గుర్తు కొస్తున్నాయి
----------------------------------------------------------------
అమ్మ అపురూపంగా చూసుకొనే తన పుట్టింటి పట్టు చీరను నీ కిచ్చి నపుడు
అల్మారా లో భద్రంగా దాచుకొని అప్పుడప్పుడు చూసుకొంటూ
అమ్మను తలచుకొని అమ్మను నీలో ఆవాహన చేసుకొనేందుకు
ఆ పట్టు చీరె చూసినప్పుడల్లా అమ్మ నీకు గుర్తు కొస్తుంది
నాన్న నీ కిచ్చిన తన హెచ్ ఎం టి వాచ్
నీ జీవితాన్ని కాలంతో పరుగులు తియ్యమని
చెపుతున్నట్లు నాన్న నీతోనే ఉండి నిన్ను
నడిపిస్తున్నట్లు నీకు ఆ వాచ్ ని చూసి నప్పుడల్లా నాన్న గుర్తుకొస్తాడు
ఆరవ తరగతిలో నీ జామెట్రీ బాక్సు
లలిత కుఇచ్చావని నాన్న నిన్ను చివాట్లు పెడితే
ఇప్పటికీ భద్రంగా దాచుకొన్న ఆ జామెట్రీ బాక్సు ను చూసినప్పుడల్లా
ఏడుస్తూ సారీ చెప్పి తిరిగి ఇచ్చేసిన లలిత గుర్తుకొస్తుంది
టూరింగ్ టాకీస్ లో మొదటి ఆట మొదలు పెట్టేముందు
పరుగులు తీసి నెల టికెట్ కొని ఆ సినిమా చూసిన బాల్యమంతా
గుర్తుకొస్తుంది నీ కిపుడు ఆ సినిమా పేరు విన్నప్పుడు గానీ
లేదా అ సినిమా లోని పాట విన్నపుడు గానీ
నువ్వు ఎసి కార్లో కూర్చొని ఎఫ్ ఎం లో ఒక
ప్రేమనగర్ పాటో దసరా బుల్లోడు పాటో విన్నప్పుడు
నీ కాలేజీ జీవితం ,నీ మదురమైన యౌవనం రోజులు
గుర్తు కొచ్చి అలా పరిసరాల్ని మైమరచి పోతావు
ఆకాశ వాణి ప్రభాత గీతం విన్నా , సిగ్నేచర్ గీతం విన్నా
నీ మనస్సు పరుగులు తీస్తుంది గతం వైపు
ఒక రైలు కూత విన్నా , గుడిలో గంటల నాదం విన్నా
మసీదులో నమాజు పిలుపు విన్నా , సుప్రభాతం విన్నా
ఒక కవిత చదివినా , ఒక పాత పాట విన్నా
తనువు పులకరించిపొతుంది , మనసు పరవశించిపోతుంది
ఒక్క సారిగా గతం తాలూకు స్మృ తులు
గుర్తు కొచ్చి మనల్ని మైమరిపిస్తాయి !!
భాను వారణాసి
18. 02. 2015

No comments:
Post a Comment