ఎక్కడైతే !
ఎక్కడైతే కవిత్వం కరాళ నృత్యం చేస్తుందో
అక్కడ నేనుంటాను
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం శివ తాండవం చేస్తుందో
అక్కడ నేనుంటాను
ఎక్కడై తే కవిత్వం మట్టి గీతాలు రాస్తుందో
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం గజరాజులా ఘీంకరిస్తుందో
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం మత్త కోకిల్లా పాడుతుందో
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం అఘొరాల్లా స్మశాన నృత్యం చేస్తుందో
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం దరిద్రుల ఆకలి కేకలు తగ్గిస్తుందొ
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం శ్రామిక తాడిత పీడిత జనాల్లొ కలుస్తుందో
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం ఆనాధలైన చిన్నారులకు తోడవుతుందో
అక్కడ నేనుంటాను
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం వ్యభిచారానికి బలయిపొయిన ఆడపిల్లలకి అండగా ఉంటుందో
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం వృద్దాశ్రమాల్లో తల్లి తండ్రులకు తోడుగా ఉంటుందో
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం బాల కార్మికుల నరకాన్ని గురించి రాస్తుందో
అక్కడ నేనుంటాను
ఎక్కడైతే కవిత్వం మత కలహాల నిర్భాగ్యుల వెతలు తీరుస్తుందో
అక్కడ నేనుంటాను
అక్కడ నేనుంటాను
27. 12. 2014 @భాను వారణాసి
No comments:
Post a Comment