వారణాసి వంశ చరిత్ర
రాసిన వారు : వారణాసి కృష్ణ మూర్తి రావు
-------------------------------------------------------------------------------------------------------
మా తాతగారు వారణాసి వెంకట్రామయ్య గారు చిత్తూరు జిల్లా లోని కల్లూరు, నడిగడ్డ ప్రాంతాల్లో నివసించి, తరువాత తిమ్మాపురం గ్రామకరణం ( మునీపు దారు ) గా ఉన్నారు.
ఆర్ధిక పరిస్థితుల వలన తిమ్మాపురం గాండ్ల పల్లిలో నివాసం చేసి ఆ తరువాత ఉన్న తావు మార్పు చేసుకొన్నారు.
నడి గడ్డ లో పెద్ది రెడ్డి , రఘు నాథ రెడ్డి గారు గుమాస్తాగా పని చేసి ఉన్నారు. వారి కుటుంబ , వ్యాపార ఆర్థిక లావా దేవీలు లెక్కలు రాయడం మా తాతగారి ఉద్యోగం.
వారు ఆర్థికంగా బాగా ఉండిన వారని మా పెద్దలు చెప్పగా విన్నాను. వారు గూడా కుటుంబ పరిస్థితులతో కొంచెం బాధ పడినట్లుగా విన్నాను.
వారికి ఇద్దరు భార్యలు . (1) లక్షమ్మ (2)శేషమ్మ . వారి సంతానమే ఇప్పుడున్న తరం జరుగుతున్నది.
మా తాత గారు మంచి గణిత శాస్త్ర వేత్త , మంచి మర్యాదస్తుడు, గౌరవ స్థుడు అనియు మన బంధువులు అంటూ ఉండినారు. 1930 లో ఆయన మరణించి నట్లు తెలుస్తున్నది .
మా తండ్రి గారయినా శ్రీ వారణాసి నరసింగ రావు గారు , తిమ్మాపురం కరణంగా , 19 వ ఏట వచ్చి నట్లు ఉన్నది. వారి కుటుంబ వివరములు పక్క పేజీ లో ఉన్నది. 1945 లో మా తండ్రి గారు మరణించి నారు.
మా అన్న గారు వారణాసి లక్ష్మి కాంత రావు పై అన్ని భాధ్యతలు పడినవి. వారి కుటుంబము, నా విద్యాభ్యాసము, మా చెల్లెలి వివాహము వారి మీద పడినవి. వారు బహు సంతాన పరులు. ఉద్యోగం ఉపాధ్యా య వృత్తి , బ్రాంచి పోస్టు మాస్టర్ గా తిమ్మాపురం లో చేసినారు. జీతాలు బహు స్వల్పం అయినా భుక్తికి లోటు లేకుండా ఉండినది. వారు ఎక్కువ కాలం అనారోగ్యముతో జీవించి నారు. కానీ బహు తెలివైన వారు . లోకికము బాగా తెలిసిన వాడు. మంచి రూప వంతులు గానే కనపడు చుండిరి. వారు డిశంబర్ 1969 లో స్వర్గస్తులైనారు. వారి ఆత్మకు శాంతి భగవంతుడు ప్రసాదించు గాక !
వారి సంతానము ఇప్పుడు ఉద్యోగ రీత్యా అక్కడక్కడా నివసించు చున్నారు . అందరూ ఆర్థిక లోటుపాట్లు లేకుండా శ్రీ రాఘవేంద్రుని ఆశీస్సులతో జీవం యాత్ర సలుపు కొను చున్నారు .
రాచ పల్లె లో మా మామ గారు శ్రీ గోవర్ధనం శేషగిరి రావు కారణం పని చేయుచు (1894-1972 )1972 లో పరమ పదిం చి నారు.
వారు కూడా గౌరవ నీయులు , పూజ్య భావము గల వారు , బంధు ప్రీతి గల వారు. వారితో ఇద్దరు అక్క చెల్లెండ్రు ఉండి నారు. 1) శేషమ్మ 2) సుందరమ్మ అను అక్క చె ల్లెండ్రు ఉంది నారు.. వారితో పాటు బావమరిది , మేనల్లుడు ( శేషమ్మ కుమారుడు ) తనతోటే పాటే ఉంచు కొన్నారు. వారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించు గాత !
వారణాసి కృష్ణమూర్తి రావు అను నేను 10-10-1928 నాడు శ్రీ నరసింగ రావు కనిష్ట కుమారుడు గా విభవ నామ సంవత్సరంలో పుట్టినట్లు తెలియు చున్నది .
చిన్న నాడే అనగా 2 సంవత్సరముల వయసులోనే మా చేల్లెల్ని ప్రసవించిన నాడే మా మాతృ మూర్తి దివంగతు రాలయినట్లు తెలియు చున్నది .
మా తల్లి గారు చాలా నిబ్బర మైనది అనియు , భర్త కు విధేయు రాలిగా వారి ఆజ్ఞను పాటించు నటువంటి ఉత్తమ ఇల్లాలు అని మా పెద్దలు చెప్పుచుండగా విన్నాను.
మాతృ హీను లైన మమ్మల్ను మా మేన మామ గారు కందూరిలో మా తల్లి తల్లి గారి , మా మేన గారి పోషణలో పెరిగి నట్లు తెలియు చున్నది.
మా సెల్లెలు సుమారు 10 సంవత్సరముల వయసు వచ్చు వరకు కందూరి లోనే పెరిగినది. . ఆమెకు మా అన్న గారు 1945 లో వివాహా ప్రయత్నం చేసి గొల్ల పల్లి లో ఉన్న శ్రీ రెడ్డి నారాయణ రావు గారికి ఇచ్చి వివాహం జరిపించి నారు.
వారు గూడా ఆర్థికంగా బాగా ఉన్న వారే . భూస్వాములు. కాలం బాగుగానే జరిగినది.
నా ప్రాధమిక విద్యా భ్యాసము నంజంపేటలో 1, 2, 3 తరగతులు మా అవ్వగారు కృష్ణమ్మ గారి కుమారుల ఇంటిలో చదివి నాను . నా తదుపరి విద్యాభ్యాసము రాచ పల్లి, కలికిరి, పి టి ఎం , చిత్తూరు లో జరిగినది. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. తర్వాత నేను 1946 లో ఉపాధ్యాయ వృత్తి శిక్షణ ను పూర్తీ చేసు కొని ఉద్యోగములో 1946 లో చే రినాను. జీతం సుమారు 40 /50 రూపాయల మధ్య వచ్చు చుండెడిది .
నా వివాహము 1951 లో జూన్ నెలలో శ్రీ గోవర్ధనం శేషగిరి రావు గారి ఏకైక కుమార్తె స్వర్ణాంబతో రాచ పల్లెలో కడు వైభవముగా అందరి బంధువులతో వేడుకగా జరిగినది.
1946 లో తలుపుల లో మొట్ట మొదటిగా ఉద్యోగం చేసినాను . పల్లవోలు , నెరబైలు , మహల్, మేడికుర్తి, కలకడ , గుండ్లూరు , వాయల్పాడు సుమారు 41 సంవత్సరములు ఉద్యోగము చేసినాను . జీతము తక్కువే అయిననూ , జీవితము హాయిగానే గడచినది.
28. 11. 1952 నాడు మాకు ప్రధమ పుత్రికా జననము అయినది. ఆమె మంచి రూప వంతు రాలు. బహు ముఖ ప్రజ్ఞా శాలి. 5 సంవత్సరములు జీవించిన తరువాత ఆమె అకాల మరణము పొందినది. ఆమె అమర లోకమునకు వెళ్ళినది. ఆమె ఆత్మ కు శాంతి ఆ భగవంతుడు చేకూర్చు గాత !
రెండవ సంతానము ఆడ శిశువే , పుట్టిన వెంటనే మరణించినది.
తరువాత నలుగురు కుమారులు, ఒక పుత్రిక జన్మిచారు. నలుగురి కుమారులకు వివాహము జరిగినది. చాలా చిన్న వయస్సులోనే వారికి వివాహములు జరిగినవి.
1978 లో భానుమూర్తి , నాగభూషణ రావు ఉద్యోగ అన్వేషణకు హైదరాబాదుకు వచ్చినారు.
1980 లో జనార్ధన , మధుసూదన చదువుల నిమిత్తము హైదరాబాదుకు వచ్చి
నారు. భగవంతుని దయ వలన అందరు చిన్నతనములో కష్టములు పడిన వారయినప్పటికీ , విద్యాభ్యాసములు పూర్తీ చేసి , ఉద్యోగములలో చేరి, వివాహములు చేసుకొని , సంతాన వంతులై
వారి వారి కుటుంబములతో హాయిగా జీవన యాత్ర సాగించు చున్నారు. వారి తల్లితండ్రులు వారి ఉన్నత స్థితికై , ఆహర్నిశలూ భగవంతుని ప్రార్థనలు చేయు చున్నారు .
వారికి వివాహములు జరుపు కొన్నటు వంటి వారి తల్లి తండ్రులు , మా కోడండ్లు అందరు మంచి కుటుంబము , గౌరవములు కల వారు. వారి వలన మాకు గాని, మా వలన వారికి గాని , ఎటువంటి పోర పొచ్చాలు లేవు. చాలా అన్యోన్యముగా ఇచ్చి తీసు కొన్న వారు మేము మెలుగు చున్నాము.
భగవంతుని దయ వలన మంచి కుటంబముల నుండి మా కుమారులకు వివాహములు జరిగినవి. అందరు హైదరాబాదులో ఉన్నారు.
మా కుమార్తెకు గూడా మా బాంధవ్యములో , మాకు కలిసిన రక్త సంబంధీకుల లోనే శ్రీ రాఘవేంద్రుని దయ వలన వివాహము జరిగినది.
నేను 1988 లో పదవీ విరమణ గావించి నాను . అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య భాధలు లేకుండా , ఈతి భాధలు లేకుండాశ్రీ రాఘవేంద్రుని దయ వలన ఆయురారోగ్య వంతులుగా ఉన్నాము.
మా చిన్న కుటుంబము ఆర్థిక వసతి, భూవసతి లేని కుటుంబమును శ్రీ వెంకటేశ్వర స్వామి , శ్రీ రాఘ వేంద్ర స్వామీ వారి దయ వలన ఒక సామాన్య జీవన యాత్ర సాగించు చున్నందు వలన భగవంతునికి సాష్టాంగ ప్రమాణములు ఆచరించి చిర కాలము మా సంసారములు, మా వంశీ కులు ఆయురారోగ్యములతో, భోగ భాగ్యములతో వర్ధిల్ల వలెనని భగవంతుని శ్రీ రాఘవేంద్ర స్వాముల వారిని ప్రార్తించుచూ ఈ చిన్న జీవిత చరిత్రను ముగించు చున్నాను.
ఓం శాంతి , ఓం శాంతి , ఓం శాంతి
ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః
వి . కృష్ణమూర్తి రావు
రిటైర్డు టీచర్
మహల్ రాజు పల్లి
చిత్తూరు జిల్లా
01.06. 1993
ప్రవర
''అంగీరస , ఆయాశ్చ , గార్గేయస త్రయ్యాఋషేయ ప్రవరాన్విత గార్గేయస గోత్రోదభవస్య , ఋక్ శాఖాధ్యాయై , అశ్వరాయన సూత్రహ , కృష్ణ మూర్తి రావు శర్మన్ అహంభో అభివాదయేత్ ''
సంధ్యా వందన కాలములో చెప్పవలెను. నోటికి నేర్చు కొంటే ప్రవర అడిగిన వారికి చెప్పవచ్చును .
వంశవృక్షము
గార్గేయస గోత్రము , ఋగ్వేదము
ఆరువేల నియోగులు
( రాసిన వారు .. వారణాసి కృష్ణ మూర్తి రావు .. రాసిన తేదీ : 31.05 . 1993)
వారణాసి నరసయ్య గారు(1770- 1830)
|
వారణాసి వెంకట్రామయ్య గారు(1800-1860)
|
వారణాసి రామయ్య గారు(1830-1900)
-- వారణాసి కృష్ణయ్య గారు (తమ్ముడు) ( కురబల కోట)
|
వెం కట్రామయ్య గారు (1846-1930)
|
లక్షమ్మ (మొదటి భార్య)
శేషమ్మ (రెండవ భార్య)( 1890-1962)
/
నరసింగ రావు ( 1876-1945) ( లక్షమ్మ కొడుకు )
రామచంద్ర రావు ( 1918-1994) , రామ లక్షమ్మ , పద్మావతమ్మ , రాజమ్మ ( శేషమ్మ కు పుట్టిన సంతానం )
/ / / /
పెళ్లి కాలేదు తెలియదు 8 మంది స్వర్ణాంబ ( తండ్రి గోవర్దనం శేషగిరి రావు )
నరసింగ రావు +జక్కరాజు లక్షమ్మ
/
లక్ష్మి కాంత రావు( 1919-1969)+కావేరమ్మ ,రాధాపతి రావు( 1944) కృష్ణమూర్తి రావు( 1928)+స్వర్ణాంబ ( 1935) లక్షమ్మ(1931-2014)
+రెడ్డి ( expired) నారాయణ రావు
/ / / /
శ్రీధర్ రావు భానుమూర్తి రావు పెద్ద మల్లీశ్వరి
పంకజమ్మ నాగభూషణ రావు చిన్న మల్లిశ్వరి
నరసింగ రావు జనార్ధన రావు మల్లికార్జున రావు
రాజారావు మధుసూదన రావు శివ శంకర్ రావు
మురళి నాథ రావు పద్మజా రాణి శ్రీని వాస రావు
సుదర్శన రావు
ఉమా మహేశ్వర రావు
భుజింగ రావు
అరవింద రావు
వారణాసి కృష్ణమూర్తి రావు + స్వర్ణాంబ వారి కుటంబము
----------------------------------------------------------------------
1. భానుమూర్తి రావు + కనక లత రావు = కార్తీక్ , నందిని
2. నాగభూషణ రావు + రాజ్య లక్ష్మి = శ్వేత , స్వాతి
3. వెంకట జనార్ధన రావు + విజయ లక్ష్మి = అనీష్ . అఖిల్
4. మధు సూదన రావు+ నిర్మల = శ్రీకర్
5. పద్మజ రాణి+ జక్కరాజు నాగేంద్ర = ప్రణీత్ , మృదుల
1. కార్తీక్ + శైలజ = అనన్య ( 2013 ) , అన్విత ( 2015 )
2. నందిని + వినయ్ = ఆద్య ( 2015),
1. శ్వేత+ రామచంద్ర రావు = సమన్వి ( 2013) , ప్రశస్తి (2016)
2. స్వాతి + సందీప్ = సాయి మనస్వి (2018)
No comments:
Post a Comment