Sunday, December 2, 2018

అపరాధివి !

అపరాధివి ! 
---------------------------------------
ఒక్క నవ్వుకు నువ్వు 
బలయి పోతావని నీకు తెలియదు
ఆమె లిప్ స్టిక్ మాటున దాగిన
కృ త్తిమ అందాల అధరాలు అందించే 
మధువును జుర్రుకోవాలనే నీ ఆరాటం
ఒక్క పున్నమి రాత్రి నీ బ్రతుకును 
అమావాస్య చేస్తుందని నీకు తెలీదు
కట్టుబాట్లు మరచి
అప్రకృత లైంగిక వాంఛతో 
నీ  శరీరం  కామ ప్రకోపాల్ని కంపించింది
ఈ జన్మకి దొరికిన ఈ సుఖం 
నిన్ను  కట్టు బానిసను చేసింది
కండోము లేని  నీ శృంగారం
తన కున్న జబ్బును కూడగట్టుకొనింది
ఎయిడ్స్ మహమ్మారి 
నీ తనువులోని అణువణువును 
విచ్చన్నం చేసిందని నీకు తెలియదు
జబ్బుల మయ మైన నీ 
అందమైన శరీరం నిన్ను కురూపిని చేసింది
క్షణికావేశం నిన్ను 
చావు అంచులకు నెట్టి వేసింది
ఈ జన్మ కు నువ్వు  చేసుకొన్న పాపం
నీ వారిని నట్టేట ముంచింది
శారీరక సుఖం  కోసం 
అనైతక  సంబంధాలు వెతికావు
ఫలితం అనుభవిస్తున్నావు
కామానికి ..కాలానికి
ఖాళీ అయి పోయిన నువ్వు 
చావు మేళాన్ని విన వలసి వస్తోంది
నేను నిన్ను ' శత మానం భవతి '  అని
ఆశీర్వ దించినా  అది నిరర్థకం
ఎందుకంటే నువ్వు
స్వయంకృతాపరాధివి! 
నీ విచ్చల విడి కామ కేళీ 
నిన్ను క్షమించదు!
___________________________
వారణాసి భానుమూర్తి రావు
01. 12. 2018
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్బంగా రాసిన కవిత

No comments:

Post a Comment