ని  చూడండి మరియు    వెలుగులో  చూడండి . దయ్యం లో ఒక దేవుడ్ని  చూడండి       . అప్పుడు మీరు ఖచ్చితంగా    అంధకారం  నుండి  బయటపడి  జ్ఞానోదయం అవుతుంది. 


జై గణేశ



వ్యాఖ్యలు లేవు:


ఒక వ్యాఖ్యను పోస్ట్









Tuesday, October 23, 2018

భానుమూర్తి గారి భావ ప్రకంపనలు

భానుమూర్తి గారి భావ ప్రకంపనలు

''That thinking or speaking about  society is also at another level thinking and speaking about life.'' - ruth padel


కవిత్వం అంటే వినోదం కాదు . వేడుక అంతకన్నా కాదు . ప్రాణ భూతమైన ఒక చర్య , సామాజిక బాధ్యత . ఆధునిక కవిత్వానికి నూట ఇరవయ్యేళ్ల చరిత్ర ( 1899 -2018 ) పూర్తి కావస్తున్నది . అనేక సామాజిక ఉద్యమాలకు , భావ జాలాలకు ఈ చరిత్ర కవిత్వరూపంగా నిలుస్తున్నది. తెలుగు కవులు నిర్వహిస్తున్న సామాజిక బాధ్యతకు ఈ చరిత్ర సాక్షి . అలాంటి బాధ్యతాయుత పాత్ర నిర్వహణలో కవులు అత్యంత జాగ్రత్తగా , పరిశీలనా దృక్పథం కలిగి ఉండి , ఎప్పటికప్పుడు స్పందిస్తూ , తన చుట్టూ సమాజం లోని బాధితులు,అభాగ్యులు,దుఃఖిత పీడితుల పక్షాన నిలబడాల్సిన తమ వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాల్సి ఉంటుంది .


కాలంతో పాటు ప్రయాణిస్తారు కొందరు. కొత్త భావాలను సంతరించుకొని , చిగురులెత్తే కొత్త స్వరాలతో , ఆ స్వరాల్లోని సృజనాత్మకత అభినివేశంతో ఉద్దీపులవుతారు . వారు వయస్సుతో నిమిత్తం లేకుండా , స్పందన , ప్రతిస్పందనలతో తమ రచనలను కొన సాగిస్తారు .వారు వ్యక్తీకరించే మాటలను సూటిగా , పదునుగా చెప్పాలన్న ధోరణిని ఎవరైనా స్వాగతించాల్సిందే !. ఈ మధ్య కాలంలో విసురుగా , దుడుకుగా , నిజాన్ని నిక్కచ్చిగా చేప్పే స్వరాలు నేటి సాహిత్య రంగంలో వినిపిస్తున్నాయి. తాము చెప్పాలనుకొన్న పద్ధతిలో అంటే ఘాటుగా చెప్పాలన్న పట్టుదల కొందరి రచనలో స్పష్టంగా కనిపిస్తుంది . అందులో తప్పు లేదనిపిస్తుంది . తమలోని రచనా శక్తిని తాకట్టు పెట్టి లొంగి పొయ్యే వాళ్ళు అప్పుడూ వున్నారు . ఇప్పుడూ వున్నారు . ఎప్పుడూ ఉంటారు . 

''కసితో స్వార్థం శిరస్సును గండ్ర గొడ్డలితో నరక గల్గిన వాడే నేటి హీరో'' అన్న శివసాగర్ మాటకి ఇప్పటికి ప్రాసంగికత ఉంది. కులం, మతం, పెట్టుబడి మనుషుల మీద చేసే పెత్తనాన్ని ఆధిపత్యాన్ని ప్రశ్నించిందాల్సిందే అన్న సత్యాన్ని కవులు గమనించి తమ రచనలలో నిగ్గదీసే వాక్యాల్ని కనబరచడమే నిజమైన జీవన చైతన్యానికి దాఖలాగా నిలిచిపోతుంది.

'' there is genuine suffering in the world, the suffering of actual people , and poetry addresses this suffering almost better than anything else. we are not passive but active subjects of both personal and society history. it demands our attention , our intervention. memory is a responsibility'' - edward hirsch.

పట్టభద్రులై వివిధ కార్పొరేట్ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్ బాధ్యతలను నిర్వహించి , వారణాసి భానుమూర్తి రావు గారు , తమ చిన్నతనంలో తల్లి తండ్రులు ఎదుర్కొన్న కష్టాల్ని , కన్నీటి సంఘటనల్ని నేటికీ గుర్తు చేసుకొంటూ , సామాజిక బాధ్యతల్ని గుర్తెరిగి , రచనల పట్ల ఆసక్తి పెంచుకొన్నారు .సమాజంలోని ద్వంద వైఖరి మారాలని , కులమత సంఘాలు కనుమరుగై పోవాలని , అలాగే స్వార్థ రాజకీయాలు కూడా ఉండరాదని గట్టిగా నమ్మిన వ్యక్తిగా తమ ఆలోచనల్ని కవిత్వాలుగా, రచనలుగా మార్చుకొని సాహిత్య రంగంలో ప్రవేశించారు. కవిగా , రచయితగా కవితలు, కథానికలు రాస్తూ గొప్ప సాహిత్య సేవ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో ' సాగర మథనం ' తొలి కవితా సంపుటితో సాహిత్య రంగ ప్రవేశం చేసి పలువురి ప్రశంసలు పొందినారు . మలి కవితా సంపుటి ' సముద్ర ఘోష' 2005 లో ప్రచురించి సాహిత్య రంగంలో తమ కంటూ ఒక ప్రత్యేకతను సాధించారు. ఇదిగో , ఇప్పుడు తమ మూడవ కవిత కవితా సంకలనాన్ని ' మట్టి వేదం ' పేరిట పాఠక లోకానికి పరిచయం చేస్తున్నారు. 

ఇందులో దాదాపు 40 కవితలు సామాజిక బాధ్యతతో రాసినవే !

వ్యవసాయ రంగంలో రైతుల కన్నీటి వ్యధల్ని గమనించిన భానుమూర్తి గారు తమ 'మట్టివేదం ' కవితలో 

''మడిలో కదం తొక్కుతూ

మట్టిని తొక్కిన పాదం 

వరి పంటకు దుక్కి పెడుతూ 

బురద పూలు పూచిన పాదం 

ఆ మట్టి రైతన్న పాదాలకు 

అభివాదం చేస్తూ 

రాస్తున్న మట్టి గేయ నాది '' 

అంటూ రైతన్నల మీద తనకున్న ప్రేమను , అభిమానాన్ని , గౌరవాన్ని తెలపడం అభినందనీయం . అలాగే 

'' నా మట్టి వేదాన్ని అంకిత మివ్వడానికి

సాదా సీదా మనుషుల కోసం నేను వెతకడం లేదు 

మట్టినే విభూదిలా పూసుకొనే మట్టి శివుళ్ళను వెతుకుతున్నా 

మట్టికోసం తపస్సు చేసే మట్టి మునుల్ని వెతుకుతున్నా 

మట్టిని నమ్ముకొని మట్టిలో బంగారాన్ని 

పండించే మట్టి రైతన్నల కోసం వెతుకుతున్నా !'' 

అంటూ కవితను ముగించడం చాలా బాగుంది . అంటే మట్టినే నమ్ముకొని , మట్టి కోసం పరితపించి , ఆ మట్టి లోనే బంగారు పంటల్ని పండించే రైతుల కోసం తానూ గాలిస్తున్నానని చెప్పడంలో రైతాంగం పట్ల ఆయనకున్న ఆసక్తి కనబడుతోంది. 

ఎంతటి కవి అయినా తాను బాల్యంలో తిరుగాడిన పల్లె వాతావరణాన్ని , తీపి గుర్తుల్ని , అక్కడి ఆత్మీయతల్ని మరువ లేడు .అలాంటి అనుభవాల్నే భానుమూర్తి గారు ' నా పల్లె ప్రపంచం ' కవితలో తెలుపుతూ 

'' గడ్డి పువ్వునై మంచు బిందువుల్ని పలక రించాలని వుంది

గన్నేరు పువ్వునై గాలికి వూగాలని ఉంది ''

అంటూ ఎంతో అందంగా చెపుతూ ఈ కాంక్రీటు నగరాల్లో 

'' సాయంత్రం చెట్టు మీద చేరే కాకుల శబ్ధం

ఇళ్లకు చేరే పశువులు చేసే కోలాహలం 

గోవులు రేపే గోధూళి వాసన ఇక ఎవరిస్తారు ? '' 

అని వాపోతారు. అంతటి అందమైన పల్లె ప్రపంచానికి దూరమై నగరాల్లో మర మనుషులుగా బతుకుతున్న మానవ జీవితాన్ని ప్రతిబింబించే అంశాలతో ఈ కవిత చక్కగా సాగింది. 

నేటి వ్యవస్థలో పెచ్చి పెరిగి పోయిన హింస , దిక్కు తెలియని కుటుంబ వ్యవస్థ , అనాధల , అభాగ్యుల కన్నీటి కథలకు అద్ధం పెట్టే కవితగా ' విషం కురిసిన రాత్రి ' ముగింపులో

'' అస్తవ్యస్తమైన వ్యవస్థ బాగుపడే వరకు

ప్రతి రాత్రి విషం కురుస్తూనే ఉంటుంది '' 

అని తన అసహాయతను , ఆవేదనను వ్యక్తం చేశారు . 

' నాన్న' అనే కవితలో

'' నాన్నల త్యాగాలు వృధా కావు

చిన్న మొక్కలై , వృక్షాలై ఫలాల్ని అందిస్తాయి '' అనడం చాలా బాగుంది. 

కన్న పేగు బంధం దూరమై , ఆ తల్లి తండ్రులు అనుభవించే వ్యధా భరిత కథల్ని మనం నిత్యం చూస్తూనే ఉంటాము. వృద్ధులైన తల్లి తండ్రులు కన్న బిడ్డల కోసం అహర్నిశలు కలవరించడం లాంటి దృశ్యాలు మన సమాజంలో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి సంఘటనకు సంబంధించి బిడ్డకు దూరమైన ఒక కన్నతల్లి పడే ఆవేదనని ' బిడ్డా నిన్ను సూసి ' అనే కవితలో 

'' ఎక్కడున్నా నీవు - సల్లగుంటే సాలు

కొలువు లోన నువ్వు - మంచి గుంటే మే

లు 

ఒక్క సారి వచ్చి - పలకరించు కొడుకో 

బిడ్డా నిన్ను సూసి - పాన మొదులు తాను '' 

అనడంతో కళ్ళు చెమరిస్తాయి . వాస్తవాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి .

తల్లిని స్మరించకుండా ఏ కవీ తన కవితా సంపుటిని పూర్తి చేయలేడన్నది నగ్న సత్యం . ప్రతి కవీ తన తల్లితో అనురాగ అనుబంధాల్ని , ప్రేమ బంధాల్ని దూరం చేసుకొని ఉండలేడు . అలాంటి పరిస్థితుల్లోనే కవిగారు తన ' అమ్మా నన్ను క్షమిస్తావా ? అనే కవితలో 

'' నా కోసం ఉపవాసాలు చేశావు

నా కోసం జాగరణలు చేశావు 

గానీ నీకోసం మేము ఏమీ చేయలేదని చింతిస్తున్నా ! '' 

అంటూ 

''ఇంకొక జన్మ అంటూ ఉంటే

నువ్వు నా కూతురిగా పుట్టు తల్లీ 

నీ ఋణం నేను తీర్చుకొంటానమ్మా !'' 

అని చెప్పడం ఎంతో హృద్యంగా ఉంది .


'' రండి మేధావుల్లారా

అందరం కలిసి కొత్త దేశాన్ని నిర్మిద్దాం 

మట్టి వాసన మనుషుల్లో నింపడానికి '' 

అంటూ ' మేధావుల్లారా ' అనే కవితలో పిలుపు నివ్వడం బాగుంది .

ఈ కవితలో అస్తవ్యస్తమైన దేశ పరిస్థితుల్ని కవిత్వికరించడం సుగమంగా సాగింది . బ్రష్టు పట్టిపోతున్న దేశంలో కుళ్ళన వ్యవస్థను మార్చలేమని వ్యధ చెందడంలో భానుమూర్తి గారు సఫలీకృతులయ్యారు. అలాగే 'మిత్రమా ' , నేను రోజూ ఏడుస్తున్నాను ' , ' పోనీ పొతే పోనీ ' , ' అసలు నువ్వెవరు ' , ' మా గుడిసె ' , ' పుష్పించిన మనిషి ' లాంటి కవితలు ఆకట్టు కొంటాయి. 

సమాజాన్ని నిశితంగా పరిశీలించిన భానుమూర్తి గారు , సమాజం లోని పలు అంశాలను కవితా వస్తువులుగా తీసుకొని కవిత్వికరించడానికి తన శాయశక్తులా కృషి చేశారు.

ఒక కవి సాధన క్రమంలో వస్తువు - లోలోతుల్లోకి పోయి అంతర్గత నివృత్తిలో నీటి పిట్టలా పైకి తేలుతాడు . కవి అనుభవించిన దంతా మనం అనుభవించలేక పోవచ్చు . కానీ మనదయిన నిర్మాణం జరగ డానికి , ఆ కవి - ఆ కవిత ఉపయోగ పడతాయి . ఒక వస్తువు మీద కవిత ఎత్తుకంటే ఆ వస్తువు విశ్లేషణ ఒక conclusion కి drive చేసే దిశగా సాగుతుంది . 

సమాజం పట్ల , కవిత్వం పట్ల ఏంతో ఆసక్తి , శ్రద్ధ కనబరుస్తున్న భానుమూర్తి గారు జీవితానికున్న అన్ని కోణాలను అధ్యయనం చెయ్యడంలో మరింత ముందడుగు వేస్తూ , కవితా నిర్మాణంలోని మెళుకువలను , ఎత్తుగడలను , శిల్పం , అభివ్యక్తి లాంటి విషయాల పట్ల సంపూర్ణమైన పరిశీలనలను చేస్తూ మరిన్ని ఉత్తమ కవితలతో ఈ సాహిత్య రంగంలో ముందడుగు వేస్తారని ఆశిస్తూ , అద్భుతమైన ' మట్టి వేదం ' శీర్షికతో వెలుగు లోకి తెచ్చిన భానుమూర్తి గారికి హృదయ పూర్వక అభినందనలు తెలుపు తున్నాను. 


తేదీ : 15 .06 . 2018 
కెరె జగదీష్

కవి , సీనియర్ జర్నలిస్టు

రాయదుర్గం 

అనంతపురం జిల్లా , ఆ .ప్ర 

9440708133