నాన్నా అమ్మా !
-------------------------------------------------
నాన్నా అమ్మా !
మీరో క్కక్కసారి ఒకరకంగా ఎందుకు మారతారో
నా చిన్న బుర్రకు అర్థం కాదు
ఎండా కాలంలో వడగళ్ళ వాన కురిసినట్లు
వానా కాలంలో వడ గాల్పులు ఉన్నట్లు
ముద్దులొలికె మా బాబు అంటూ ముద్దాడ తారు
మారాం చేస్తే ఎక్కడ ఎలా కొడతారో తెలియదు
తోడ పాయసం అంటూ నా చర్మం కమిలి పోయ్యేట్లు గిల్లుతారు
తప్పు ఏమిటంటే నాన్న కళ్ళద్దాలు పగలగోట్టానని
నా కెట్లా తెలుసు నాన్న అద్దాలు పగిలి పోతాయని ?
నేను అన్నం తినలేదంటూ నోట్లో కుదిపి కుదిపి పెడతారే
అన్నం రుచిగా లేదంటూ నేనెలా చెప్పేది ?
నా కంత జ్ఞానం లేదే !
అన్నం తిన లేదని అమ్మ నా మీద అలిగింది
అమ్మ కెలా చెప్పాలి నేను ఏ తప్పు చేయ లేదని !
అల్లరి చేసానంటే డాక్టర్ సూది వేస్తానంటారు
డాక్టర్ సూది అంటేనే నాకెంత భయం అని మీకెలా తెలిపేది ?
మీ టివి సీరియల్స్ కి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో నని
నన్ను నిద్ర పొమ్మంటారు
నిద్ర పోక పోతే బూచాడో స్తాడంటారు
రాత్రంతా నాకు బూచి కలలు వస్తున్నాయని నేనలా మీకు చెప్పేది ?
రాత్రిళ్ళు నేను నిద్ర పోవడం లేదని గట్టిగా మీరు తిట్టు కొంటారు
మీరలా ఫైటింగ్ చేస్తుంటే నా చిన్ని గుండె గట్టిగా కొట్టుకొంటుందని మీకెలా చెప్పేది ?
అసలు మీది ప్రేమనా లేదా కోపమా ?
క్రమశిక్షణ తో గూడిన ప్రేమనా ?
అర్థం కాలేదని మీ కెలా చెప్పేది ?
మీ భుజాల మిద వాలి పోవాలని ప్రేమగా మీ దగ్గరికొస్తే
ఆఫీసు టెన్షన్ అంటూ నాన్న నన్ను విసిరివేస్తారు
నేను పడిన బాధ మీకెలా చెప్పను ?
బుడి బుడి అడుగుల వాణ్ని
ఇంకా నడక గూడా సరిగా రాని వాణ్ని
మాటలు గూడా సరిగా పలక లే ని వాణ్ని
రెండేళ్ళు గూడా నిండని మీ గారాల పుత్రుణ్ణి
నన్నర్థం చేసుకోండి నాన్న అమ్మా !
క్రమ శిక్షణ పేరుతొ నన్ను నా బాల్యాన్ని
నరకం చేస్తున్న నా ప్రియమైన నాన్నా అమ్మా !
నన్నర్థం చేసుకొంటారు గదూ ?
భాను వారణాసి
09. 02. 2015

No comments:
Post a Comment