Wednesday, October 7, 2020

చావు ఇప్పుడు ఆరడగుల దూరం

 చావు ఇప్పుడు ఆరడగుల దూరం 


-----------------------------+++++-----------+++++++

అయినా ఇప్పుడు ఏం మునిగి పోయిందని? 

బాధ పడుతూ చీకటి గృహాల్లో కూర్చొంటే ఏం లాభం? 

కళ్ళకు కనబడని కరోనా క్రిమి సమాధులకు గుంతలు త్రవ్వుతోంది

నవ్వులు..అటలు..పాటలు మాయ మయ్యాయి

చిన్నారుల జీవితాలు నాలుగు గోడల జైళ్ళ మధ్య 

లాప్ టాప్ లకు అతుక్కు పోయ్యాయి

బడులన్నీ ఆన్ లైన్ క్లాసులై అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి

ఆఫీసులు, మార్కెట్లు  భయ భయంగా నోర్లు తెరచు కొని చూస్తున్నాయి

పనులు లేక పస్థులున్నాయి‌ కొన్ని చితికిన బతుకులు

ఈ గాలి ఈ నేల ఈ నీరు ఈ వూరు వదలి ఎక్కడికెళ్ళినా బ్రతుకు భారమే!

వలస బ్రతుకుల పాదాల రక్తం ఎండి పోయిన రోడ్లను ముద్దాడుతోంది 

కానీ కరోనా మహమ్మారికి  దయ ఎక్కడిది? 

నీకు తెలియకుండా నిర్భయంగా ముక్కులో దూరి నీ వూపిరి తిత్తుల్లో  తిష్ట వేస్తుంది కరోనా

మరణానికి ప్రిస్క్రిప్షన్ రాసి కార్పోరేట్ అసుపత్రి లక్షల బిల్లుల మీద నీ చావు క్షణాల్ని లెక్కిస్తుంది

జీవాయుధాలు మనుషుల మీద ఇలా దాడి చేస్తాయని అనుకోలేదు

ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని  భయంతో బ్రతుకు తామని అనుకోలేదు

అయినా ఇప్పుడు మనకు కావాల్సింది అత్మ స్థైర్యం 

మనో  నిబ్బరం.... 

కరోనాను పాతిపెట్టడానికి  మనం కొన్ని కట్టుబాట్లు నేర్చుకోవాలి 

ఆరడుగుల భౌతిక దూరం , ముహానికి ఒక మాస్కు 

చేతిలో సానిటైజర్ ,  పరిసరాల పరిశుభ్రత 

కరోనా రాక్షస  సంహారం చెయ్యడానికి నేను ఇంకో అవతారం ఎత్తాలి 

ఎందుకంటే....

చావు ఇప్పుడు ఆరడుగుల దూరంలో ఉంది!!

రచన: వారణాసి భానుమూర్తి రావు



 (ప్రపంచంలో కరోనా వ్యాధి లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకొంటోంది. ఒక మన దేశంలోనే ఒక్క లక్ష మంది ఇప్పటికి మరణించారు. మార్చి 2020  నుండి  విజృంభించిన ఈ కరోనా లేదా కోవిడ్ 19  అన్ని దేశాలకు ప్రాకి జీవితాల్ని‌ చిన్నా భిన్నంచేస్తోంది. ) 









No comments:

Post a Comment