ఒభామ !
------------------
''నీ పేరు ?''
'' ఒభామ ''
'' ఏ ఊరు ? ''
'' సౌదీ అరేబియా లో ఒక పట్టణం ''
'' నీ వయసెంత ? ''
'' నలభై ఆరు ''
'' ఏమి చదువు కొన్నావ్ ? ''
'' ఆర్ధిక శాస్త్రంలో పట్టా పుచ్చు కొన్నాను . నాకు ఇంగ్లీషు, అరబిక్ భాషలు బాగా వచ్చు ''
'' నీకు పెళ్లయిందా ?''
'' ఓ ..పెళ్లయింది.. ఎంత మంది భార్యలు ఉన్నారో గుర్తు లేదు ''
''ఎంత మంది పిల్లలు ?''
''గుర్తు లేదు.. సుమారు వంద మంది ఉండొచ్చు ''
'' అన్నట్టు మరచి పొయ్యాను .. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ? ''
'' ఉద్యోగం కోసం వచ్చాను . ''
'' ఇక్కడ వేకెన్సీ ఉందని నీకెవ్వరూ చెప్పారు ? ''
''పేపర్లో మీ ప్రకటన చదివాను . ''
''ఇంతకీ నీకు ఉద్యోగం ఎందుకు ?''
'' సౌదీ అరేబియా లో మా షేకు కు ఎసరు పెట్టాను .. ఆ దేశము నుండి నన్ను తరిమి వేశారు .
అలాగే ఆఫ్గనిస్తాన్ కి వెళ్లి కుంపటి పెట్టాను . అక్కడ అమెరికా వాళ్ళ బాంబులు తట్టుకోలేక ఇక్కడకు వచ్చాను . ''
'' నా దగ్గర పని చెయ్యడానికి నీకు ఏమి అనుభవం ఉంది ?''
'' చాలా అనుభవం ఉంది. చక్కగా మాట్లాడ గలను. రాయ గలను . కోట్ల రూపాయల్లో వ్యాపారం చెయ్యగల అనుభవం ఉంది. ముందు నాకు ఉద్యోగం ఇప్పించండి. తరువాత చూడండి నా తడాకా ! ''
అతడు నా ముందర కుర్చీలో కూర్చొన్నాడు . పేరు తమషాగా ఉంది . ఒభామా . విశాల మైన కళ్ళు. ముఖంలో అలసట . ఆత్రుత కన్పిస్తున్నాయి . వయసులో చిన్నవాడయినా అరవై ఏళ్ల వ్యక్తి లాగా కన బడుతున్నాడు . ఇంకేమి ప్రశ్నలు వెయ్య దలఁచు కోలేదు .
పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు . గాబట్టి ఉద్యోగం ఇవ్వదలచు కొన్నాను.
'' ఒభామా ... యూ అర్ సెలెక్టడ్ . జీతం నెలకు పది వేలు. రేపు వచ్చి అప్పాయింటుమెంటు ఆర్దర్ తీసుకోని వెళ్ళు. 'అన్నాను.
'' చాలా థాంక్స్ సార్. మీ సహాయం ఈ జన్మలో మరచి పోలేను ' అన్నాడు ఒభామా .
ఒభామా నాకు షేక్ హాండి చ్చి బయటకు నడిచాడు .
------------------------------------------------------------------------------------------------------------------
ఒభామా ఉద్యోగంలో చేరి నెల రోజులయింది. చెప్పిన పని చక్కగా చేస్తున్నాడు .
ఎప్పటిలాగే నేను ఆఫీసుకొచ్చాను. అంతే షాక్ కొట్టినట్లు అయ్యింది నాపని. నా కుర్చీలో ఒభా మా కూర్చొన్నాడు . కా ళ్ళు టేబిల్ మీదకు సాచి కూర్చొన్నాడు. భుజం దగ్గర ఒక్క పెద్ద తుపాకి పెట్టుకొన్నాడు.
'' ఒభామా ., ఏమిటి ఎవరిచ్చారు నీకీ అధికారం ? ''
'' నువ్వే ఇచ్చావు అధికారం. '' అన్నాడు ఒభామా .
'' అన్యాయం. అక్రమం. ఎవరక్కడ ? '' అరిచాను నేను .
'' ఇక్కడ ఎవ్వరు లేరు.. నోరు చించుకొని అరవమాక . ఈ రోజు నుండి నేనే బాస్ . నేను చెప్పినట్లు నువ్వు వినాలి '' అని చేతిలో ఉన్న తన తుపాకిని నాపై గురి పెట్టాడు .
ఒభామా చేతిలో ఉన్న తుపాకిని చూసి భయ పడి చచ్చి పొయ్యాను నేను. ఎక్కడ ఠపీ మని
కాలుస్తాడా అని .
' మిష్టర్ ..నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి .. ఈ తెల్ల కవర్లలో ఈ తెల్ల పొడిని వేసి ఈ అడ్రస్సులనన్నిటికి పంపించు ' అని అన్నాడు ఆర్డర్ జారీ చేస్తూ .
'' అన్యాయం.. మోసం. దగా .. ఇది ఆంత్రాక్స్ పౌడర్ .. చేతుల్తో తాకితే ఠపీ మని చస్తాను ''
'' నువ్వేమి చావవులే! ఈ ప్రొటెక్టివ్ గ్లౌజులని , మాస్కుని , చేతులకు, ముఖానికి వేసుకొ.. కవర్లను సీలు చేసి అమెరికాలో ఉన్న ఈ అడ్రసులుకి పంపాలి .. వెంటనే పోస్ట్ ఆఫీసుకు వెళ్ళు . ఇది నా ఆర్డర్ . లేదంటే ... '' అని తన తుపాకీ చూపించాడు ఒభామా .
భయంతో బిక్క బిగుసుకు పోయాను నేను .
చచ్చినట్లు పౌడర్ ఆ కవర్లలో నింపి , అడ్రస్సులు రాసి , సీలు చేసి పోస్ట్ ఆఫీసుకు పరుగెత్తాను .
-----------------------------------------------------------------------------------------------------------------
'' ఏయ్ నిన్నే... ''
'' చెప్పు ఒభామా !''
'' పేరుతొ పిలవకు . సార్ అను . ''
'' ఎస్ సర్''
'' ఈ రోజు నుండి మన ఆఫీసులో అందరూ తెల్ల బురకాలు వేసుకోవాలి . ఆడవాళ్లు ఉద్యోగం చెయ్య గూడదు . ఇంట్లోంచి ఆడవాళ్లు బయటకు రాగూడదు . ఆడ పిల్లలు చదవ గూడదు. మీ ఇంట్లో టివి లు , రేడియో లు ఉంటే వెంటనే పగల గొట్టాలి . మగ వాళ్లు ప్యాంట్లు వేసుకోగూడదు . మీరంతా ఆరేళ్లకే కొక్క సరి షేవింగ్ చేసుకోవాలి . బ్లేడులు, కత్తెరలు , రేజర్లు నిషిద్ధం. సోపులు , షాంపూలు వాడగూడదు. తలకు నూనె పూయ్యొద్దు . ముఖానికి పౌడర్లు, క్రీ ములు వాడగూడదు. మల మూత్ర విసర్జన ఆఫీసుల్లో చెయ్యగూడదు. కాఫీలు, టీలు, బ్రాందీ , విస్కీలు, తాగగూడదు. ఇది నా ఆర్డర్. మన ఆఫీసులో పని చేసే వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ''
' ఒభా మా .. ఇది అన్యాయం ' అని అరచినాను బిగ్గరగా .
' ఎవడ్రా నువ్వు ? ఎక్కడినుండో వచ్చి మా మీద అధికారం చూపిస్తావు ' అంది ఒక లేడీ టైపిస్టు .
అంతే .. ఒభామా తుపాకీ తీసి ఆమె వైపు గురి చూసి పేల్చి వేసాడు. ఆమె కెవ్వున అరచి క్రింద పడి పోయింది .
ఈ పరిణామానికి నా కాళ్ళు వంకరలు తిరిగి పొయ్యాయి. భయంతో స్పృహ కోల్పోయి క్రింద పడి పొయ్యాను.
--------------------------------------------------------------------------------------------------------------
నిద్ర లేచే సరికి ఒభామా బిగ్గరగా నవ్వుతున్నాడు నాకేసి .
' నువ్వు కోమా లోకి వెళ్లి ఆరు నెల్ల యింది . ఇప్పుడే నిద్ర లేచావు ' అన్నాడు ఒభామా నాకేసి చూసి .
పరిసరాల్ని చూస్తే ఏదో హాస్పిటల్లో ఉన్నట్లుంది నేను .
' నా భార్యా .. పిల్లలు .. నా ఆఫీసు ,.. నా స్టాఫ్ ఎక్కడ ? '
' అందరు బాగున్నారు . కాకపొతే కొన్ని మార్పులు .. చేర్పులు '
అందరు వచ్చి నాతో కర చాలనం చేస్తున్నారు . మగ వాళ్లంతా గడ్డాలు పెంచి నన్ను కలుస్తున్నారు . వాళ్ళ మొహాలు అంద విహీనంగా కరడు గట్టి ఉన్నాయి. ఆడవాళ్లు అసలు కన బడ్డం లేదు. వాళ్లందరికీ నేను పరిచయమే . కానీ వాళ్ళు నాకు పరిచయంగా ఉన్నట్లు లేదు.
'' ఒభామా.. నా భార్య ఎక్కడ ? ''
'' అదో .. ఇక్కడ ''
'' ఏమండి ? '' కోమలి కాళ్ళు , చేతులు కట్టేసారు . ఆమె ఏడుస్తోంది.
'' ఏమయ్యింది కోమలీ ? ''
'' ఆడవాళ్లు ఆఫీసులకు రావద్దంటే మీ ఆవిడ ఆరుసార్లు వచ్చింది. షాంపూలు , సోపులు వాడొద్దంటే ఇంటి నిండా అవ్వే . ఏమి చేసుకొంటావో , చేసుకో - అని బెదిరించింది . దీనికి శిక్ష ఏమిటో తెలుసా ? '' ఒభామా గర్జించాడు .
''తెలీదు '' అని తల ఊపాను .
''ఉరి శిక్ష . రేపే మన ఆఫీసు ప్రాంగణంలో ఆమెను ఉరి తీయడానికి ఏర్పాట్లు జరుగు తున్నాయి'' . అన్నాడు ఒభామా .
'' ఒభామా ! '' బిగ్గరగా అరిచాను . స్పృ హ తప్పినట్లయింది మళ్ళి .
--------------------------------------------------------------------------------------------------------------
లేచి చూసే సరికి కోమలి ఒళ్ళంతా ఒక బురఖా లాంటిది వేసినట్లుంది . ఆమె గొంతుకు నులి త్రాడు తగిలించాడు . ఆ త్రాడుకు ఒక గిలక ఆధారంతో ఇంకొక ప్రక్కకు లాగి ఉంది .
తనకు అర్థమై పోయింది . కోమలికి కాస్సేపట్లో ఉరి శిక్ష అమలు కాబోతుంది .
''భగవాన్. ఏమిటి పరిక్షా ?'' ఏడ్చేసాను .
''కోమలీ '' అని బిగ్గరగా అరచి ఆమె కేసి పరుగెత్తాను .
ఇంతలో ఒభామా వెనక్కి లాగాడు నన్ను .
'' శిక్ష అమలు జరిగి తీరాల్సిందే ! ఇది నా ఆర్డర్ . ఎవడ్రా అక్కడ ? తాడు లాగండి ''
'' కోమలి ..నో ..ఒబామా .. ప్లీజ్ ..నా భార్యని రక్షించు . నా పిల్లల్ని రక్షించు . నేను ఈ దేశం వదలి పారి పోతాను . నా ఆస్థి అంతా నీకే రాసిస్తాను . మమ్మల్ని ప్రాణాలతో వదిలెయ్యి . బ్రతికుంటే బలి సాకు అయినా తిని బ్రతుకు తాము . ఒసామా .. ప్లీజ్ '' అని గట్టిగా అరుస్తున్నాను .
'' ఏమయ్యిందండి .. ఏమయ్యింది ? మేమంతా బాగానే ఉన్నాము గదా ? '' నా శ్రీమతి పక్క మీద నుండి తట్టి లేపుతుంది .
ఆదుర్దాగా లేచి కూర్చున్నాను . ఇంత సేపు జరిగింది కలా - నిజమా అని ఒళ్ళు గిల్లుకొని నీళ్లు త్రాగినాను .
'' కోమలి .. పాడుకల వచ్చింది . ఒసామా కలల్లోకి వచ్చాడు '' అని శ్రీమతిని బిగువుగా కౌగలించు కొన్నాను .
''పాడు బి బి సి , సి ఎన్ ఎన్ న్యూస్ లు రాత్రంతా చూడ వద్దన్నాను గదా ? అందుకే ఈ పాడు కలలు '' అంది కోమలి .
శ్రీమతి ఒడిలో చిన్న పిల్లాడిలా నిద్ర పొయ్యాను మళ్ళీ .
------------------------------------------------------------------------------------------------------------------
( ఈ కథ ఎవ్వరిని ఉద్దేశించి రాసినది గాదు . ఇందులోని పాత్రలు , పేర్లు , పరిసరాలు , సంఘటనలు కేవలం కల్పితం. ఈ కథ కేవలం హాస్య రస ప్రధానంగా రాసినది. )
No comments:
Post a Comment