అమ్మ - ఒక అమ్మాయి
మనస్సును వివస్త్ర చేసి
అనుమానంతో అవమానించి
చీర కోంగుతొ వ్రేలాడ దీసిన ఆమె శవాన్ని
అబద్దాల పోస్ట్ మార్టం లో ఖననం చేసి
రెండవ పెళ్ళికి సిద్ద మయ్యే మగాసురులకు వందనం !
బస్సుల్లో , రైళ్లల్లో
కార్లల్లో , సినిమా హాళ్లల్లో
హాస్టల్లో , కాలేజిలల్లో
స్కూళ్ళల్లో , షూటింగ లల్లొ
వెంట బడి , వెంట బడి
ఆమె స్త్రీత్వాన్ని జుర్రుకోవాలని చూసే మగాధములకు వందనం !
మామ , తాత , బాబాయి
నాన్న , అన్న , అంతా మనవాళ్ళే
ఎదురింటి అంకుల్ , పక్కంటి టీచర్
సంగీతం నేర్పించే మాష్టారు
వాళ్ళ తిమ్మరి చూపులు భరించే శక్తి లేక
మౌనంగా రోదించే చిన్నారికి
గొప్ప వ్యవస్థ ను అందించిన మగ సమాజానికి వందనం !
నఖ శిఖ పర్యంతము
కళ్ళ తోనే అందాలను జుర్రుకొని
ద్వందార్తాలతో ప్రేమను ఒలక బోసి
పని కంటే ప్రేమ పనులకు ఇంక్రిమెంట్ ఇస్తూ
పరువాలను ఒలకబోసిన వారికి ప్రమోషన్ లిస్తూ
ఆఫీసుల్లో రొమాన్సు డ్రామా లాడుతున్న మగ అధికారులకు వందనం !
మగతనం ఉన్నదని విర్రవీగకు మగ మహారాజా !
'భూమ్మీద సుఖ పడితే తప్పు లేదురా' అన్న పాత పాట ను పాడకు
జంతువుకు మనిషికి తేడా లేదని నిరూపించకు
మన అమ్మ గూడా ఒక ఆడదేగా ?
ఉద్రేకంలో తప్పు చేసి ఊచలు లెక్క బెట్టకు !

No comments:
Post a Comment