Thursday, December 22, 2022

మా బడి

 మా బడి

--------

నే నెరిగిన మా బడి

నా మదిలో చెరగిన ముద్ర వేసింది


మా బడిలో 

తెలుగు తనం విరగ బూచేది


మా గురువుల ఆదర్శం

పిల్లల  బ్రతుకు బాటను నడిపించేవి


కుల మత బేధాలు 

ధనిక పేద భావాలు 

మాకు  తెలిసేవి కావు.

 

మా బడి గంట మా ఎదల్లో ఈ నాటికీ 

ధ్వనిస్తున్న డమరుక ధ్వని


ప్రార్థన తో మొదలయ్యే మా పాఠశాల

డ్రిల్లు క్లాసుతో ముగుస్తుంది


అనురాగాల అమ్మ ఒడి మా బడి

గోదారిలా వురకలు బెట్టేది మా తరగతి గది


అప్పట్లో ఆడుకొన్న ఆటలు , పాడుకొన్న పాటలు

మది నుండి నిష్క్రమణ గాని అమర జ్ణాపకాలు


 అయ్యవారి బెత్తంతో తిన్న  దెబ్బలు 

 అవి మరచి పోలేని గుణ పాఠాలు 

 

మేము పాడే మా బడి గీతం 

మమ్మల్ని నడిపించే మా జీవన గీతం


అందుకే మా బడి 

మా అమ్మ ఒడి.


రచన: వారణాసి భానుమూర్తి రావు

హైదరాబాదు



No comments:

Post a Comment