సభ్యత్వం
------------------------------------------
అయిన వాళ్ళ కోసం వెతకాలనిపిస్తోంది
అందరూ కాని వాళ్ళే కనిపిస్తున్నారు
మనసు విప్పి మాట్లాడాలనిపిస్తోంది
గుప్పెట్లో బందించి మరీ గుండెల్ని తీసుకెళ్ళుతున్నారు
అక్కడ కొన్ని వాదాల్ని తక్కెడలల్లో పెట్టి అమ్ముతున్నారు
అవి ఎందుకు అమ్ముతున్నారో నా కర్థం కావడం లేదు
అక్కడ వ్యాపారస్థులు కొన్నింటిని కల్తీ చేసి అమ్ముతున్నారు
నిజాన్ని అబద్ధంతో
న్యాయాన్ని అన్యాయంతో
ధర్మాన్ని అధర్మంతో
అంతే గాదు ... అక్కడ
మనుషులు మనుషులు తో పోటీ పడి
మనసుల్ని అమ్మకాలకు పెట్టారు
******
మనుషుల్లో పరివర్తన గురించి ఆలోచించాలి
పరివర్తన లో ప్రవర్తన గురించి పరికించాలి
వృత్తి ఏదయినా ప్రవృత్తి బాగుండాలి
ప్రతి మనిషి ఒక చరిత్ర కావాలి
ఆ చరిత్రలొ ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించాలి
******
అందుకే
మనం తొందరగా నూతన సమాజాన్ని సృష్టించు కోవాలి
రండి .. సభ్యత్వం కోసం క్రొత్త మనుషులను తీసుకొందాం !
22. 02. 2015
వారణాసి భానుమూర్తి రావు

No comments:
Post a Comment