నా మొదటి కథల సంపుటి
--------------------------------
పాఠక మహాశయులకు శుభాభినందనలు.
2022 ఏప్రిల్ నెల 17 వ తేదీన ' *సంస్కార సమేత రెడ్డి నాయుడు* ' నా తొలి నవలను అవిష్కరించాను. అలాగే అదే తేదీన నా మూడవ కవితా సంపుటి ని ' *మట్టి వేదం* ' ను అవిష్కరించాను .
నేను పుట్టి , పెరిగినది , చదువు కొన్నది గ్రామీణ వాతావరణం కాబట్టి ఆ అనుభవాలు , ఆ సంఘటనలే ఈ పుస్తకంలోని కథలు. అలాంటి కథలే నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని నా అభిప్రాయం . నేను నా జీవితంలో చూసిన , అనుభవించిన సంఘటనలే నా కథలకు ప్రేరణాలు. నాకు రాయల సీమ మాండలికం లో వ్రాయడం ఇష్టం . ' పెద్ద కొడుకు ' , ' రెడ్డమ్మ ' , ' కర్మాను సారే! ' , ' వాన దేముడా ! ' , ' పల్లె రమ్మంటుంది -పట్నం పొమ్మంటుంది ' లాంటి కథలు గ్రామీణ జీవిత నేపథ్యంలో వాస్తవానికి దగ్గరగా వ్రాసిన కథలు .
ఈ కథల సంపుటికి ముందు మాట వ్రాసి ఇచ్చిన కళారత్న , ప్రముఖ రచయిత, కవి , విమర్శకుడు , గజల్ కవి, జర్నలిస్ట్ , శ్రీ బిక్కి కృష్ణ గారికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను.
అలాగే ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది , మంచి కవర్ డిజైన్ తో పుస్తకాన్ని ముద్రించి పాఠక లోకానికి అందించిన సాహిత్యాభి లాషి , సాహిత్య పోషకులు శ్రీ సంపత్ కలిమిశ్రీ గారికి , కలిమిశ్రీ ప్రచురణలు, విజయ వాడ వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపు కొంటున్నాను.
ఈ కథా సంపుటిని ఎంతో దిగ్విజయంగా ఆవిష్కరించిన నవ్యాంధ్ర రచయితల సంఘం కార్యవర్గ నిర్వాహకులకు నా ధన్యవాదములు తెలుపు కొంటున్నాను.
అలాగే ఈ కథల్ని వివిధ పత్రికల్లో చదివి నన్ను ఎప్పటి కప్పుడు ఆదరిస్తున్న పాఠక మహాశయులకు నమస్సులు తెలుపుకొంటున్నాను.
నాకు జన్మ నిచ్చి , విద్యా బుద్దులు నేర్పించిన నా తలిదండ్రులు కీ.శే . శ్రీ వారణాసి కృష్ణ మూర్తి రావు గారికి , కీ.శే. శ్రీమతి స్వర్ణాంబ గారికి నా హృదయ పూర్వక ప్రణామములు సమర్పిస్తున్నాను.
ఈ మొదటి కథా సంపుటిని పాఠక లోకానికి అందించాలనే నా కల నెరవేరింది.
భవదీయుడు
వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
తేదీ : 15.11.2022
ప్రతులు కావలసిన వారు
మీ వివరాలు కామెంట్ బాక్స్ లో పెట్టండి .
లేదా ఫేస్‌బుక్ లో చూడండి.
No comments:
Post a Comment