జీవన ప్రయాణం
ఈ ప్రయాణం
ఏదో ఒక కొత్త గ్రహానికి చేరుకోను న్నట్లు
గ్రహాం తరాలకు ప్రయాణి స్తున్నట్లు
ఈ అమెరికా ప్రయాణం అన్పిస్తోంది
విహంగ వీక్షణం చేస్తున్నపుడు
తెల్లని మేఘాలు గుంపులు గుంపులుగా
పురివిప్పి నాట్యం చేస్తున్నట్లు
ఏదో సందేశాన్ని మానవాళికి చేరుస్తున్నట్లు
భూ మ్యాకాశాల మధ్య సర్రున దూసుకు పోయే
విహంగ రాజాన్ని చూస్తుంటే
మన నాగరికత ఏంతో వేగంగా దూసుకు పోతున్నట్లన్న్పిస్తోంది !
సప్తసముద్రాలు దాటి ప్రయాణిస్తున్నప్పుడు
జీవన వేదం ఒక నాదంలా శ్రావ్యంగా విన్పిస్తోంది
ఆత్మ లన్ని కలిసి పరమాత్మ దర్శనం కోసం
పరుగులు పెడుతున్నారేమో అన్పిస్తోంది
సమస్త విశ్వంలో చై తన్యం వెల్ల విరుస్తోంది
రాత్రి పగలు తేడా లేకుండా
సముద్రాల మధ్య కాంతి పుంజాలు
భూమ్మీద చీకటి వెలుగులు
కనపడుతున్నాయి
నా దేశం ఈ విశాల విశ్వంలో
చిన్న బిందువు లాగా కన్పిస్తోంది
మనిషి మహోన్నతుడు
ఈ విశాల విశ్వాన్ని ఒక గ్రామంగా మలిచేసాడు
మానవాళి సౌభాగ్యానికి
ఎన్నెన్ని మేధస్సులు పని చేస్తున్నాయో !
ప్రతి బంధ కాల్ని అవకాశాలుగా వినియోగిస్తూ
ముందుకు సాగడమే మనిషి పని !!
--------------------భాను వారణాసి
10. 11. 2014 నాడు అమెరికాకు వచ్చిన సందర్భంగా
No comments:
Post a Comment