తాతా !
----------------------------------------
తాతా !
లయ తప్పిన నీ గుండె చప్పుడు నాకు వినబడింది
ఆ పచ్చిక మైదానంలో నువ్వు నన్ను ఆడి స్తున్నపుడు
నీ నవ్వులో ఏదో అపశ్రుతి వినబడింది
నువ్వు నన్ను భుజాల మీద వేసుకొని
ఆడిస్తున్నపుడు నీ దేహం వింతగా కంపించడం చూశాను
బహుశా స్వర్గంలో ఉన్న బామ్మ
నీకు గుర్తొచ్చిందేమో !
నువ్వు నాకు రాజు దొంగ కథ చెపుతున్నపుడు
నువ్వేమో ఒక నైరాశ్యానికి లోనయ్యావు
బహుశా నీకు మా చిన్నప్పటి నాన్న గుర్తోచ్చాడేమో !
వేలు పట్టి నడిపించిన నువ్వు
నీ వేలు పట్టి నడిపించే వాళ్ళు లేరనేగా నీ బాధ
నీలో కరుగు తున్న వయస్సు
వణుకు తున్న నీ దేహం
నీ మాట వినలేదనే గదా నీ బాధ
నువ్వు ఇంట్లో ఉన్నపుడు
టామి తో గడిపే టైం నీతో గడపడం లేదనే గదా ?
ప్రేమల్లేని బాందవ్యాల మధ్య
ఎలా నీ శేష జీవితం గడుస్తుందో అనేగా నీ బాధ ?
తాతా !
నువ్వు నాతో అన్నీ చెప్పక పోయినా
నాకన్ని తెలుసు
నువ్వు ఆశించేది
కేవలం కొన్ని ప్రేమానురాగాలు
కలబోసిన క్షణాల్ని మాత్రమే అని
అమ్మ నాన్నలకి నువ్వొక
నిరర్థక మనిషని తెలుసు
కానీ తాతా నీకోసం నేనున్నా
నీ ఎద సవ్వడి చేసే భాష
నాకర్థ మయింది తాతా !
నా బోసి నవ్వులతో
నిన్ను నవ్విస్తాను
సరేనా
నాతొ ఖటిఫ్ చెయ్యవు గదా తాతా ?
21. 01. 2015
No comments:
Post a Comment