సంస్కార సమేత రెడ్డి నాయుడు
మొదటి భాగం
రెండు గ్రామాల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం . రాయల సీమ పౌరుషాలు రెండు గ్రామాల మధ్య పెట్టిన కష్టాలు , కన్నీళ్లు . ప్రేమ అనే క్షీర సాగరం నుండి జ్వలించిన కాలకూట విషం ... ఎలా రెండు హృదయాలను కలిపింది , ఎలా రెండు హృదయాలను విడదీసిందీ , ఎలా రెండు జీవితాల్ని ఛిన్నా భిన్నం చేసిందీ -- ఆద్యంతమూ మెలికలు తిరిగి , అద్భుతంగా సాగే విచిత్ర ప్రేమల , రాయల సీమల పౌరుషాల కథ ... చదవండి ...
సంస్కార సమేత రెడ్డి నాయుడు
మొదటి భాగం
అది రెడ్డి వారి పల్లి . అది రాయల సీమలో బాహుదా నది ఒడ్డున ఉత్తరం వైపు న్న ఒక కుగ్రామం . పచ్చని పంటలతో కళకళ లాడుతూ ఉన్న సౌభాగ్య సీమ. రాజశేఖర రెడ్డి గారు అక్కడ పెద్ద భూస్వామి . ఆ ఊరులో అతను చెప్పిందే వేదం . అతని మాటే చెల్లు .అలా అని అధికారిక అహంకారం ఏమాత్రం లేని వాడు. ప్రజల్లో నాలుకలా మెలిగే మంచి మనిషి . దయార్ద్ర హృదయుడు . కట్టు బొట్టు తో తెలుగు తనం ఉట్టి పడే భోళా మనిషి. రెడ్డి గారి తాత ముత్తాతలు కట్టించిన భద్ర కాళీ గుడిలో పూజలు జరుగుతున్నాయి . ఆ రోజు రాజ శేఖర రెడ్డి గారి పుట్టిన దినం . ఊరు ఊరంతా కదిలి వచ్చింది . ఆ రోజు అన్నదానం గూడా ఉంది ఊర్లోని జనాల కందరికి.
అర్చన చేయిస్తున్నారు రెడ్డి గారు. నూతన పట్టు వస్త్రాలతో , తల మీద పాగాతో తళ తళ మని మెరిసిపోతున్నాడు .
మమ ఉపాత్థ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభో శోభన ముహూర్తే ...
ద్వితీయ పరార్థే ... వైవస్వంత మన్వంతరే ....కలియుగే ... ప్రధమ పాదే ... వ్యవహారిక చంద్ర మానేనా..
''అయ్యా .. తమరి నామం ..గోత్రం ...'' అర్చకులు మంత్రాన్ని ఆపుతూ అడిగాడు .
'' జయ రామ నాయుడు .. కౌశిక గోత్రం ' ' అని నవ్వుతూ చెప్పాడు రెడ్డి గారు.
అందరూ ఆశ్చ్యర్య పోతారు.
''ఊ.. కానియ్యండి స్వామీ ! '
ఎవ్వరూ మాట్లాడడానికి , అడగడానికి సాహసించ లేదు.
'' కౌశిక గోత్రోద్భ్యవస్య ... జయ రామ నాయుడు నామ ధే యస్య ...ధర్మ పత్ని సమేతస్య .. ఆయురారోర్గ్య ఐశ్వర్యాభివృద్దర్థం ...
అర్చక స్వామి అష్టోత్తర నామార్చ న చేస్తున్నాడు .
హరతి , తీర్థ ప్రసాదాలు ఇచ్చాడు రాజ శేఖర రెడ్డి గారి సకుటుంబ సమేతానికి .
అందరూ గుడి వదలి రెడ్డి గారింటి వైపు బయలు దేరారు . అన్నదాన కార్య క్రమంలో పల్లె పల్లె అంతా హుషారుగా పాల్గొన్నారు.
***********************************************************************************
(ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల , ఏ వర్గ , ఏ సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)
(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష తెలుపు తారు గదూ? )
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
No comments:
Post a Comment