పల్లవి :
అమ్మ వానమ్మ వానమ్మ వానమ్మా
దివి నుంచి భువికి దిగి రావమ్మా // అమ్మ //
చరణాలు :
తప్పులెన్నో చేసినామమ్మా
మమ్ము క్షమియించి కిందికి రావమ్మా // అమ్మ //
వాన సుక్కల్ని ఒడిసి పట్ట లేదమ్మా
ఇంకుడు గుంతల్ని తవ్వ లేదమ్మా // అమ్మ //
అడవుల్ని నరికి వేసినామమ్మో
చెట్లన్నీ తగల బెట్టి నామమ్మో //అమ్మ //
దోసిళ్ళతో నీరు నింపుతామమ్మా
లోగిళ్ళలో చెట్లు పెంచుతామమ్మా // అమ్మ //
దయ చేసి కిందకు రావమ్మా
నీకు చేతులెత్తి మొక్కుతామమ్మా // అమ్మ //
మేఘాలు మా పైకి తోలమ్మా
మా ఊర్ల చెరువులు నింపమ్మా //అమ్మ //
గుంత లన్నీ తవ్వి నామమ్మా
చుక్క నీరు ఇక వదల బోమమ్మా // అమ్మ//
భానుమూర్తి
24. 04. 2016
No comments:
Post a Comment