మూగ జీవాలు
----------------------------------
కట్టెలు ఇరిసినట్లు
మక్కెలు ఇరగ్గోడుతున్రు
గడ్డి మోపు కట్టినట్లు
మా కాళ్ళు సేతులు కట్టి పడేస్తున్రు
నోరు లేదనే కదా
మా జీవాల్ని ఆగమాగం సేస్తున్రు
ఆటోల్లో సూడండ్రి సూడండ్రి
ట్రాలీల్లొ సూడండ్రి సూడండ్రి
లారిలల్లో సూడండ్రి సూడండ్రి
బండ్లల్లో సూడండ్రి సూడండ్రి
పాన మున్నదన్న లెక్క మరిసిపోయి
మమ్మల్ని సెత్త లెక్క తీసుకు పోతున్రు
గొర్రెలు పోట్టీళ్ళు మేకలు
ఆవులు దున్నపోతులు బర్రెలు
కోళ్ళు సేపలు
తినుడు ఏదయినా సరే
మా బొక్కెలు ఇరగ్గొట్టి
సిలువలు ఏసీ
తాళ్ళతో కట్టి
మేకులు దిగ్గొట్టి
కాళ్ళ రక్తం కారుతున్నా
చర్మం సీక్కు పోయినా
కను పాపలు జారిపోయినా
మీకు లెక్క లేదు
మా జాతి బాధ మీకు సమజయిత లేదు
మాకు మాటలు రావనే గదా
మమ్మల్ని గిట్ల సేస్తున్రు
మా తలకాయలల్తో
కాళ్ళతో సేతులతో
బిరియానిలు సెసుకోన్రి
అమ్మోరికి మా తల కాయలు నరికి
బలి ఇయ్యండ్రి
మేం పుట్టిందే అందుకు
మిమ్మల్ని కుషి గా పెట్టే విందుకు
గానీ మనుషుల్లారా !
మమ్మల్ని కసాయి వాడికి ఈడ్చే ముందు
జర్ర కనికరం సూపండ్రి
మమ్మల్ని కాళ్ళు సేతులు కట్టేసి
గొనె సంచుల్లొ కుక్కేసి
తిండి నీళ్ళూ పెట్టక
మమ్మ ల్ని మార్కెట్లకి తరలించొద్దండ్రి
మా అంతిమ పయనం సుఖంగా జరిగేటట్లు సూడండ్రి
అన్నల్లారా ! అయ్యల్లారా !అమ్మల్లారా !
అక్కల్లారా ! సేల్లెల్లారా !
మీకిదే మా సలాం
మీకిదే మా నమస్కారం
మీకిదే మా విన్నపం
మమ్మల్ని సచ్చే ముందయినా జంతువుల్లా సూడండ్రి !
సచ్చే ముందు మమ్మల్ని సంతోషంగా అయినా సావనివ్వండ్రి !!
వారణాసి భానుమూర్తి రావు
----------------------------------
కట్టెలు ఇరిసినట్లు
మక్కెలు ఇరగ్గోడుతున్రు
గడ్డి మోపు కట్టినట్లు
మా కాళ్ళు సేతులు కట్టి పడేస్తున్రు
నోరు లేదనే కదా
మా జీవాల్ని ఆగమాగం సేస్తున్రు
ఆటోల్లో సూడండ్రి సూడండ్రి
ట్రాలీల్లొ సూడండ్రి సూడండ్రి
లారిలల్లో సూడండ్రి సూడండ్రి
బండ్లల్లో సూడండ్రి సూడండ్రి
పాన మున్నదన్న లెక్క మరిసిపోయి
మమ్మల్ని సెత్త లెక్క తీసుకు పోతున్రు
గొర్రెలు పోట్టీళ్ళు మేకలు
ఆవులు దున్నపోతులు బర్రెలు
కోళ్ళు సేపలు
తినుడు ఏదయినా సరే
మా బొక్కెలు ఇరగ్గొట్టి
సిలువలు ఏసీ
తాళ్ళతో కట్టి
మేకులు దిగ్గొట్టి
కాళ్ళ రక్తం కారుతున్నా
చర్మం సీక్కు పోయినా
కను పాపలు జారిపోయినా
మీకు లెక్క లేదు
మా జాతి బాధ మీకు సమజయిత లేదు
మాకు మాటలు రావనే గదా
మమ్మల్ని గిట్ల సేస్తున్రు
మా తలకాయలల్తో
కాళ్ళతో సేతులతో
బిరియానిలు సెసుకోన్రి
అమ్మోరికి మా తల కాయలు నరికి
బలి ఇయ్యండ్రి
మేం పుట్టిందే అందుకు
మిమ్మల్ని కుషి గా పెట్టే విందుకు
గానీ మనుషుల్లారా !
మమ్మల్ని కసాయి వాడికి ఈడ్చే ముందు
జర్ర కనికరం సూపండ్రి
మమ్మల్ని కాళ్ళు సేతులు కట్టేసి
గొనె సంచుల్లొ కుక్కేసి
తిండి నీళ్ళూ పెట్టక
మమ్మ ల్ని మార్కెట్లకి తరలించొద్దండ్రి
మా అంతిమ పయనం సుఖంగా జరిగేటట్లు సూడండ్రి
అన్నల్లారా ! అయ్యల్లారా !అమ్మల్లారా !
అక్కల్లారా ! సేల్లెల్లారా !
మీకిదే మా సలాం
మీకిదే మా నమస్కారం
మీకిదే మా విన్నపం
మమ్మల్ని సచ్చే ముందయినా జంతువుల్లా సూడండ్రి !
సచ్చే ముందు మమ్మల్ని సంతోషంగా అయినా సావనివ్వండ్రి !!
వారణాసి భానుమూర్తి రావు