ప్రకృతి నీతో మాట్లాడుతూనే ఉంటుంది !
1
ఆర్జన లోనే నీ జీవితం
డస్సి పోయింది
బతుకు తెంపెర లాట లోనే
నీ కథ ముగింపు కోస్తోంది
వార్ధక్యం నీకు తెలియకుండానే
నిన్ను మింగుతోంది
నీ గుండె ఇక మిగిలిన
క్షణాల్ని లెక్కపెడుతోంది
నీ ఎక్స్పెరీ డేట్
ఫైనల్ అయింది
2
అరాటాల ఉప్పెనలో
ఇంకా దేని కోసం పరుగు ?
నీ సంపాదన నింపాదిగా
లాకర్లో నిద్ర పోతోంది
నిజమే ! నువ్వు నిజంగా
లోకాన్ని జయించావు
గానీ మిత్రమా
3
చల్లని ఉదయాన్ని
ప్రభాత సూర్యుణ్ణి
కిటికీ లోంచి పడుతున్న నీరెండని
గడ్డి పువు మిద జాలు వారే తుషార బిందువును
అద్దం ముందు కిచ కిచ మంటున్న ఊర పిచ్చుకను
కావు కావు మంటున్న కాకి అరుపును
అదో ప్రక్కింట్లో ఉన్న కొబ్బరి చెట్ల ఆకులు లికి కదలి నప్పుడు వచ్చే సడిని
ఆకాశ వాణి విన్పించే వందేమాతర గేయాన్ని
'సడి చెయ్యకొ గాలి , సడి చె య్యకే' అన్న రేడియో లో వచ్చే పాత పాటని
ఫిల్టర్ కాఫీ వేస్తున్నపుడు ఆ కాఫీ వాసనని
వాన చుక్కలు వరండా మీద నుండి కిందకు పడుతున్న సవ్వడిని
ఏక్కడో ఏటి మిద పోతున్న తీతవ పక్షి పాటను
స్నానాల గదిలో నిన్ను పలకరించే నీటి భాషను
గుడి లోంచి వచ్చే సన్నాయి వాయిద్యాన్ని
బడి లోంచి చిన్నారుల కేకల్ని
ఇలా ఎన్నని చెప్పను ?
ఏమని చెప్పను ?
భగవంతుడు మన కిచ్చిన శ్రవణ సంపద
అనుభూతి కి లోనవ్వాలి గానీ
ప్రతి రాయి రప్ప , ప్రతి మాను మాకూ
నీతో మాట్లాడతాయి
అసలుకి నువ్వు
గమనించావో లేదో మిత్రమా
ప్రకృతి నీతో
ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది !
11.01. 2015
భాను వారణాసి
1
ఆర్జన లోనే నీ జీవితం
డస్సి పోయింది
బతుకు తెంపెర లాట లోనే
నీ కథ ముగింపు కోస్తోంది
వార్ధక్యం నీకు తెలియకుండానే
నిన్ను మింగుతోంది
నీ గుండె ఇక మిగిలిన
క్షణాల్ని లెక్కపెడుతోంది
నీ ఎక్స్పెరీ డేట్
ఫైనల్ అయింది
2
అరాటాల ఉప్పెనలో
ఇంకా దేని కోసం పరుగు ?
నీ సంపాదన నింపాదిగా
లాకర్లో నిద్ర పోతోంది
నిజమే ! నువ్వు నిజంగా
లోకాన్ని జయించావు
గానీ మిత్రమా
3
చల్లని ఉదయాన్ని
ప్రభాత సూర్యుణ్ణి
కిటికీ లోంచి పడుతున్న నీరెండని
గడ్డి పువు మిద జాలు వారే తుషార బిందువును
అద్దం ముందు కిచ కిచ మంటున్న ఊర పిచ్చుకను
కావు కావు మంటున్న కాకి అరుపును
అదో ప్రక్కింట్లో ఉన్న కొబ్బరి చెట్ల ఆకులు లికి కదలి నప్పుడు వచ్చే సడిని
ఆకాశ వాణి విన్పించే వందేమాతర గేయాన్ని
'సడి చెయ్యకొ గాలి , సడి చె య్యకే' అన్న రేడియో లో వచ్చే పాత పాటని
ఫిల్టర్ కాఫీ వేస్తున్నపుడు ఆ కాఫీ వాసనని
వాన చుక్కలు వరండా మీద నుండి కిందకు పడుతున్న సవ్వడిని
ఏక్కడో ఏటి మిద పోతున్న తీతవ పక్షి పాటను
స్నానాల గదిలో నిన్ను పలకరించే నీటి భాషను
గుడి లోంచి వచ్చే సన్నాయి వాయిద్యాన్ని
బడి లోంచి చిన్నారుల కేకల్ని
ఇలా ఎన్నని చెప్పను ?
ఏమని చెప్పను ?
భగవంతుడు మన కిచ్చిన శ్రవణ సంపద
అనుభూతి కి లోనవ్వాలి గానీ
ప్రతి రాయి రప్ప , ప్రతి మాను మాకూ
నీతో మాట్లాడతాయి
అసలుకి నువ్వు
గమనించావో లేదో మిత్రమా
ప్రకృతి నీతో
ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది !
11.01. 2015
భాను వారణాసి
No comments:
Post a Comment