Monday, December 12, 2022

పాపం‌ మా అమ్మా నాన్న!

 

పాపం‌ మా అమ్మా నాన్న!
--------------------
నా చిన్నతనం లో మా అమ్మా నాన్నలే నా లోకం
వారిని ఒక్క క్షణం చూడందే వుండ లేక పొయ్యే వాడిని

నేను కాలేజీ హాస్టల్లో చదువు కొంటున్నప్పుడు
అమ్మా నాన్నల్ని అప్పుడప్పుడు సెలవుల్లో చూస్తూ వుండే వాడిని

నాకు పెళ్ళయిన తరువాత నా శ్రీమతే నాకు
సర్వస్వం అయి పోయింది

నాకు పిల్లలు పుట్టిన తరువాత వారే
నా లోకం అయిపోయింది

నాకు జన్మ నిచ్చిన అమ్మానాన్నలను అసలు చూడడానికి , పలకరించడానికి కుదరడం లేదు

ఎందుకంటే మా అమ్మా నాన్నలని‌ వృద్ధాశ్రమం లో  చేర్పించింది నేనే గదా!

వారణాసి భానుమూర్తి రావు
02.12.2022

No comments:

Post a Comment