నేనేమౌతానో నీకు తెలుసా ??
--------------------------------------------------------
నేను వినా నీ కోసం పరితపించేది ఎవ్వరు ?
నేను వినా నీ కోసం రెండు కన్నీటి బొట్లను రాల్చేది ఎవ్వరు ?
ఎలా ఏ భాషలో చెప్పాలో నీకు ?
నా ప్రేమలో స్వచ్చత లేదన్నావు నువ్వు
నా దేహాన్ని కాలిస్తే నీకు బూడిద మిగులుతుందేమో గానీ
నా హృదయాన్ని కాల్చి చూడు
ఆశ్చర్య పోతావు నువ్వు
అక్కడ దాగిఉన్న స్వర్ణ పేటికలో
నీ ప్రతి బింబం కన బడుతుంది
ఇంకా ఏ విధంగా నా ప్రేమను నీకు
బహిర్గతం చెయ్యాలో తెలియటం లేదు నాకు
ఆకాశం చూసావు గదా
అంత నిర్మల మైనది నా ప్రేమ !
సముద్రాన్ని చూసావు గదా
అంత లోతైనది నా ప్రేమ !
మట్టిని చూసావు గదా
అంత సహనం గలది నా ప్రేమ 1
జాబిల్లి ని చూసావు గదా
వెన్నల లాంటిది నా ప్రేమ !
అదో ఆ చిలిపి నవ్వే వద్దన్నాను
అదో ఆ ఓర చూపులే కాదన్నాను
అవి రెండు నన్ను దహించి వేస్తాయి
నువ్వు నా సహనాన్ని గాని
ప్రేమను గాని పరిక్షించాలనుకోకు
సలీం లాగానో , మజ్ను లాగానో
దేవదాసు లాగానో
ప్రేమ నగర్ , ప్రేమాభిషేకం లో ఏ ఎన్ అర్ లాగానో
నేనేమి విషం మింగను ,నేను అసలు చావను
అదో అదే నవ్వు వద్దంటున్నాను
అలా నీ అధరాన్ని ముని పంటితో నొక్క వద్దన్నా
నువ్వు ఇలానే కబుర్లు చెప్పి
నాకు దూరమయ్యా వనుకో
నేనేమౌతానో తెలు సా ?
వచ్చే జన్మలో నీకు ప్రేయసి గా పుట్టి
నిన్ను ఇలాగే ఏడిపిస్తా !!
భాను వారణాసి
24. 01 . 2015
( యౌవన దశలో కొంత మంది ప్రేమికులు ప్రేమించు కొంటారు . ఎందుకో కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఒకటి గాలేరు . ఇది ప్రతి ఒకరికి అనుభవమే . మనం కాలేజి చదివే రొజుల్లో అలా మనల్ని మురిపించి మాయ మయిన వాళ్ళెంతో మంది . అలాంటి భగ్న ప్రేమికులకు ఈ కవిత అంకితం )
No comments:
Post a Comment