దాసరి దర్శకేంద్రుడికి అక్షర నివాళి
----------------------------------------
సరి లేరు నీ కెవ్వరు దాసరి
పాల కొల్లులో పుట్టిన మన తెలుగు సిరి
నాలుగు దశాబ్ధాల తెలుగు సినీ ప్రస్థానంలో
నూట యాభై సినిమాల దర్శక రత్న దాసరి
తాతా మనమడితో సాగించిన సినీ ప్రస్థానం
అప్రతిహతంగా సాగింది మీ దర్శక దండయాత్ర
తెలుగు సినీ జగత్తులో మైలు రాయిగా నిలచింది మీ దర్శక ప్రతిభ
అవార్డుల పంట మీ ఇంటి ముంగిట వాలింది
సకల కళా విశారదులు మీరు
తెలుగు చలన చిత్ర సీమలో రారాజు మీరు
మాటల మాంత్రికుడు ...పాటల సృష్టికర్తవు
కథా బ్రహ్మవి...సంభాషణల చతురిడివి
రాజకీయ జీవితం సాగించి
ఉదయం పత్రిక రథ సారధిగా
సినీ వినీలాకాశంలో ఒక్క ధ్రువ తారగా
తెలుగు జాతి గుండెల్లో నిలిచి నారు మీరు
అచంద్ర తారార్కమూ!
మీకిదే మా అక్షరాంజలి!
రచన: వారణాసి భానుమూర్తి రావు
No comments:
Post a Comment