మమ్మల్ని సూసి నవ్వకండి సారూ !!
--------------------------------------------
జీవితం రొచ్చు
బ్రతుకు రొచ్చు
మనుషులు రొచ్చు
పశువులు రొచ్చు
అంతా రొచ్చే !
జలగలు , దోమలు , ఈగలు
పందులు , కుక్కలు ,పిల్లులు , పిల్లలు
నాలా పక్కనే గుడిసెలు
విరిగిన నులక మంచాలు
బొమికలు మిగిలిన జీవశ్చవాలు
ఊపిరి ఉంది బతకాలి
బతకడం అనేది పెద్ద సమస్య
కుడితి నీళ్ళయినా సరే ... తాగి బతకాలె
ఎంగిలి మెతుకులైనా సరే ... తిని బతకాలె
మురుగు నీటి తోనైనా సరే ... వొళ్ళు కడగాలె
మల మూత్రాదులున్నా సరే ... అక్కడే తొంగుండాలె
బురద గుంటలైనా సరే ... మా పిల్లోల్లు ఆడుకోవాలె
బొంతలు కింద పరసుకొని
రాళ్ళ దిండు మీద తల ఆంచాల
చిల్లులు పడిన కంబళ్ళు కప్పుకొవాలె
ఆకలి భూతం నిద్రను మింగేస్తే
అడుక్కోవడానికి అర్థరాత్రి తిరగాలె
'దేహీ ' అని పైస లడిగితే 'దున్నపొతు' అని
సిదరించు కొనే వాళ్ళే ఎక్కువ
మా బోటోళ్ళను జూసి బాధ పడకండి సారూ !
దమ్మం సెయ్యక పోతే మానె
మమ్మల్ని సూసి నవ్వకండి సారూ !!
భాను వారణాసి
02. 03 . 2015
--------------------------------------------
జీవితం రొచ్చు
బ్రతుకు రొచ్చు
మనుషులు రొచ్చు
పశువులు రొచ్చు
అంతా రొచ్చే !
జలగలు , దోమలు , ఈగలు
పందులు , కుక్కలు ,పిల్లులు , పిల్లలు
నాలా పక్కనే గుడిసెలు
విరిగిన నులక మంచాలు
బొమికలు మిగిలిన జీవశ్చవాలు
ఊపిరి ఉంది బతకాలి
బతకడం అనేది పెద్ద సమస్య
కుడితి నీళ్ళయినా సరే ... తాగి బతకాలె
ఎంగిలి మెతుకులైనా సరే ... తిని బతకాలె
మురుగు నీటి తోనైనా సరే ... వొళ్ళు కడగాలె
మల మూత్రాదులున్నా సరే ... అక్కడే తొంగుండాలె
బురద గుంటలైనా సరే ... మా పిల్లోల్లు ఆడుకోవాలె
బొంతలు కింద పరసుకొని
రాళ్ళ దిండు మీద తల ఆంచాల
చిల్లులు పడిన కంబళ్ళు కప్పుకొవాలె
ఆకలి భూతం నిద్రను మింగేస్తే
అడుక్కోవడానికి అర్థరాత్రి తిరగాలె
'దేహీ ' అని పైస లడిగితే 'దున్నపొతు' అని
సిదరించు కొనే వాళ్ళే ఎక్కువ
మా బోటోళ్ళను జూసి బాధ పడకండి సారూ !
దమ్మం సెయ్యక పోతే మానె
మమ్మల్ని సూసి నవ్వకండి సారూ !!
భాను వారణాసి
02. 03 . 2015
No comments:
Post a Comment