తస్మాత్ జాగ్రత్త!
బ్రతుక్కి పారమార్థం లేకుండా
ప్రతి రోజు జనాలు బ్రతికేస్తున్నారు
కొందరు తిండి కోసమే బ్రతుకుతారు
కొందరు బ్రతకడం కోసమే తింటారు
కొందరు డబ్బు కోసం గడ్డి తింటారు
కొందరు డబ్బు కోసం వొళ్ళు నమ్ము కొంటారు
కొందరు ఆలిని , కొందరు కన్న పిల్లల్ని
కొందరు తల్లిని , తండ్రిని అమ్ము కొంటారు
కొందరు అంగాంగాల్ని అమ్ముకొంటారు
కొందరు అంగాల్ని దొంగలిస్తారు
కొందరు డబ్బు కోసం కాళ్ల మీద పడతారు
కొందరు దొంగ నమస్కారాలతో నీ కూష్మాండం బద్దలు కొడతారు
కొందరు నువ్వు వినా వేరే దేవుడు లేదంటారు
కొందరు నువ్వే దేవుడంటారు
కొందరు నీ చెప్పులు మోస్తారు
కొందరు నిన్ను పల్లికిలో మోస్తారు
కొందరు నిన్ను ఆకాశానికి ఎగరేస్తారు
కొందరు నిన్ను మునగ చెట్టు ఎక్కించేస్తారు
కొందరు డబ్బు కోసం ఉన్నవి లేనట్లు , లేనివి ఉన్నట్లు కల్పిస్తారు
కొందరు నిజాల్ని అబద్దం లా చెబుతారు
కొందరు అబద్ధా ల్ని నిజంలా చూపుతారు
కొందరు రాజకీయాలు చేస్తారు
కొందరు అరాచకాలు చేస్తారు
డబ్బు కోసం నానా విధ వేషంబులు
వేస్తున్న నాటాకాల రాయుళ్లతొ
తస్మాత్ జాగ్రత్త !
24. 12. 2014
బ్రతుక్కి పారమార్థం లేకుండా
ప్రతి రోజు జనాలు బ్రతికేస్తున్నారు
కొందరు తిండి కోసమే బ్రతుకుతారు
కొందరు బ్రతకడం కోసమే తింటారు
కొందరు డబ్బు కోసం గడ్డి తింటారు
కొందరు డబ్బు కోసం వొళ్ళు నమ్ము కొంటారు
కొందరు ఆలిని , కొందరు కన్న పిల్లల్ని
కొందరు తల్లిని , తండ్రిని అమ్ము కొంటారు
కొందరు అంగాంగాల్ని అమ్ముకొంటారు
కొందరు అంగాల్ని దొంగలిస్తారు
కొందరు డబ్బు కోసం కాళ్ల మీద పడతారు
కొందరు దొంగ నమస్కారాలతో నీ కూష్మాండం బద్దలు కొడతారు
కొందరు నువ్వు వినా వేరే దేవుడు లేదంటారు
కొందరు నువ్వే దేవుడంటారు
కొందరు నీ చెప్పులు మోస్తారు
కొందరు నిన్ను పల్లికిలో మోస్తారు
కొందరు నిన్ను ఆకాశానికి ఎగరేస్తారు
కొందరు నిన్ను మునగ చెట్టు ఎక్కించేస్తారు
కొందరు డబ్బు కోసం ఉన్నవి లేనట్లు , లేనివి ఉన్నట్లు కల్పిస్తారు
కొందరు నిజాల్ని అబద్దం లా చెబుతారు
కొందరు అబద్ధా ల్ని నిజంలా చూపుతారు
కొందరు రాజకీయాలు చేస్తారు
కొందరు అరాచకాలు చేస్తారు
డబ్బు కోసం నానా విధ వేషంబులు
వేస్తున్న నాటాకాల రాయుళ్లతొ
తస్మాత్ జాగ్రత్త !
24. 12. 2014
No comments:
Post a Comment