Thursday, January 1, 2015

కన్నా అర్థమయింది !

కన్నా అర్థమయింది !



చందమామ  వెన్న  ముద్దలు 
వెండి గెన్నెలొ కలిపి  చిట్టి  తండ్రికి 
తిని పిస్తాడన్న  ఆశలు  లేవు

అమ్మ చేతి  ముద్దలు  ఆయాల  చేతుల్లో
నలిగిపోయి  వాడిపోయ్యాయి
 తల్లి ప్రేమ కు తల్లడిల్లింది చిన్నారి  మనసు
అమ్మ  అనే పిలుపును  మమ్మీ  మాయం చేసింది
చిన్నారి  భాష  అమ్మకు  అర్థం కాని లాటిన్ భాష లా ఉంది
అమ్మ పాడే పాట అరిగిపోయిన  గ్రామ్ ఫోన్  రికార్డు లా ఉంది

సర్రొగేట్  మదర్  తొమ్మిది నెలల
కాంట్రాక్ట్ తో  పెట్టె బేడా సర్దు కొని వెళ్ళిపోయింది
అందుకే అమ్మ అందం  నలగని పట్టు చీరలా  ఉంది
అమ్మ నాన్నల  ఆస్తులకు వారసుడు పుట్టాడు
గానీ అమ్మ తనం  సిగ్గు తో తలవంచు కోనింది


కన్నా నువ్వెందుకు  అమ్మకు  దూరమవుతున్నావో  
ఇప్పుడు  నాకు అర్థమయింది !

02. 01. 2015  - భాను వారణాసి
తోలి రచన  తోలి వత్సరంలో





 

No comments:

Post a Comment