Sunday, January 4, 2015

ఆడ పిల్ల మా కొద్దు బాబోయ్ !

ఆడ పిల్ల మా కొద్దు బాబోయ్ !

-----------------------------------------------
అమ్మా
ఎవరమ్మా  వాళ్ళు ?
వంకర టింకర  గాళ్లు ?


చూపులన్నీ  తినేట్లు
చేష్ట లన్ని  తన్నేట్లు

అమ్మా
ఎవరమ్మా వాళ్ళు ?
వంకర టింకర గాళ్ళు ?

పైకి  మర్యాదస్తులే
లోన  శా డిస్టులు

తాగోచ్సిన  వాచ్ మాన్ శంకరయ్య
ఒంటరిగా పడుకొన్నపదేళ్ళ  కూతుర్ని  ఏమో చేసినాడంట
ఆ పిల్ల శవమై  పోయింది

బడి కెళ్ళిన  ఉషా రాణి ని
మేష్టారు బట్టలిప్పి  నిలుచోమన్నాడంట
ఆ పిల్ల బడి మానేసింది

ట్యూషన్ మేష్టారు
లెక్కలు రావని తోడ పాయసం  పెడుతూ 
మల్లిక  అంగాలన్ని  తడిమాడంట 
ఆ పిల్ల ట్యూ ష న్  మానేసింది


ఆటో హుస్సేన్
తిన్నగా గండిపేటకెళ్ళి
ఒక అమ్మాయిని  రేప్ చేసాడంట
ఆ పిల్ల అక్కడే శవమై తేలింది

మామయ్య పక్కన పడుకొన్న
పాపానికి  ఒళ్లంతా తడిమి తడిమి
ఏమో చేసాడంట  మాధవిని

రైల్లో  పొతున్నపుడు
పై బెర్త్ లో ఉన్న అంకుల్
రాత్రంతా   శాలిని  రొమ్ముల్ని తాకుతున్నడంట

మొన్న సినిమా కెళితే
పక్క నున్న పోరగాడు
నిమ్మి ని ముద్దు పెట్టు కొన్నడంట

యాడికి  పోయినా
ఇదేందమ్మా   అడ పిల్లోల్లకి  గహచారం
మంచి మానవత్వం లేదా అమ్మా
వాళ్ళు ఒక  అమ్మకి పుట్టిన సన్యాసి గాళ్ళే గదా ?

చిన్న పిల్లోల్లని బతక నీరా  ఏమి ?
మాకు బతికే హక్కు లేదా ?
అడ పిల్లల్ల్ని కన్న అమ్మల్లారా ?
మీ మొగుళ్ళకి చెప్పండి
మీ కొడుకులకి చెప్పండి
మీ నాన్నలకి చెప్పండి
మీ తాతయ్యలకి చెప్పండి
యాడ  చూసినా ఈ  కతలే !
అమ్మల్లారా !
ఆడ పుట్టుకే  శాపమంటే
మాకు బొడ్డు  తెగుతూనే
మా గొంతులు  నులిపెయ్యండి !!

( అనగనగా ఒక  చిన్న ఊర్లో  ఒక ఆడపిల్ల  . ఆ పిల్ల పడిన మానసిక వేదనే  ఈ కవిత )
(అభం శుభం  తెలియని చిన్నారి ఆడపిల్లల కందరికి  ఈ కవిత అంకితం )

 

No comments:

Post a Comment