నేను గుంపులో ఒక్కడ్ని !
( సిరీస్ 2)
---------------------------------------------
5
ఉపన్యాసాలతో ఊర్ల మీద పడి
చెప్పేదొకటి చేసే దోకటయి
నటిస్తూ ... నటనలో ఏడుస్తూ ...
పేదల నోట్లో మన్ను పోస్తూ
అధికారాన్ని అడ్డం పెట్టుకొని
దందాలు చేస్తూ , కమీషన్లు కుమ్మేస్తూ
అధికార దుర్వినియోగంతో
తస్మదీయులకు కాంట్రాక్టు పనులప్పగిస్తూ
కోట్లు కోట్లు దండుకొంటున్న
రాజకీయ నాయకులను చూసి
సిగ్గుతో తలవంచుకొని
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో ఉన్న కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి చేద్దామని అనుకొన్నా
నా మటుకు నేను ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడ్ని !
6
నా ఇల్లు బాగా ఉంటే చాలని
పక్కింటి వాళ్ళ ఇంట్లో చెత్త బోస్తూ
రోడ్లు , బస్సు స్టాండ్లు , ఆసుపత్రులు
బడులు , గుడులు , పార్కులు
ఒకటేమిటి సమస్త ధరిత్రి నంతా
నానా గలీజు చేస్తూ
ఎక్కడ బడితే అక్కడ ఉచ్చలు పోస్తూ
గోడల మీద ఉమ్ముతూ
నగరాలను , పల్లెల్లను , బస్తిలను
ఒకటేమిటి ఏది కన బడితే దానిని
అపరిశుభ్రం చేస్తూ
ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తూ
పందుల వలే రొప్పుతూ దొర్లుతూ
దేశాన్ని మురికి కూపంగా చేస్తున్న
మన ప్రజా నీకాన్ని చూసి
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో ఉన్న కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి చేద్దామని అనుకొన్నా
నా మటుకు నేను ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడ్ని !
7
బస్సు ప్రయాణం
నరకానికి పుష్పక విమానం
బస్సులో కూర్చు న్న మాటే గానీ
ఎక్కడ ఏ లారీ కి గుద్దుతాడో
ఎంత మంది ప్రాణాలు గాల్లో కలుస్తాయో
ఎక్కడ కాలిపోతుందో , ఎక్కడ పగిలి పోతుందో
ఎక్కడ మునిగి పోతుందో అన్న టెన్షన్ తో
తాగొచ్చి నడిపే డ్రైవర్ మహిమో
లంచాలకు మరిగిన అధికారుల మహిమో
లైసెన్సు లేని డొక్కు బస్సులను
స్పీడ్ ప్రమాణాలను పాటించని బస్సులను
రోడ్డు సిగ్నళ్ళు చూడకుండా దూరిపొయ్యె వాహనాలను
విచ్చల విడిగా తిరిగే వాహనాలను చూసి
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో ఉన్న కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి చేద్దామని అనుకొన్నా
నా మటుకు నేను ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడ్ని !
Bhanu Vaaranasi
28.01.2015
( సిరీస్ 2)
---------------------------------------------
5
ఉపన్యాసాలతో ఊర్ల మీద పడి
చెప్పేదొకటి చేసే దోకటయి
నటిస్తూ ... నటనలో ఏడుస్తూ ...
పేదల నోట్లో మన్ను పోస్తూ
అధికారాన్ని అడ్డం పెట్టుకొని
దందాలు చేస్తూ , కమీషన్లు కుమ్మేస్తూ
అధికార దుర్వినియోగంతో
తస్మదీయులకు కాంట్రాక్టు పనులప్పగిస్తూ
కోట్లు కోట్లు దండుకొంటున్న
రాజకీయ నాయకులను చూసి
సిగ్గుతో తలవంచుకొని
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో ఉన్న కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి చేద్దామని అనుకొన్నా
నా మటుకు నేను ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడ్ని !
6
నా ఇల్లు బాగా ఉంటే చాలని
పక్కింటి వాళ్ళ ఇంట్లో చెత్త బోస్తూ
రోడ్లు , బస్సు స్టాండ్లు , ఆసుపత్రులు
బడులు , గుడులు , పార్కులు
ఒకటేమిటి సమస్త ధరిత్రి నంతా
నానా గలీజు చేస్తూ
ఎక్కడ బడితే అక్కడ ఉచ్చలు పోస్తూ
గోడల మీద ఉమ్ముతూ
నగరాలను , పల్లెల్లను , బస్తిలను
ఒకటేమిటి ఏది కన బడితే దానిని
అపరిశుభ్రం చేస్తూ
ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తూ
పందుల వలే రొప్పుతూ దొర్లుతూ
దేశాన్ని మురికి కూపంగా చేస్తున్న
మన ప్రజా నీకాన్ని చూసి
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో ఉన్న కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి చేద్దామని అనుకొన్నా
నా మటుకు నేను ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడ్ని !
7
బస్సు ప్రయాణం
నరకానికి పుష్పక విమానం
బస్సులో కూర్చు న్న మాటే గానీ
ఎక్కడ ఏ లారీ కి గుద్దుతాడో
ఎంత మంది ప్రాణాలు గాల్లో కలుస్తాయో
ఎక్కడ కాలిపోతుందో , ఎక్కడ పగిలి పోతుందో
ఎక్కడ మునిగి పోతుందో అన్న టెన్షన్ తో
తాగొచ్చి నడిపే డ్రైవర్ మహిమో
లంచాలకు మరిగిన అధికారుల మహిమో
లైసెన్సు లేని డొక్కు బస్సులను
స్పీడ్ ప్రమాణాలను పాటించని బస్సులను
రోడ్డు సిగ్నళ్ళు చూడకుండా దూరిపొయ్యె వాహనాలను
విచ్చల విడిగా తిరిగే వాహనాలను చూసి
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో ఉన్న కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి చేద్దామని అనుకొన్నా
నా మటుకు నేను ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడ్ని !
Bhanu Vaaranasi
28.01.2015
No comments:
Post a Comment