సీమ రైతన్నా !
--------------------------------
యాడ బొయ్యెదన్న
ఏమి పిక్కు తిని
బతకాలన్న
సీమ బతుకులు
సింపిరి బతుకులు
థూ దీ నేమ్మ బతుకులు
బాయిలో దిగి సత్తేనే
బాగు పడే బతుకులు
తెల్లారి లేసి
కాడి మాను ఎత్కొని
మడి కాడ
కపిల తోలు దామంటే
థూ దీనేమ్మ బతుకులు
బాయిలో నీల్లే లేకపాయె
చేను కాడ మడక దున్ని
సేనిక్కాయల పంట ఏస్తే
పెంట పురుగు పాడు జేసే
థూ దీనెమ్మ బతుకులు
శెట్టి కాడ అప్పు మిగిలే
అమ్మి పెల్లి జెయ్యాలని
భూములన్నీ కొదవ బెట్టి
బ్యాంకు లోను తీసుకొంటే
వడ్డి మీద వడ్డీ కట్టి
థూ దీనెమ్మ బతుకులు
భూములన్నీ ఏల మేసిరి
సీమ రైతు కట్టమేమో
నాయకులకు పట్టదాయే
పెబుత్వాలు ఎన్ని వచ్చినా
పరిచ్చితి మారదాయే
సంక్రాంతి వచ్చినా
సంబరాలు లేవాయే
మా సీమ రాయల సీమ
మా సీమ రతనాల సీమ
కొత్త పెబుత్వం కొంతయినా
సీమ కోసం కర్సు బెడితే
మా రైతన్నల తల రాతలు మారుతాయి
మా బీడు మడ్లు సేన్లు బంగారం పండుతాయి
( రాయల సీమ రైతన్నల దుస్థితి చూసి స్పందించిన కవిత )
భాను మూర్తి
08.01. 2015
--------------------------------
యాడ బొయ్యెదన్న
ఏమి పిక్కు తిని
బతకాలన్న
సీమ బతుకులు
సింపిరి బతుకులు
థూ దీ నేమ్మ బతుకులు
బాయిలో దిగి సత్తేనే
బాగు పడే బతుకులు
తెల్లారి లేసి
కాడి మాను ఎత్కొని
మడి కాడ
కపిల తోలు దామంటే
థూ దీనేమ్మ బతుకులు
బాయిలో నీల్లే లేకపాయె
చేను కాడ మడక దున్ని
సేనిక్కాయల పంట ఏస్తే
పెంట పురుగు పాడు జేసే
థూ దీనెమ్మ బతుకులు
శెట్టి కాడ అప్పు మిగిలే
అమ్మి పెల్లి జెయ్యాలని
భూములన్నీ కొదవ బెట్టి
బ్యాంకు లోను తీసుకొంటే
వడ్డి మీద వడ్డీ కట్టి
థూ దీనెమ్మ బతుకులు
భూములన్నీ ఏల మేసిరి
సీమ రైతు కట్టమేమో
నాయకులకు పట్టదాయే
పెబుత్వాలు ఎన్ని వచ్చినా
పరిచ్చితి మారదాయే
సంక్రాంతి వచ్చినా
సంబరాలు లేవాయే
మా సీమ రాయల సీమ
మా సీమ రతనాల సీమ
కొత్త పెబుత్వం కొంతయినా
సీమ కోసం కర్సు బెడితే
మా రైతన్నల తల రాతలు మారుతాయి
మా బీడు మడ్లు సేన్లు బంగారం పండుతాయి
( రాయల సీమ రైతన్నల దుస్థితి చూసి స్పందించిన కవిత )
భాను మూర్తి
08.01. 2015
No comments:
Post a Comment