దాడి
--------------------------
కొన్ని వాదాలు ఎందుకు పుడతాయో తెలీదు
వితండ వాద మనీ , పిడి వాదమనీ
వాడి వాదం వాడి వేదం అయినపుడు
వాడి వాదాన్ని పట్టుకొని వాడు ఊగుతూ ఉంటాడు ఈ లోకంలో
నిజమే ...
కొందరు మనుషులు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు
అర్థాలకు పెడర్థాలు తీస్తూ
పెడర్థాలకు విపరీత అర్థాలు తీస్తూ
వాడు బ్రతకడం శాశ్వితం అనుకొంటాడు
అందుకే వాడు బ్రతికున్నంత కాలమూ
వాడి వాదంలో మనం బ్రతకాల్సిందే !
అసలు మనం జంతువులను చూసి ఎందుకు భయ పడాలి ?
మనుషుల్ని చూసి భయ పడాలి గానీ !
ఆలోచిస్తే జంతువు ఆకలయితేనే దాడి చేస్తుంది
కానీ మనిషి నిరంతరం దాడి చేస్తూనే ఉంటాడు !
భాను వారణాసి
22.02 . 2015

No comments:
Post a Comment