వోటు హక్కు వినియోగించు
శునకమును
కనకపు సింహానమున
కూర్చో బెడితే
రాజకీయ దుశ్సాసనులకు
అందలం కల్పిస్తే
మరో ఐదేళ్ళు అజ్నాత వాసం తప్పదు!
నా కెందుకులే అని
ఈ రోజు గూడా గుర్రు పెట్టి
నిద్ర పొయ్యావంటే
వోటు హక్కున్నా హుళక్కే!
అవినీతి సొమ్ముతో
వోటును నోటుతో కొనే
నాయకుల పని పడదాం!
బలవంతాన బెదిరించే
రాజకీయ రౌడీలను తరిమి గొడదాం!
రాజకీయ గోముఖ వ్యాఘ్రాలను
ఒక కంట కనిబెడదాం!
పేదల బ్రతుకులు మారేలా
బడుగుల జీవితాలు వెలిగేలా
అహర్నిశలు ప్రజా సేవకు అంకిత మయ్యే
రాజకీయ నాయకులకు పట్టం కడదాం!
వ్యవస్థ మారాలంటే
వ్యక్తులు మారాలి
వ్యక్తులు మారాలంటే
విలువలు మారాలి
ఉన్నత విలువలు
వారసత్వంగా రావాలి
అనుభవాల్లోంచి
మంచిని విశ్లేషించాలి
నాయకులు
నడుం కట్టి పని చెయ్యాలి
శ్రమ జీవుల
బ్రతుకుల్లో భరోసా కల్పించాలి
ఒక చరిత్ర పుట చదివితే
అది అజరామరమై
ప్రజల గుండెల్లొ నిలవాలి!
వారణాసి భానుమూర్తి రావు
07.12.2018
శునకమును
కనకపు సింహానమున
కూర్చో బెడితే
రాజకీయ దుశ్సాసనులకు
అందలం కల్పిస్తే
మరో ఐదేళ్ళు అజ్నాత వాసం తప్పదు!
నా కెందుకులే అని
ఈ రోజు గూడా గుర్రు పెట్టి
నిద్ర పొయ్యావంటే
వోటు హక్కున్నా హుళక్కే!
అవినీతి సొమ్ముతో
వోటును నోటుతో కొనే
నాయకుల పని పడదాం!
బలవంతాన బెదిరించే
రాజకీయ రౌడీలను తరిమి గొడదాం!
రాజకీయ గోముఖ వ్యాఘ్రాలను
ఒక కంట కనిబెడదాం!
పేదల బ్రతుకులు మారేలా
బడుగుల జీవితాలు వెలిగేలా
అహర్నిశలు ప్రజా సేవకు అంకిత మయ్యే
రాజకీయ నాయకులకు పట్టం కడదాం!
వ్యవస్థ మారాలంటే
వ్యక్తులు మారాలి
వ్యక్తులు మారాలంటే
విలువలు మారాలి
ఉన్నత విలువలు
వారసత్వంగా రావాలి
అనుభవాల్లోంచి
మంచిని విశ్లేషించాలి
నాయకులు
నడుం కట్టి పని చెయ్యాలి
శ్రమ జీవుల
బ్రతుకుల్లో భరోసా కల్పించాలి
ఒక చరిత్ర పుట చదివితే
అది అజరామరమై
ప్రజల గుండెల్లొ నిలవాలి!
వారణాసి భానుమూర్తి రావు
07.12.2018
No comments:
Post a Comment