Saturday, January 3, 2015

అంతరాలు


అంతరాలు
----------------------------------------------------------

వాళ్ళు  బ్రతుకు  సునామీ లో  మరణిస్తున్న వాళ్ళు
వాళ్ళు జీవన పోరాటంలో ఓడిన సైనికులు
ఎంత కనీ పోరాడాలి
పోరాడి పోరాడి పోరాడి
అలసి సొలసి అలసి సొలసి
మరణ శిలపై  నిలబడిన వాళ్ళు

రోడ్ల మీదనో
చెత్త కుప్పల ప్రక్కనో
పాడు పడిన   రైలు  పెట్టెల  మద్యనో
మురుగు నిటి నాలాల ప్రక్కనో
సహవాసం  చేస్తూ  జీవిస్తున్న  జంతువులు వాళ్ళు
సంఘంలో వెలివెయ్య బడ్డ  శ్రాపగ్రస్తులు

అభివృద్ధి పేరుతొ  కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వాలు
మెట్రో రైళ్ళు , రింగు రోడ్లు , మల్టి ఫ్లెక్ష్లు , ఐ దు నక్షత్రాల హోటళ్ళు
ఇన్ని వస్తున్నా వీళ్ళ బ్రతుకులు మారలేదే !
ప్రభుత్వాలు మారుతున్నా
వీళ్ళ  కడుపులు నిండలేదే
లక్ష కోట్ల బడ్జెట్లు అన్నా
లక్షణ మైన ఒక్కపూట  భోజనం దొరకలేదే !

మనిషిని స్వార్థపు భూతం మింగేసింది
దురాశా వాదం   దూరాల్ని పెంచేసింది
ఉ న్నది  చాలదని  ఊ ళ్ళ ని  మింగేసింది
శ్రమ శక్తిని  ధన శక్తి  బానిసని  చేసింది

అంతరాల తలరాతలు తగ్గే  వరకూ
ఆర్థిక సూత్రాలు పని చెయ్యవు
 జి డి పి ఎంత పెరిగినా
ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు
మనిషి ఇంకొక మనిషి కోసం బ్రతికే వరకూ
ఈ వ్యవస్థ లో మార్పు రాదు

03.. 02. 2015   భాను వారణాసి

No comments:

Post a Comment