కలలు
----------------------------------------------------
అసలు నువ్వెందుకు కలలు కంటావో
అసలు కలలు నీకెందుకు వస్తాయో నా కర్థం గాదు
కలల్లో నీ ఏడ్పులు , నీ నవ్వులు
నీ మాటలు , నీ పాటలు
నీ వెటకారాలు , నీ హాస్యోక్తులు
నువ్వెందుకు ఏడుస్తావో
అంతలోనే ఎందుకు నవ్వుతావో నా కర్థం గాదు
కల కల్ల అని తెలిసి గూడా
కలల్ని కంటూనే ఉంటావు
పొద్దున్నే లేచి ఏమి తెలియని వాడిలా నటిస్తావు
అవునా నేనా ఎడ్చానా , నవ్వానా అని
తిరిగి నాకే ప్రశ్నలు
కలల్ని కను
గాని ఆ కలల్ని సాకారం చెయ్యి
అని గదా పెద్ద వాళ్ళు అన్నారు
నువ్వు మాత్రం కలల్ని కని నీ కళ్ళు ఉబ్బి పొయ్యాయి
కలలో నువ్వు మాట్లాడుతున్నావో , ఏడుస్తున్నావో
అని నేను చెప్పేవరకూ నీకేమీ తెలియదు
అసలు నీకు కలలు ఎందుకు వస్తాయో !
వచ్చినా నీకు ఎందుకు గుర్తు ఉండదో !
నిన్ను కలలు కనడం చూసిన వారు మాత్రం
శాశ్వితంగా కలలు కనడం మానేస్తారు !
భాను వారణాసి
12. 02. 2015
----------------------------------------------------
అసలు నువ్వెందుకు కలలు కంటావో
అసలు కలలు నీకెందుకు వస్తాయో నా కర్థం గాదు
కలల్లో నీ ఏడ్పులు , నీ నవ్వులు
నీ మాటలు , నీ పాటలు
నీ వెటకారాలు , నీ హాస్యోక్తులు
నువ్వెందుకు ఏడుస్తావో
అంతలోనే ఎందుకు నవ్వుతావో నా కర్థం గాదు
కల కల్ల అని తెలిసి గూడా
కలల్ని కంటూనే ఉంటావు
పొద్దున్నే లేచి ఏమి తెలియని వాడిలా నటిస్తావు
అవునా నేనా ఎడ్చానా , నవ్వానా అని
తిరిగి నాకే ప్రశ్నలు
కలల్ని కను
గాని ఆ కలల్ని సాకారం చెయ్యి
అని గదా పెద్ద వాళ్ళు అన్నారు
నువ్వు మాత్రం కలల్ని కని నీ కళ్ళు ఉబ్బి పొయ్యాయి
కలలో నువ్వు మాట్లాడుతున్నావో , ఏడుస్తున్నావో
అని నేను చెప్పేవరకూ నీకేమీ తెలియదు
అసలు నీకు కలలు ఎందుకు వస్తాయో !
వచ్చినా నీకు ఎందుకు గుర్తు ఉండదో !
నిన్ను కలలు కనడం చూసిన వారు మాత్రం
శాశ్వితంగా కలలు కనడం మానేస్తారు !
భాను వారణాసి
12. 02. 2015
No comments:
Post a Comment