ఎంత కష్టం ? ఎంత కష్టం ??
----------------------------------------------
దారి దాపున చెత్త కుప్పల
చిత్తు చిరుగుల నేరు కుంటూ
చిట్టి కొడుకును చంక మోసి
అలిసి పోయే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
చిరిగిపొయి మాసిపోయిన
చీరకొంగును బొడ్డు దోపి
పాలు గారే చిట్టి బిడ్డను
బొంత మీద పండ బెట్టి
మట్టి రాళ్ళను మోసుకెళ్ళే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
నెత్తి మీదను మోపు బెట్టి
కాలి నడకను ఊర్లు తిరిగి
చంక జొలెన బిడ్డ నొదలక
కడుపు కూటికి చీపుర్లనమ్మే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
పందులున్నా కుక్కలున్నా
దోమలున్నా ఈగలున్నా
పలుగు పరకతో రొచ్చు తీసి
పాయి ఖానాలను శుభ్రం చేసే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
మంచు లోనా ,ఎండ లోనా
రాత్రి అయినా , పగలు అయినా
పిల్ల పాపల నొదలి పెనిమిటిని వదలి
చీపురెట్టి నగర రోడ్లను శుభ్రం చేసే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
భూమి తల్లిని నమ్ము కోని
ఎండ గాని వాన గానీ
దుక్కి దున్ని నాట్లు వేసి
కలుపు తీసి కండె జూసి పంట కోసి
ఎండ బెట్టి ఎండి బొయ్యే రైతు తల్లికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
పచ్చ రవిక తొడిగి తెల్ల చీర కట్టి
మల్లెపూలు సిగన ముడిచి ముస్తాబు చేసి
పసి వాడని పసిడి తల్లిని మాతమ్మను చేసి
ఆచారం పేరిట అంగడి బొమ్మయిన ఆ చిన్న తల్లికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
ఆడపిల్ల కెవ్వు మంటే వడ్ల గింజను నోట దోసి
పురిటి పసికందు ప్రాణాలు తీసే తల్లిదండ్రుల దాష్టికానికి
బలి అయిన అన్నెం పున్నెం ఎరుగని ఆడ పిల్ల కు
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
05. 01. 2005
భాను వారణాసి
----------------------------------------------
దారి దాపున చెత్త కుప్పల
చిత్తు చిరుగుల నేరు కుంటూ
చిట్టి కొడుకును చంక మోసి
అలిసి పోయే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
చిరిగిపొయి మాసిపోయిన
చీరకొంగును బొడ్డు దోపి
పాలు గారే చిట్టి బిడ్డను
బొంత మీద పండ బెట్టి
మట్టి రాళ్ళను మోసుకెళ్ళే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
నెత్తి మీదను మోపు బెట్టి
కాలి నడకను ఊర్లు తిరిగి
చంక జొలెన బిడ్డ నొదలక
కడుపు కూటికి చీపుర్లనమ్మే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
పందులున్నా కుక్కలున్నా
దోమలున్నా ఈగలున్నా
పలుగు పరకతో రొచ్చు తీసి
పాయి ఖానాలను శుభ్రం చేసే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
మంచు లోనా ,ఎండ లోనా
రాత్రి అయినా , పగలు అయినా
పిల్ల పాపల నొదలి పెనిమిటిని వదలి
చీపురెట్టి నగర రోడ్లను శుభ్రం చేసే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
భూమి తల్లిని నమ్ము కోని
ఎండ గాని వాన గానీ
దుక్కి దున్ని నాట్లు వేసి
కలుపు తీసి కండె జూసి పంట కోసి
ఎండ బెట్టి ఎండి బొయ్యే రైతు తల్లికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
పచ్చ రవిక తొడిగి తెల్ల చీర కట్టి
మల్లెపూలు సిగన ముడిచి ముస్తాబు చేసి
పసి వాడని పసిడి తల్లిని మాతమ్మను చేసి
ఆచారం పేరిట అంగడి బొమ్మయిన ఆ చిన్న తల్లికి
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
ఆడపిల్ల కెవ్వు మంటే వడ్ల గింజను నోట దోసి
పురిటి పసికందు ప్రాణాలు తీసే తల్లిదండ్రుల దాష్టికానికి
బలి అయిన అన్నెం పున్నెం ఎరుగని ఆడ పిల్ల కు
ఎంత కష్టం ? ఎంత కష్టం ??
05. 01. 2005
భాను వారణాసి
No comments:
Post a Comment