సంఘర్షణ
---------------------------------------------
నిన్నటి వరకు నీడలా ఉన్నవాడు
ఈ రోజు మాయమయ్యాడు
నిన్నటి దాక కబుర్లు చెప్పిన వాడు
ఈ రోజు కనుమరగయ్యాడు
కొన్ని క్షణాలు
ఏంతో విలువైనవి
పోగుట్టుకొంటే
మళ్లి అసలు తిరిగిరావు
కని పెంచిన నీ కూతుర్ని అత్తవారింటికి పంపించే సమయాన
నీ గుండెల్ని పిండి చేసే స్తుంది
అల్లారుముద్దుగా పెరిగిన నీ కొడుకు
అమెరికానో మరేదో సుదూర తీరాలకు వెళ్ళే సమయాన
నీ దుఃఖం కట్టలు తెంచుకొని పారుతుంది
నీ సమస్యలు తనవిగా భావించిన నీ నేస్తం దూరమయిన సమయాన
నీ కన్నీరు కట్టలు తెగి ప్రవహిస్తుంది
జీవితంలో కొన్ని ఘట్టనలు , సన్నివేశాలు
మనల్ని అలానే కట్టి పడివెస్తాయి
మనం మనవే , మనవారే అనుకొన్న వన్నీ
మనల నుంచి దూరమవుతాయి
మనల్ని మానసిక క్షోభ కు గురి చేస్తాయి
మన వాళ్ళే కాదు , మనం పెంచుకొన్న పిల్లి కూనలు
కుక్క పిల్లలు , లేగ దూడలు ,చిట్టి చిలకమ్మలు
ఆసాంతం మనల్ని ప్రేమ గుహల్లోకి తోసి వేస్తాయి
వాటితో మన అనుభందం ఇక లేదని తెలిసి నపుడు
ఆ గుహల్లోనే మనల్ని శాశ్వి తంగా సమాధి చేసేస్తాయి
ఒక్కొక్కసారి మనింట్లో పెరుగుతున్న
పారిజాతం చెట్టు , మందార పూలు
నిన్ను పలకరించినట్లే ఉంటాయి
గాలికి వూగు తున్న కొబ్బరి ఆకుల సవ్వడి
వేప చెట్టు నుండి వస్తున్న చల్లని గాలి
నీతో మాట్లాడు తూనే ఉన్నట్లు ఉంటుంది
అపార్ట్ మెంట్ ల కోసం ఆ ఇంటిని పగుల కొట్టినపుడు
మూగగా రోదిస్తున్న మొక్కలు నిన్ను పిచ్చి వాణ్ని చేస్తాయి
కలలు కనే రాత్రిళ్ళు మనల్ని నిద్రపోనియ్యవు
పాత జ్ఞాపకాలు వెంటపడి మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి
జ్ఞాపకాల పరిష్వంగణాలల్లొ మన మనస్సు వాటి కోసం ఆక్రందన చెందుతుంది
అనుభూతుల కారకాలు మన నుండి దూరంగావెళ్లి పొయ్యాక
మనకు మిగిలింది శూన్యమే అని అన్పిస్తుంది
చివరకు మన నీడ గూడా మనల్ని వదలి పెట్టి వెళ్లి పోతుందేమో !
భాను వారణాసి
10. 02. 2015

No comments:
Post a Comment