నేను గుంపులో ఒక్కడిని ! ( మొదటి భాగము )
1
మునిసి పాలిటి గుమాస్తాల , ఆఫీసర్ల కాళ్ళు పట్టుకొని
చెప్పులు అరిగి పొయ్యెలా తిరిగినా
ఇల్లు కడ దామంటే అప్రోవల్ రాదాయే
డెస్క్ కింద చెయ్యి పెడితే గాని
పనులు జరగా వాయె
లంచం కోసం రకరకాల జిమ్మి క్కులు
నోటు పెడితే గాని అటెండర్ గేటు తెరవడు
దక్షిణ పెడితే గాని పేపర్ ముందుకు పోదు
అని రంగా రావు నాతొ అన్నపుడు
నాలో ఉన్న కవి రగిలిపోయ్యాడు
ఏదో ఒకటి చేయ్య మని అడిగినా
కాని నేను మటుకు ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడిని!
2
అమ్మమ్మను తీస్కొని
సర్కారు దవఖాను కెళితే
గేటు కీపర్ అడ్డగించి బెరమాడే
బెడ్డు లేక కింద పడుకొన్నమంటే
పందికొక్కులు దోమలు పిక్కుతినే రాత్రిపూట
దున్నపోతులు డబ్బుకోసం పిక్కుతినిరి పగలుపూట
శవాల్ని అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజిరి దొంగోళ్ళు
అని మా పక్కింటి రంగమ్మ ఏడుస్తుంటే
నాలో ఉన్న కవి రగిలి పొయ్యాడు
ఏదో ఒకటి చేయ్య మని అడిగినా
కాని నేను మటుకు ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడిని!
3
ఇల్లు లేనోడ్ని సామి
పొదుపు చేసి పిఎఫ్ డబ్బులు బోసి
ఆరంకణాల భూమి కొందామని పొతే
అసైనడ్ భూములు తగల బెట్టిరి
రియల్ ఎస్తోతోల్ల మయామాటలు నమ్మి
కొం ప కోల్లెరాయే
బతుకు బజారు పాలాయే
అని మా రంగ సామి మొత్తుకొంటె
నాలో ఉన్న కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి చేయ్య మని అడిగినా
కాని నేను మటుకు ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడిని!
4
పిల్లల చదువులు గాదు గాని
లక్షల్లో డొనేషన్ లు గుంజుతున్నారు
సర్కారి స్కూళ్ళల్లో చదువులు చెప్పరు
ప్రవేటు స్కూళ్ళ ల్లో డబ్బులు లేనోళ్ళ ని రానివ్వరు
కూర్చుంటే ఫీజు, లేస్తే ఫీజు
ఆడుకొంటే ఫీజు ,నిద్రపోతే ఫీజు
నాలుగు ఇంగ్లీష్ ముక్కలు కోసం
కాన్వెంట్ స్కూళ్ళు కార్పోరేట్ స్కూళ్ళు
మా అన్న తన గోడు చెప్పుకొంటే
నాలో ఉన్న కవి రగిలి పొయ్యాడు
ఏదో ఒకటి చేయ్య మని అడిగినా
కాని నేను మటుకు ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడిని!
భాను వారణాసి
22. 01 . 2015
1
మునిసి పాలిటి గుమాస్తాల , ఆఫీసర్ల కాళ్ళు పట్టుకొని
చెప్పులు అరిగి పొయ్యెలా తిరిగినా
ఇల్లు కడ దామంటే అప్రోవల్ రాదాయే
డెస్క్ కింద చెయ్యి పెడితే గాని
పనులు జరగా వాయె
లంచం కోసం రకరకాల జిమ్మి క్కులు
నోటు పెడితే గాని అటెండర్ గేటు తెరవడు
దక్షిణ పెడితే గాని పేపర్ ముందుకు పోదు
అని రంగా రావు నాతొ అన్నపుడు
నాలో ఉన్న కవి రగిలిపోయ్యాడు
ఏదో ఒకటి చేయ్య మని అడిగినా
కాని నేను మటుకు ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడిని!
2
అమ్మమ్మను తీస్కొని
సర్కారు దవఖాను కెళితే
గేటు కీపర్ అడ్డగించి బెరమాడే
బెడ్డు లేక కింద పడుకొన్నమంటే
పందికొక్కులు దోమలు పిక్కుతినే రాత్రిపూట
దున్నపోతులు డబ్బుకోసం పిక్కుతినిరి పగలుపూట
శవాల్ని అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజిరి దొంగోళ్ళు
అని మా పక్కింటి రంగమ్మ ఏడుస్తుంటే
నాలో ఉన్న కవి రగిలి పొయ్యాడు
ఏదో ఒకటి చేయ్య మని అడిగినా
కాని నేను మటుకు ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడిని!
3
ఇల్లు లేనోడ్ని సామి
పొదుపు చేసి పిఎఫ్ డబ్బులు బోసి
ఆరంకణాల భూమి కొందామని పొతే
అసైనడ్ భూములు తగల బెట్టిరి
రియల్ ఎస్తోతోల్ల మయామాటలు నమ్మి
కొం ప కోల్లెరాయే
బతుకు బజారు పాలాయే
అని మా రంగ సామి మొత్తుకొంటె
నాలో ఉన్న కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి చేయ్య మని అడిగినా
కాని నేను మటుకు ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడిని!
4
పిల్లల చదువులు గాదు గాని
లక్షల్లో డొనేషన్ లు గుంజుతున్నారు
సర్కారి స్కూళ్ళల్లో చదువులు చెప్పరు
ప్రవేటు స్కూళ్ళ ల్లో డబ్బులు లేనోళ్ళ ని రానివ్వరు
కూర్చుంటే ఫీజు, లేస్తే ఫీజు
ఆడుకొంటే ఫీజు ,నిద్రపోతే ఫీజు
నాలుగు ఇంగ్లీష్ ముక్కలు కోసం
కాన్వెంట్ స్కూళ్ళు కార్పోరేట్ స్కూళ్ళు
మా అన్న తన గోడు చెప్పుకొంటే
నాలో ఉన్న కవి రగిలి పొయ్యాడు
ఏదో ఒకటి చేయ్య మని అడిగినా
కాని నేను మటుకు ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ గుంపులో ఒక్కడిని!
భాను వారణాసి
22. 01 . 2015
No comments:
Post a Comment