అమరావతి - మన కలల కాణాచి
-------------------------------------------
నాడు విశ్వ కర్మ సృష్టించాడు 'ఇంద్రుడి' కోసం
ఒక అమరావతి ఇంద్ర లోకపు రాజ దానిగా !
నేడు ఈ 'చంద్రుడు ' సృష్టించాడు ఆంధ్రుల కోసం
ఒక అమరావతి నవ్య ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా !
దక్షిణ కాశిగా అమరావతి - అమరలింగేశ్వర స్వామి అధిపతి
శాతవాహనుల శౌర్య క్షేత్రం - బుద్ధుడు నడయాడిన పుణ్య క్షేత్రం
పంచారామాలలో అమరా రామం - అమరేశ్వరాలయం
ప్రపంచ దేశాలలో అమరావతి - అజరామరం
ఆంధ్రులుగా పుట్టడమే మన అదృష్టము
అమరావతి రాజధానిగా మన కంటూ ఒక రాష్ట్రము
దిశ దశలా వ్యాపించును తెలుగు వారి ఔన్యత్యము
నలుదిశలా ప్రభవించును తెలుగు వారి నైపుణ్యము
అమరావతి పేరు వింటే పులకరించును మది
దేవతలు తిరుగాడే దివ్యమైన భూమి ఇది
ధరణి కోట వెలిసింది పౌరుషాల గడ్డగా !
శాతకర్ణి పాలించిన తెలుగు నేల సాక్షిగా !
కృష్ణమ్మ గల గలల తో - ప్రకృతి పచ్చని సోయగాలతో
సిరుల పంటలు దొర్లినవి - మన ఆంధ్ర నేలలో !
భాగ్య సిరులు కురిసినవి - ప్రతి తెలుగు ఇంటిలో !
కృషితో నాస్థి దుర్భిక్షం - అమరావతి అచంద్ర తారార్కం !
No comments:
Post a Comment