కవి
కవి బాహ్య ముఖుడే కాదు
అంతః ర్ముఖు డు గావాలి
కవి ఏక కంఠు డే గాదు
దశ కంఠు డు కావాలి
కవి ఆకులో హరితమై
పచ్చదనాన్ని చూడాలి
కవి జల్లులో జల్లునై
తేమను చవి చూడాలి
కవి మట్టిలో రేణువై
మట్టి వాసన చూడాలి
కవి యోగుడై
ప్రపంచాన్ని పరికించాలి
కవి భో గుడై
ఇంద్రియాలను జయించాలి
కవి దేవుడై
ధర్మాని కాపాడాలి
కవి అకాశ మంత
ఎత్తు ఎదగాలి
కవి పాతాళ మంత
లోతు ను చూడాలి
కవి సాగర మంత
సారాన్ని గ్రహించాలి
కవి ఒక్కసారి
విస్పోటనమై భగ్గు మనాలి
కవి తాను కార్చిచ్చై
అధర్మాన్నిబూడిద చెయ్యాలి
కవి తనకు తానై
కరిగి పోవాలి మైనపు ఒత్తిలా
కవి తనకు తానై
ప్రకాశించాలి భానుడిలా
భాను వారణాశి
11. 01. 2015
కవి బాహ్య ముఖుడే కాదు
అంతః ర్ముఖు డు గావాలి
కవి ఏక కంఠు డే గాదు
దశ కంఠు డు కావాలి
కవి ఆకులో హరితమై
పచ్చదనాన్ని చూడాలి
కవి జల్లులో జల్లునై
తేమను చవి చూడాలి
కవి మట్టిలో రేణువై
మట్టి వాసన చూడాలి
కవి యోగుడై
ప్రపంచాన్ని పరికించాలి
కవి భో గుడై
ఇంద్రియాలను జయించాలి
కవి దేవుడై
ధర్మాని కాపాడాలి
కవి అకాశ మంత
ఎత్తు ఎదగాలి
కవి పాతాళ మంత
లోతు ను చూడాలి
కవి సాగర మంత
సారాన్ని గ్రహించాలి
కవి ఒక్కసారి
విస్పోటనమై భగ్గు మనాలి
కవి తాను కార్చిచ్చై
అధర్మాన్నిబూడిద చెయ్యాలి
కవి తనకు తానై
కరిగి పోవాలి మైనపు ఒత్తిలా
కవి తనకు తానై
ప్రకాశించాలి భానుడిలా
భాను వారణాశి
11. 01. 2015
No comments:
Post a Comment