లంచావతారం అను ఒక శత సహస్రావతారం !
---------------------------------------------------------
ఇన్సులిన్ సూదులు గుచ్చుకొంటూ
బి పి , షుగర్ మాత్రలు మింగుకొంటూ
ఉబ్బసాలు , శ్వాస కొస వ్యాధులు శక్తిని హరిస్తుంటే
డిప్రెషన్ సైతాను సతాయిస్తుంటే
బతుకు బండిని లాగ లేక
చస్తూ బతుకుతూ
బతుకుతూ చస్తూ
నిర్జీవమైన జీవితాన్ని గదుపుతున్న ఓ అధికారీ !
కోట్లు కూడబెట్టావు
లంచాలు మరిగి విల్లాలు , ప్లాట్లు , అపార్ట్మెంట్లు , ఫారం లాండ్లు
ఇల్లంతా వజ్ర వైడుర్యాలు పొదిగిన అలంకరణలు
నీ ఆస్తుల జాబితా వెల కట్ట లేనిది
బంగారు కంచాల్లొ భోంచేసిన అదృష్ట జాతకుడివి నువ్వు
అప్పనంగా వచ్చిన లక్ష్మిని నీ ఇంట్లో చూసి మురిసిపోయావు
ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని , అధికారంతో , అహంకారంతో
అందల మెక్కావు !
అమాయకుల రక్తం పిండి లంచాల్ని తిన్నావు
గాని ఓ అధికారి !
చివరకు ఏమయింది ?
బ్రెస్ట్ కాన్సర్ తో నీ శ్రీమతి నలబై ఏటనే చని పోయింది
వయసోచ్చి న నీ కూతురు నీ కారు డ్రైవర్ తో లేచి పోయింది
రాజ కుమారుడి లా పెరిగిన నీ కొడుకు కార్ రేస్ అని ఔటర్ రింగ్ రోడ్డు
ఆక్సిడెంట్ లో మరణించాడు
ఇపుడు నువ్వు ఏకాకివి
కోట్లు ఉన్నా కడుపు నిండా తిన లేని వాడివి
ఈ విశ్రాంత దశలో నువ్వు అవిశ్రాంతంగా నరక యాతన పడుతున్నావు
గాని ఒక్క సూత్రం గుర్తు పెట్టుకో
లంచాన్ని రక్షించు
ఆ లంచం నిన్ను శిక్షి స్తుంది !
ధర్మాన్ని రక్షించు
ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది !!
భాను వారణాసి
15.05. 2015

No comments:
Post a Comment