Tuesday, October 6, 2020

పాటే ప్రాణము

 





పాటే ప్రాణము

-----------------------------------

ఒక శకం ముగిసింది

ఒక తరం మురిసింది

నీ పాటలు వింటూ పెరిగాము

నీ మాటలు వింటూ గడిపాము

మా కళ్ళు ఎడారులయినాయి

మా అశ్రువులు ఇంకి పొయినాయి

మా కన్నీటితో నీకు అభిషేకం చేస్తున్నాము

అపశృతి పలుకుతున్న మా ఎద వీణియ 

తిరిగి రాని లోకాలకు  నీవు వెళ్ళావని 

మూగగా రోదిస్తోంది.

నీ గానామృతాన్ని 

కోట్లాది మందికి పంచి ఇచ్చావు

నీ సంగీత సమ్మోహనంతో

లక్షలాది మందికి  స్వాంతన చేకూర్చావు

నలభై వేల పాటలు పాడి

భరత దేశానికి సంగీత సాంరాట్టువి అయ్యావు

అన్నమయ్య పదాలు ఆలపించినా

త్యాగయ్య కృతులు కీర్తించినా

 రామదాసు కీర్తనలు భజించినా

దేవుళ్ళు నీ చెంత చేరి మైమరచి పోతారేమో!

' వేటూరి '  పద ప్రయోగాలను చక్కగా పలికించి

శంకరా నాదశరీరా పరా...వేదం అణువణువున నాదం

వేదాలను ఘోషిస్తూ సంగీత సాహిత్య సమరాజ్నివై

' సిరివెన్నెల '  సాహిత్య గుబాళింపుల సొబగుతో

విధాత తలపున  విరియించినదీ అనాది జీవన వేదం

నీ ఉచ్వాసం ఒక గానంగా

నీ నిశ్వాసం ఒక గమకంగా 

చలన చిత్ర సీమలో పాటను బ్రతికించిన అపర బ్రహ్మవు నీవు

పాటే ప్రాణంగా 

మాటే మంత్రంగా

నీ జీవితాన్ని సార్థకం చేసుకొన్న  గాన గంధర్వుడా...

ఇంద్రాది దేవతలకు

నీ గానామృతాన్ని పంచడానికి  భువినుండి దివి కేగినావా?

నీ రెండవ రాక కోసం బాలూ

వేచియుంటాము ఎన్ని యుగాలయినా

బాలూ నువ్వు మాకు కావాలి

మళ్ళీ జన్మించు !.. మళ్ళీ జన్మించు!!

----------------------------------------------------

వారణాసి భానుమూర్తి రావు

హైదరాబాదు

27.09.2020




No comments:

Post a Comment