మట్టి వేదం
----------------------------------
మట్టి లోనే పుడతావు
మట్టి లోనే పెరుగు తావు
ఎవరినో అమ్మా అంటావు
ఎవరినో నాన్నా అంటావు
ఎవరో నీకు అన్నా చెల్లి అవుతారు
ఎవరినో పెళ్లి చేసు కొంటావు
ఆమెవరో నీకు అంతవరకూ తెలియదు
అయినా జీవితాంతం ఆమెతో బ్రతుకుతావు
ఎవరినో కంటావు
వాళ్ళ కోసం నానా యాతన పడుతావు
వాళ్ళే జీవిత సర్వస్వం అనుకొంటావు
నా అనుకోన్న వాళ్ళు గూడా నీకు దూరం అవుతారు
నిన్ను నమ్ముకొన్న నీ ఇల్లాలు నిన్ను వదలి శాశ్వితంగా వెళ్లి పోతుంది
అపుడు నీది ఒంటరి బ్రతుకు అవుతోంది
అపుడు నువ్వు శూన్యంతో సహా జీవనం చేస్తావు
జీవన సత్యాలు అపుడు నీకు గోచర మవుతాయి
అపుడు అనుకొంటావు నువ్వు ...
మరణం సత్య మని ...!
మరణం నిత్య మని ...!
మట్టి కోసం నీ మనో నేత్రం తెరచు కొంటుంది
మట్టి దైవత్వ మని
మట్టి పవిత్ర మని
మట్టి బంధ మని
మట్టి అనుబంధ మని
మట్టి జీవిత మని
మట్టి బ్రతుకు అని
మట్టి రాగ మని
మట్టి అనురాగ మని
మట్టి లో పుట్టావని
మట్టి లోనే నిర్యాణ మని !!
వారణాసి భాను మూర్తి
31.. 5. 2015
No comments:
Post a Comment